Movies: తెలుగు సినిమా స్థాయిని హాలీవుడ్ లెవల్ కి తీసుకెళ్ళిన సినిమాగా ఇప్పుడు ఆర్ఆర్ఆర్ మూవీ ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకుంది. దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ అంతర్జాతీయ చిత్రోత్సవాలలో ప్రదర్శితం కావడంతో హాలీవుడ్ విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంటుంది. అలాగే హాలీవుడ్ లో ప్రముఖ, దర్శకుల మన్ననలు కూడా ఈ మూవీ సొంతం చేసుకుంటుంది. మార్వేల్ సిరీస్ దర్శకుడు కూడా ఆర్ఆర్ఆర్ తన ఫేవరేట్ ఇండియన్ మూవీ అని చెప్పారంటే దాని స్థాయి ఏంటో చెప్పుకోవచ్చు. ఆస్కార్ అవార్డు అందుకోవడానికి అన్ని అర్హతలు ఆర్ఆర్ఆర్ కి ఉన్నాయని అంతర్జాతీయ ఫిల్మ్ క్రిటిక్స్, మ్యాగజైన్స్ కూడా చెబుతున్నాయి.
అయితే ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాత్రం ఆర్ఆర్ఆర్ సినిమాని ఇండియా నుంచి ఆస్కార్ నామినేషన్ జాబితాలో పరిగణించకుండా ఒక గుజరాతీ మూవీని పంపించింది. అది కూడా ఇంకా రిలీజ్ కాని ఒక ఆర్ట్ మూవీ. అయితే భారీ బడ్జెట్ తో భారీ హంగులతో ఇండియన్ ఫ్రీడమ్ ఫైట్ మూమెంట్ ని తెరపై అద్బుతంగా ఆవిష్కరించిన ఆర్ఆర్ఆర్ సినిమాని ఒక కమర్షియల్ చిత్రంగానే ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు పరిగణించడం గమనార్హం. అయితే రాజమౌళి మాత్రం ఇండిపెండెంట్ విభాగంలో ఆర్ఆర్ఆర్ సినిమాని ఆస్కార్ నామినేషన్స్ కి పంపించారు. ఈ నేపధ్యంలో ఆస్కార్ ఎంపిక ప్యానల్ సభ్యుల దృష్టిలో ఆర్ఆర్ఆర్ మూవీ పడాలంటే అంతర్జాతీయ చిత్రోత్సావాలలో ఈ మూవీ ప్రదర్శితం కావాల్సిన అవసరం ఉంది.
ఇక తాజాగా హాలీవుడ్ క్రిటిక్ అసోసియేషన్ బెస్ట్ స్పాట్ లైట్ అవార్డుకి ఆర్ఆర్ఆర్ చిత్రం ఎంపికైంది. ఈ అవార్డు అందుకున్న వాటిలో 43 శాతం సినిమాలు ఆస్కార్ అవార్డులని అందుకోవడం విశేషం. ఈ నేపధ్యంలో ఆర్ఆర్ఆర్ సినిమాకి కూడా ఆస్కార్ అవార్డు రావడం పక్కా అనే మాట వినిపిస్తుంది. ఇక బెస్ట్ స్పాట్ లైట్ అవార్డుని వచ్చే ఏడాది ఫిబ్రవరి 23 లాస్ ఏంజెల్స్ లో రాజమౌళి అండ్ టీం అందుకోనుంది. ఇక ఆస్కార్ అవార్డు అందుకునే మార్గానికి ఆర్ఆర్ఆర్ దగ్గర అయ్యిందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ ఇండిపెండెంట్ కేటగిరీలో ఆస్కార్ నామినేషన్స్ కి వెళ్ళిన ఆర్ఆర్ఆర్ అక్కడ కూడా సత్తా చాటితే మాత్రం భవిష్యత్తులో ఇండియా నుంచి ఆస్కార్ ఎంట్రీకి సినిమాలు ఎంపిక చేసే క్రమంలో ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తమ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చుకుంటుంది అనే మాట వినిపిస్తుంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.