Categories: InspiringNews

Inspiring: మీరు నిజమైన ప్రేమికులేనా? తెలుసుకోవాలంటే ఇది చదవండి..

Inspiring: ప్రపంచం నా కంటే గొప్ప ప్రేమికుడు నీకు ఎప్పటికి దొరకడు… ప్రపంచంలో నాలా ప్రేమించే అమ్మాయి నువ్వు ఎప్పటికి పొందలేవు. ఎవరికి వారు తాము ప్రేమించిన వ్యక్తులతో ఏదో ఒక సందర్భంలో కచ్చితంగా ఈ మాట చెబుతారు. ప్రేమించే ప్రతి ఒక్కరు అలాగే అనుకుంటారు. అయితే ఆ ప్రేమని స్వీకరిస్తున్న ఎదుటివారికి అది గొప్ప ప్రేమ కాదా అనే విషయం మీద చాలా క్లారిటీ ఉంటుంది. ఆ విషయాన్నే వారు తెలిజేసే సమయంలో ఇగో హార్ట్ అవుతుంది. బ్రేక్ అప్ అవుతుంది.

నిజానికి ప్రపంచంలో ప్రతి బ్రేక్ అప్ ఎవరో ఒకరి స్వార్ధం వలనే జరుగుతాయి అంటే నమ్మకపోవచ్చు. కానీ నిజం. ఒక్కసారి ప్రేమిస్తే, ఆ ప్రేమించే వ్యక్తిని జీవితంలో వదులుకోవడానికి ఎవరు ఇష్టపడరు. కాని వదులుకోవడానికి రెడీ అయ్యారంటే మాత్రం ఆ ఇద్దరిలో ఎవరో ఒకరి దగ్గర ప్రేమ లేదని, కేవలం కోరిక, ఆశ మాత్రమే ఉందని అర్ధం. ప్రేమ అనేది ఈ అనంత విశ్వంలో అతీతమైనది. ఈ ప్రేమని అర్ధం చేసుకోవడానికే ఈ మానవ సమాజంలో చాలా మందికి సాధ్యం కావడం లేదు.

అందుకే పెళ్ళికి ముందు బ్రేక్ అప్ లు, పెళ్లి తర్వాత విడాకులు అనేవి ఈ మధ్యకాలంలో సర్వ సాధారణం అయిపోయాయి. నిజంగా ఒక వ్యక్తిని ప్రేమించడం మొదలు పెడితే వారు ఎలా ఉన్నా ఇష్టపడతాం, ఏం చేసిన ప్రోత్సహిస్తాం, వారి ప్రతి ఇష్టాన్ని గౌరవిస్తాం. అన్నింటికీ మించి ప్రేమించే వ్యక్తి నుంచి ఏమీ ఆశించకుండా వారి సంతోషాన్ని మాత్రమే చూడాలని అనుకుంటారు. వారు ఆనందంలో ఉంటే దానిని ఆస్వాదిస్తారు. వారు బాధపడితే ఒదారుస్తారు. వారు కోపం చూపిస్తే భరిస్తారు. కాని ప్రేమ అని ఇద్దరు కలిసి ప్రయాణం మొదలు పెట్టిన తర్వాత వారి మధ్య ఉన్న ప్రేమని వ్యక్తిత్వం డామినేట్ చేస్తుంది.

తనకి నచ్చినట్లు ప్రేమించే వ్యక్తి ఉండాలని అనుకుంటారు. తాను చెప్పింది వినాలని ఆశిస్తారు. తన మాటకి విలువ ఇవ్వాలని భావిస్తారు. అన్నింటికీ మించి తన ఇగోని సంతృప్తి పరిస్తేనే వారు మన ప్రియుడు లేదా ప్రియురాలిగా ఉండటానికి అర్హత ఉందనే విధంగా భావిస్తారు. ఆ ఆలోచనలకి వారు పెట్టే పేరు మంచితం, సమాజంలో గౌరవం, మన సంతోషం కోసమే కదా ఇదంతా అని. నిజానికి అక్కడ ప్రేమ కంటే ఆధిపత్యమే ఉంటుంది. తన జీవితంలోకి వచ్చే వ్యక్తికి తాను బాస్ లా ఫీల్ అవుతూ ఉంటారు. ఈ బాసిజం ఉన్న చోట పెత్తనమే ఉంటుంది కాని ప్రేమ ఉండదు.

ప్రేమ ఉన్న చోట పెత్తనం అనే మాటకి చోటుండదు. ప్రేమ అనేదానికి సరైన ప్రపంచంలో సరైన నిర్వచనం అంటే ఒకటే ఉంటుంది. ఓ ఇద్దరి మధ్య ప్రేమ ఉంటే వారి మధ్య కండిషన్స్ ఉండవు, మాటల్లో నెగిటివ్ ఇంటెన్షన్ ఉండదు. ఇచ్చేదానికి రీజన్ ఉండదు.అన్నింటికీ మించి ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేమించాలి. అదే నిజమైన ప్రేమలో కనిపించే స్వచ్చమైన భావం. ఎలాంటి ఎక్స్ పెక్టేషన్స్ లేకుండా ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నారా అలా అయితే మీరు నిజమైన ప్రేమికుడు. ఎలాంటి కండిషన్స్ లేకుండా ఒక వ్యక్తిని మీరు ప్రేమిస్తున్నారా అలా అయితే మీరు నిజమైన ప్రియురాలు. కండిషన్స్, ఎక్స్ పెక్టేషన్స్ లేకుండా జీవితాన్ని సంపూర్ణంగా ఆస్వాదిస్తే అలాంటి వారు మాత్రమే నిజమైన ప్రేమికులు. వీరిలో మీరు ఉన్నారా లేదా అనేది ఇప్పుడే నిర్ణయించుకోండి.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Actor Prakash : మరీ అంతలా దిగజారిపోకండి

Actor Prakash : మ్యూజిక్ డైరెక్టర్, కోలీవుడ్ హీరో జివి ప్రకాష్ కుమార్ ఈ మధ్యనే తన భార్య సింగర్…

16 hours ago

Lavanya tripathi : మెగా కోడలిని ఏకిపారేస్తున్న జనం

Lavanya tripathi : అందాల రాక్షసి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది లావణ్య త్రిపాఠి. ఈ సినిమాలో క్యూట్ యాక్టింగ్…

18 hours ago

Anushka : ఆ నిర్మాతతో అనుష్క పెళ్లి?

Anushka : టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన నటి అనుష్క శెట్టి. నాగార్జున హీరోగా…

1 day ago

Ice cream: ఐస్ క్రీమ్ తిన్న వెంటనే ఈ పదార్థాలను తింటున్నారా.. ఈ సమస్యలు తప్పవు?

Ice cream: వేసవి కాలం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరు కూడా చల్ల చల్లని పానీయాలు ఐస్ క్రీములు తినాలని…

1 day ago

Vastu Tips: లేచిన వెంటనే అద్దంలో మీ మొహం చూసుకుంటున్నారా…జర జాగ్రత్త!

Vastu Tips: సాధారణంగా మనం వాస్తు శాస్త్రం ప్రకారం ఎన్నో వాస్తు నియమాలను పాటిస్తూ ఉంటాము అయితే చాలా మంది…

1 day ago

Tuesday: మంగళవారం పొరపాటున కూడా చేయకూడని, చేయవలసిన పనులు ఇవే?

Tuesday: మన హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రతి రోజు ఏదో ఒక దేవుడికి అంకితం చేసే ఆ దేవుడిని ఆరోజు…

1 day ago

This website uses cookies.