Categories: HealthLatestNews

Unborn Baby: గర్భంలో శిశువు నిజంగానే అన్ని వింటుందా? పరిశోధనలో నిజాలు

Unborn Baby: మన పురాణాలలో అభిమాన్యుడి కథ విన్నప్పుడు అతను తల్లి గర్భంలో ఉన్నప్పుడే పద్మవ్యూహంలోకి వెళ్ళడం నేర్చుకున్నాడు అని చెబుతారు. అలాగే ప్రహ్లాదుడు తల్లిగర్భంలో ఉన్నప్పుడు నారదుడు వచ్చి అతనికి నారాయణ మంత్రం చెప్పడం వలన దానిని తరువాత కూడా మనస్సుకి ఎక్కించుకొని తండ్రికి శత్రువుగా మారాడు. అలాగే హిరక్యకశిపుడు మరణానికి కారణం అయ్యాడు. అయితే ఈ రెండు కథలలో కామన్ గా కనిపించే పాయింట్ తల్లి గర్భంలో ఉన్నప్పుడు బిడ్డ మనం చెప్పే ప్రతి విషయాన్ని వింటాడు.  శిశువు పెరిగే దశలో బాహ్య ప్రపంచంలో ఉన్న శబ్ద తరంగాలని గర్భంలో నుంచి వినడం ద్వారా దానికి రియాక్ట్ అవుతాడు అని అంటారు. తల్లి కూడా ఒక్కో సారి బిడ్డ స్పందనలని స్పర్శ ద్వారా తెలుసుకుంటుంది.

అందుకే తల్లి గర్భంతో ఉన్నప్పుడు ఎక్కువగా సానుకూల దృక్పథంతో ఉండాలని, అలాగే పాజిటివ్ ఆలోచనలు పెంపొందించుకోవాలి అని చెబుతారు. అలాగే భగవద్గీత వినడం, రామాయణం, మహాభారతం వంటివి చదవడం చేయాలని సూచిస్తూ ఉంటారు. అలాగే స్పూర్తినిచ్చే కథలు చదవాలని చెబుతూ ఉంటారు. గొడవలకి దూరంగా ఉండాలని అంటూ ఉంటారు. మన పురాణాల ప్రకారం అనాదిగా వస్తున్న కథల ఆధారంగా శిశువు గర్భంలో ఉన్నప్పుడే నేర్చుకునే సామర్ధ్యం కలిగి ఉంటారు అనేది నమ్ముతూ ఉంటారు. అయితే దీనిపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేసి ఆసక్తికర విషయాలు చెప్పారు.

 

గైనకాలజిస్టుల అభిప్రాయం ప్రకారం గర్భంలో ఉన్న శిశువు శబ్దాలు వినగలదు  కాని భాషని అర్ధం చేసుకోలేదు. దీనిని బట్టి మనం మాట్లాడే మాటలు గాని, లేదంటే రామాయణం, మహాభారతం లాంటి కథలు గాని ఎంత వరకు శిశువు అర్ధం చేసుకుంటుంది అనేది చెప్పలేం అంటున్నారు. సైకాలజిస్టుల అభిప్రాయం ప్రకారం అయితే `13వ వారం నుంచి శిశువు వినడం అలవాటు చేసుకుంటుంది. అలాగే తల్లి భాషని అర్ధం చేసుకుంటుంది. తల్లి, ఇతరుల స్వరాన్ని మధ్య తేడాని తెలుసుకుంటుంది. కొన్ని శబ్దాలకి గర్భస్థ శిశువు స్పందిస్తుంది. ఒకే విషయాన్ని పదే పదే చెబితే కచ్చితంగా గర్భంలో శిశువు స్పందన వేరే విధంగా ఉంటుంది. అలాగే తల్లి ఒత్తిడికి గురైతే బిడ్డ మీద దాని ప్రభావం ఉంటుంది. అలాగే కొన్ని సౌండ్స్ ని విని మైండ్ లో నిక్షీప్తం చేసుకుంటుందని చెబుతున్నారు. దీనిని బట్టి శాస్త్రీయంగా మనం నమ్ముతున్న అభిమాన్యుడి, ప్రహ్లాదుడు కథల సారం నిజం అని అర్ధం చేసుకోవచ్చు.

Varalakshmi

Recent Posts

Varanasi: మహేష్ బాబు, ప్రియాంక చోప్రా లపై సాంగ్ షూట్ అప్‌డేట్

Varanasi: సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న పాన్ వరల్డ్ సినిమా వారణాసి. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ…

11 hours ago

Varun Tej: 2027 సంక్రాంతి ‘బరి’లో బరిలోకి దిగుతున్న మెగా ప్రిన్స్

Varun Tej: మెగా బ్రదర్ నాగబాబు తనయుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ఆయన సోదరి నిహారిక నిర్మాతగా…

1 day ago

Anil Ravipudi: కీర్తి సురేష్, కృతి శెట్టి..ఇది మీకు గోల్డెన్ ఛాన్స్!

Anil Ravipudi: మన టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కీర్తి సురేష్ మంచి సక్సెస్‌లను అందుకున్న సంగతి తెలిసిందే. నేను శైలజ…

3 days ago

Balakrishna: నందమూరి బాలకృష్ణకు ‘లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు’..

Balakrishna: టాలీవుడ్ సీనియర్ హీరో నట సింహం నందమూరి బాలకృష్ణకు మరో అరుదైన అవార్డు దక్కింది. తెలుగు చలన చిత్ర…

3 days ago

Mahesh Babu: వారణాసి అప్‌డేట్స్‌తో రాజమౌళి ఏం ప్లాన్ చేస్తున్నాడో!

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో పాన్ వరల్డ్ చిత్రంగా…

4 days ago

Pawan Kalyan: ఉస్తాద్ భగత్‌సింగ్ బ్రేకీవెన్ కూడా కష్టమా?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా అంటే ప్రతీ ఒక్కరిలో ఉండే ఆతృత, ఆసక్తి ఊహించలేనిది. ఎన్ని సినిమాలు బాక్సాఫీస్…

1 week ago

This website uses cookies.