Spirituality: సాధారణంగా మనం ఏదైనా కొత్త వాహనం కొనుగోలు చేసిన లేకపోతే ఏదైనా ఆలయానికి వెళ్ళినా అక్కడ స్వామివారికి పూజ చేసిన అనంతరం నిమ్మకాయలను ఇస్తే నిమ్మకాయలను తీసుకెళ్లి మనం మన వాహనాలకు కడుతూ ఉంటాము. అలాగే కొత్త వాహనాలు కనుక తీసుకొస్తే ప్రత్యేకంగా పూజలు చేయించి మరి వాహనానికి నిమ్మకాయ కట్టడమే కాకుండా చక్రాల కింద నిమ్మకాయలను పెట్టి ఆ నిమ్మకాయలను తొక్కిస్తూ ఉంటారు. అయితే ఇలా వాహనాలకు నిమ్మకాయను ఎందుకు కడతారు ఇలా కట్టడం వెనుక కారణం ఏంటి అనే విషయానికి వస్తే..
ఇక వాహనానికి నిమ్మకాయతో పాటు మిరపకాయలు కూడా కడతారు. అయితే ఇలా కట్టడం వెనుక కూడా ఒక కారణం ఉందని తెలుస్తుంది. పుల్లగా ఉండే నిమ్మకాయ రసం, కారం నిండి ఉండే మిరపకాయలను వాహనాలకు, దుకాణాల వద్ద వేలాడదీయడం వెనుక జ్యోతిష శాస్త్ర కారణం ఉంది.గ్రహాలలో ఎర్రనిది, ఉగ్రత్వం కలిగినది కుజగ్రహం.
కుజుడు ప్రమాద కారకుడని శాస్త్రనమ్మకం.కుజుని అధిదైవం హనుమంతుడు. అలాగే గ్రహాల్లో శుక్ర గ్రహానికి చెందిన రుచి పులుపు. అభివృద్ధికి, సంపదకు శుక్రుడు కారకుడు. కారం రవిగ్రహానికి చెందినది. అధికారానికి రవి కారకుడు. ఈ క్రమంలోనే కుజుడు రవి ఆవాహనంపై శాంతులై ఉండాలని కోరుతూ వాహనాలకు నిమ్మకాయలు, మిరపకాయలు కడతారు. ఇలా చేయటం వల్ల మనం ప్రయాణిస్తున్న మార్గంలో ఏ విధమైనటువంటి ఆటంకాలు ఇబ్బందులు కలగకుండా ఉంటాయని భావిస్తారు.
Mega 158: దుబాయ్లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.