Spirtual: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మతాలు వేరైనా, ఆయా మతాలలో పూజించే దేవుళ్ళు వేరైనా మనిషిని నడిపించేది మాత్రం దేవుడు అనే నమ్మకమే. ఆ నమ్మకం మీదనే మానవ మనుగడ సాగుతుంది. ఈ నమ్మకంతోనే ఏదైనా పని చేసేముందు ఎక్కడికైనా వెళ్ళే ముందు భగవంతుడ్ని వేడుకోవడం అందరికి ఒక అలవాటుగా ఉంది. మనల్ని సమస్యల నుంచి, కష్టాల నుంచి బయటపడేస్తాడు అనే నమ్మకంతో ఆ దేవుడ్ని ఆరాధించడం, శరణు వేడుకోవడం, ప్రతిఫలంగా ఏదో ఒకటి ఇస్తామని మొక్కుకోవడం ప్రజలు చేస్తున్నారు. కొందరు భగవంతుడి మీద భారం వేసి తాము చేయాలనుకున్న పని చేసుకొని వెళ్తారు.
ఫలితం వచ్చాక అది దైవానుగ్రహంతోనే వచ్చింది అనే నమ్మకంతో మొక్కిన మొక్కులు చెల్లించుకుంటారు. తిరుమల వెంకన్నకి కోట్లాది రూపాయిల ఆదాయం వస్తుందన్న, ఇంకా ఏ దేవాలయంలో అయిన దేవుడిని దక్షిణలు వస్తున్నాయన్న చాలా వరకు ఈ మొక్కుల కారణంగానే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మన పూర్వకాలం నుంచి మన సమాజంలో ఒక ఆచారం వస్తుంది. ఒకరి నుంచి మనం ఏదైన ఆశిస్తే, అది వారు ఇచ్చినపుడు ప్రతిఫలంగా మనం ఏదో ఒకటి ఇవ్వాలి. ఇలా ఇచ్చుపుచ్చుకోవడం అనే వ్యవహారం సనాతనంగా మన నాగరికతలోనే ఉంది మనిషికి మనిషి ఇలా ఇచ్చుపుచ్చుకుంటున్నప్పుడు.
మనందరి పుట్టుకకి కారణం అయ్యి ఈ అనంత విశ్వాన్ని నడిపిస్తున్న ఈ దేవాది దేవుడు మనకి ఒకటి ఇస్తున్నప్పుడు ప్రతిఫలంగా మనకి తోచింది ఇవ్వడంలో తప్పేంటి అనేది చాలా మంది చెప్పే మాట. ఆ నమ్మకం, విశ్వాసం నుంచి భగవంతుడికి దండం పెట్టి ఒక ప్రతిఫలం ఆశించి అది జరిగితే నీకు నేను ఫలానా ఇది ఇస్తా అని మొక్కుకోవడం అనేది ఒక అలవాటుగా మారిపోయింది. ఇది హిందువులలో మరీ ఎక్కువగా ఉంటుంది. గ్రామ దేవతల నుంచి ముక్కోటి దేవతలలో చాలా మందికి ఆలయాలు ఉన్నాయి. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి అనే పేర్లు కూడా కొంత మంది దేవతలకి ఉన్నాయి. ఆ పేర్లు వెనుక ప్రజల అంతులేని విశ్వాసం దాగి ఉంటుంది. దాంతో అలా గుర్తింపు పొందిన దేవాలయాలకి వెళ్లి మొక్కుకోవడం ఆనవాయితీగా మారిపోయింది. అయితే మొక్కుకున్న తర్వాత ఫలితం వచ్చాక ఆ మొక్కులు చెల్లించుకోకుంటే జీవితంలో చాలా ఇబ్బందులు, అరిష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఒక ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళారు.
దీంతో మొక్కులు చెల్లించకపోతే ఏదో జరుగుతుందనే భయంతో అందరూ మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది. అయితే ఈ భయం అనేది అంతర్లీనంగా మనుషుల మనసులలోకి సనాతన కాలం నుంచి వెళ్ళిపోవడంతో అది ఒక నెగిటివ్ వైబ్ గా మారి మనల్ని వెంటాడుతుంది. అంతర్లీనంగా మనలో గూడు కట్టుకున్న మన భయం మనల్ని మరింత ఆందోళనని కలిగిస్తుంది. ఈ నెగిటివ్ వైబ్ వలన కచ్చితంగా ఏదో ఒక ప్రమాదాలు నిజంగానే సంభవించడం జరుగుతాయి. అవి జరిగినపుడు మొక్కులు చెల్లించకపోవడం వలనే అనే భయాన్ని ఎవరో ఒకరు ప్రస్తావిస్తూ దానిని గుర్తు చేస్తారు. ఇలా మనుషులలో పూర్వకాలం నుంచి మనకి తెలియకుండానే భయాన్ని పెంచి పోషించడం వలన మొక్కులు చెల్లించకపోతే పాపం అనే భీతి కలుగుతుంది. ఈ కారణంగానే చాలా మంది భగవంతుడికి మొక్కుకున్న తర్వాత దానిని వీలైనంత వేగంగా తీర్చేసే ప్రయత్నం చేస్తారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.