Politics: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన టీఆర్ఎస్ పార్టీని జాతీయ పార్టీగా మార్చుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ పేరుని, అలాగే జెండాని అధికారికంగా మారుస్తూ తీర్మానం చేశారు. ఇకపై తెలంగాణలో కూడా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గానే ఉంటుంది. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ పార్టీతో కేసీఆర్ దేశ రాజకీయాల వైపు దృష్టి పెట్టి తెలంగాణలో రాష్ట్ర బాద్యతలని కేటీఆర్ కి అప్పగించబోతున్నారు. ఇక పార్టీ వచ్చే ఎన్నికలలో గెలిచిన కేటీఆర్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక పార్టీలో ఉన్న నాయకులు అందరూ కూడా తమ భవిష్యత్తు అధినేత కేటీఆర్ అని అధికారికంగా ఇప్పటికే ఒప్పుకుంటున్నారు ఇక కేసీఆర్ ఎంపీగా పోటీ చేయడంతో దేశ వ్యాప్తంగా పార్టీని విస్తరించడంపై దృష్టి పెట్టబోతున్నట్లు తెలుస్తుంది.
ఇందులో భాగంగా ముందుగా కర్ణాటకలో జరగబోయే ఎన్నికలలో అక్కడ ప్రాంతీయ పార్టీ అయిన జేడీయూతో కలిసి తెలంగాణని ఆనుకొని ఉన్న కన్నడ నియోజక వర్గాలలో బీఆర్ఎస్ పార్టీ తరుపున అభ్యర్ధులని బరిలోకి దింపబోతున్నారు. ఇక తెలంగాణ ఎన్నికల తర్వాత జరగబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయనుంది. ఇప్పటికే దానికి సంబందించిన కార్యాచరణని సిద్ధం చేసి ఏపీలో బలమైన నాయకులని బీఆర్ఎస్ పార్టీ కోసం తయారు చేసుకునే పనిలో కేసీఆర్ ఉన్నారు. కేసీఆర్ పై ఏపీలో కొన్ని ప్రాంతాలలో సానుకూలత ఉంది ఈ నేపధ్యంలో ఆ పార్టీలోకి కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాజీలు అందరూ వెళ్ళే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది.
దానికి అన్ని రాష్ట్రాలలో పర్యటించడానికి కూడా కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. తెలుగు కాకుండా హిందీ భాషలో కూడా అనర్గళంగా మాట్లాడటం. ప్రజలని ఉత్తేజపరిచే ప్రసంగాలు కేసీఆర్ బలం వాటితోనే మోడీ పాలనపై వ్యతిరేకత చూపిస్తూ కాంగ్రెస్ పై నమ్మకం లేని ఓటర్లని కేసీఆర్ ఆకర్షించాలని భావిస్తున్నారు. మరి ఇది ఏ మేరకు సాధ్యం అవుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.