Kriti Sanon : సినిమా హీరోయిన్స్ పెళ్లికి పనికిరారు.. కృతి సనన్ సెన్షేషన్ కామెంట్స్

Kriti Sanon : సినిమా హీరోయిన్స్ పెళ్లికి పనికిరారు అంటూ క్రేజీ హీరోయిన్ కృతి సనన్ సెన్షేషనల్ కామెంట్స్ చేశారు. అంతేకాదు, ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించిన 1 నేనొక్కడినే సినిమాతో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత దోచేయ్ సినిమానూ చేసింది. కానీ, ఈ రెండు సినిమాలు డిజాస్టర్‌గా నిలిచాయి. దాంతో కృతీసనన్ మళ్ళీ తెలుగులో కనిపించలేదు.

కానీ, హిందీ సీమలో మాత్రం స్టార్ హీరోయిన్‌గా పాపులారిటీని సంపాదించుకొని భారీ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. అంతేకాదు, ఇప్పుడు కృతీ ఎక్కువగా పాన్ ఇండియన్ సినిమాలను కమిటవుతోంది. ప్రస్తుతం ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తున్న మైథలాజికల్ మూవీ ఆదిపురుష్ సినిమాలో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ మొదలైనప్పటి నుంచి కృతీ ప్రభాస్‌తో చాలా క్లోజ్ అయ్యారు. దాంతో సోషల్ మీడియాలో ప్రభాస్-కృతీసనన్ ప్రేమించుకుంటున్నారనీ, పెళ్లి కూడా చేసుకోవాలని డిసైడైనట్టు ప్రచారం చేస్తున్నారు.

Kriti Sanon : సమాజంలో హీరోయిన్‌కి అంత గౌరవం లేదు..

దాంతో ఇటీవల బాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ అంటే ఎలా చూస్తున్నారో..ఇంట్లో ఎలాంటి ప్రశ్నలు వేస్తారో చెప్పుకొచ్చింది. ఇప్పటికీ సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్‌గా వెళతానంటే అదో తప్పులా భావిస్తున్నారనీ, సొంతవాళ్ళే ఆశ్చర్యంగా చూస్తున్నారనీ చెప్పారు. అందుకే, కొందరు అమ్మానాన్నలు తమ కూతుళ్ళని హీరోయిన్‌గా ఎంకరేజ్ చేయడం లేదన్నారు. సమాజంలో హీరోయిన్‌కి అంత గౌరవం లేదనీ, పెళ్లి చేసుకోవాలంటే ఎవరూ ఆసక్తి చూపించరనీ వాపోయింది.

ఈ విషయంలో నన్ను కూడా చాలామంది భయపెట్టారనీ చెప్పిన కృతీ గత రెండు దశాభ్దాలుగా సినిమా ఇండస్ట్రీలోకి తెలుగమ్మాయిలు హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినవారు చాలా తక్కువన్నారు. ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె అభిమానులతో పాటు చాలామంది నెటిజన్స్ కృతీ సనన్ మాటలను ఏకీభవిస్తున్నారు. ఇక చాలా ఏళ్ళ తర్వాత కృతీ తెలుగులో చేస్తున్న ఆదిపురుష్ సినిమాతో ఇక్కడ క్రేజ్ తెచ్చుకుంటారేమో చూడాలి.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

2 days ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

3 days ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

3 days ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 week ago

Lord Shiva: కోరిన కోరికలు తీరడం లేదా.. శివాలయంలో ఈ పరిహారం చేస్తే చాలు!

Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…

1 week ago

Climbing Stairs: మెట్లు ఎక్కుతూ అలసిపోతున్నారా? ఫిట్ నెస్ లోపం అనుకుంటే పొరపాటే?

Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…

1 week ago

This website uses cookies.