Family: నాన్న ఎందుకు అక్కడే ఆగిపోయావ్?

Family: నాన్న ఎందుకు అక్కడే ఆగిపోయావ్ అనే మాట ఒక్కసారి కూడా ఏ కొడుకు తన తండ్రిని అడిగి ఉండడు. అడిగి ఉంటే అర్ధం చేసుకునేవాడేమో. అడిగి ఉంటే తండ్రి ప్రేమని గుర్తించే వాడేమో. కానీ అడగాలని అనుకోలేదు. అడగాలని ఆలోచన కూడా రాలేదు. ఎందుకంటే నాన్నని అర్ధం చేసుకుంటే ఆ పరమాత్మ కూడా అర్ధం అవుతాడు. నాన్న ఎందుకు ఆగిపోయాడో తెలిస్తే ఆ పరమాత్మ గొప్పతనం కూడా తెలుస్తుంది. భార్యగర్భంలో తన ప్రతి రూపం పెరుగుతుందని అర్ధం చేసుకున్నప్పుడు తండ్రి పడే ఆనందానికి అవధులు ఉండవు. ఆ గర్భంలో తన బిడ్డ ఆరోగ్యంగా పెరగాలని అనుకుంటాడు.

అందుకోసం బిడ్డకి కావాల్సినది ఇవ్వడం కోసం హాస్పిటల్ బయటే ఆగిపోతాడు. తల్లి మాత్రం తన గర్భంలో ఉన్న బిడ్డ పెరుగుదలని తనివితీరా ఆస్వాదిస్తుంది. కానీ ఆ అవకాశం నాన్నకి రాదు. ఎందుకంటే నాన్నకి నిన్ను చూసే అవకాశం లేకపోవడంతో అక్కడే ఆగిపోయాడు. కానీ అమ్మకి తెలియదు, గర్భంలో ఉన్న బిడ్డకి తెలియదు నాన్న ఆనందం. తొమ్మిది నెలలు భార్య గర్భంలో తన బిడ్డ పెరుగుతున్నప్పుడు చూస్తూ ఉండిపోయాడు.

గర్భాన్ని మోసే అదృష్టం నాన్నకి లేకపోవడం వలన అక్కడే ఆగిపోయాడు. తన బిడ్డ ఈ ప్రపంచంలోకి వస్తున్నప్పుడు ఆపరేషన్ థియేటర్ బయటే నాన్న ఆగిపోయాడు. ఆ పురిటినొప్పులు బిడ్డని కంటున్న భార్య కంటే ఆ తండ్రికే ఎక్కువగా ఉంటాయి. కానీ భావోద్వేగం రూపంలో నొప్పులన్ని మనసులోనే భరిస్తూ ఉండటం వలన అవి ఎవరికి కనిపించవు. అందుకే నాన్న ఎవరికి అర్ధం కాక అక్కడే ఉండిపోయాడు. బిడ్డని చూసిన తర్వాత ఆ అంతులేని ఆనందం నాన్న కళ్ళల్లో ఉంటుంది. కానీ అది చూసేంత సమయం ఎవరికి ఉండదు. అందుకే నాన్న అక్కడే ఉండిపోయాడు.

ఇక బిడ్డ పెరుగుతూ ఉంటే నాన్నకి బాధ్యత గుర్తుకొచ్చింది. తన బిడ్డకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని, కోరుకున్న ప్రతిదీ తీసుకొచ్చి ఇవ్వాలనే ద్యాస పెరిగింది. అందుకే తన ప్రేమని చూపించకుండా నాన్న అక్కడే ఉండిపోయాడు. నా బిడ్డ మీదకి అమ్మప్రేమ దక్కుతుంది కదా అనే ఆనందంలో తన ప్రేమని అందించాలనే ఆలోచన కూడా రాలేదు. అందుకే నాన్న అక్కడే ఆగిపోయాడు. ఇక బిడ్డ పెరుగుతూ ఉంటే, తాను ఉన్నత చదువులు చదువుతూ ఉంటే వాటి కోసం తన సమయాన్ని, శ్రమని ఆదాయంగా మార్చే ప్రయత్నంలో ప్రేమ గురించి ఆలోచించడం మరిచిపోయాడు.

తన ప్రేమని బాధ్యతగా మార్చేసి భరోసా ఇచ్చే ప్రయత్నంలో ఉండిపోయి నాన్న అక్కడే ఆగిపోయాడు. ఉద్యోగం బిడ్డ ప్రయోజకుడు అయితే సంతోషించే మొదటి వ్యక్తి నాన్నే అవుతాడు. కానీ ఆ విషయం నాన్నకి తెలియడం ఆలస్యం అవుతుంది. అందుకే నాన్న అక్కడే ఆగిపోయాడు. కొడుకైన, కూతురైన పెళ్లి చేసుకొని తన జీవితం మొదలుపెట్టిన తర్వాత కూడా నాన్న అక్కడే ఆగిపోతాడు. ఎందుకంటే వారి జీవితానికి తాను భారం కాకూడదని. ఇలా నాన్న ఎప్పుడు వెనకే ఆగిపోతాడు.

మనకి చాలా దూరంగా ఉండిపోతాడు. కానీ జీవితంలో ఏ ఒక్కరు కూడా నాన్న ఎందుకు అక్కడే ఆగిపోయాడు అనే విషయాన్ని అర్ధం చేసుకునే ప్రయత్నం చేయరు. నాన్న చేయి పట్టుకొని ముందుకి తీసుకొచ్చి నిలబెట్టే ప్రయత్నం చేయరు. జీవితంలో ఒక్కసారైన మనకోసం దూరంగా అక్కడే ఆగిపోయిన నాన్నని ముందుకి తీసుకొచ్చి నిలబెట్టు. మా అందరికి ముందు ఉండాల్సింది నువ్వే నాన్న అని చూపించే ప్రయత్నం చెయ్. ఆ నాన్నకి జీవితంలో అంతకు మించిన ఆనందం మరొకటి ఉండదు. ఆ నాన్నకి అంతకు మించి జీవితంలో ఇంకేం ఆశ ఉండదు.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

ALLU ARJUN: AA22 టైటిల్ “రాకా”..ఇది ఎవరూ ఊహించనిది!

ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…

4 days ago

Ram Charan: ‘పెద్ది’ కథకి స్పూర్తి ఆమిర్ ఖాన్ సినిమాలేనా?

Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…

6 days ago

Chiranjeevi: విశ్వంభర మరింత ఆలస్యం..ఆ సినిమాలా అవుతుందా?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…

6 days ago

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…

1 week ago

Peddi Movie: పెద్ది రిలీజ్ విషయంలో రామ్ చరణ్ చెప్పినా నమ్మని ఫ్యాన్స్!?

Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…

1 week ago

Carmeni Selvam (2026) – Movie Review: కార్మేని సెల్వం బ్యూటిఫుల్ ఎమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్‌తో సాగిన చక్కటి కుటుంబకథా చిత్రం

Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…

1 week ago

This website uses cookies.