Spirtual: మతంపై నాస్తికత్వం పెత్తనం ఏంటి? ఎవరిచ్చారు వారికి ఆ స్వేచ్చ

Spirtual: మనిషి ముందు పుట్టి మతం తరువాత పుట్టింది అనే సంగతి అందరికి తెలిసిందే. అయితే మతం పుట్టుక వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయి. మానవ జాతిని ఏకీకృతం చేసి ఈ సమస్త విశ్వాన్ని నడిపించే ఒక శక్తి ఉందనే భావనని పెంపొందించడం కోసం మతం అనేది ఒక మార్గం అయ్యింది. ఆ తరువాత మానవుని పుట్టుకకి గల కారణం ఏంటనేది తెలుసుకోవడానికి మతం విజ్ఞానాన్ని అందించింది. ఆ తరువాత మానవ సంబంధాలు, బంధాలు ఏర్పడి కుటుంబం అనే వ్యవస్థ బలపడటానికి మతం అనేది ఒక కొన్ని సిద్ధాంతాలని పరిచయం చేసింది.

అసలు మానవుల మధ్య సంబంధాలు లేకుండా ఆదిమానవుడుగా ఉన్న మనిషి మనుగడని ఒక స్థిరమైన మార్గంలోకి తీసుకొచ్చి, ఆద్యాత్మిక మార్గంలోకి నడిపించి, మంచి, చెడుల విచక్షణ అర్ధమయ్యేలా చేసింది మతం. మనిషి నమ్మకాన్ని తరతరాలుగా ఈ మతం నడిపిస్తుంది అనే విషయాన్ని చాలా మంది ఆద్యాత్మిక తత్వవేత్తలు చెబుతూ ఉంటారు. అయితే ఈ మతం నుంచి ఆస్తికత్వం అనేది పుట్టింది, ప్రతిమనిషిలో ఆస్తికత్వం అనేది జీవన విధానంలో ఒక భాగంగా మారింది.

అయితే మారుతున్న కాలంతో పాటు విజ్ఞానం వైపు అడుగులు వేసిన మనిషిలో ఆధిపత్య భావన పెరిగింది. ఆ భావన నుంచి నాయకత్వం అనేది పుట్టుకొచ్చి మతాలలో భిన్నత్వాలు ఏర్పడ్డాయి. నాయకుడు అనేవాడు గురువుగా మారి తనని, తన మాటని అనుసరించే వారిని సపరేట్ చేసి తానొక మతాన్ని, సిద్ధాంతాన్ని, భావజాలాన్ని రూపొందించాడు. తనని అనుసరించే అందరూ దీనినే విశ్వసించాలి. ఈ సిద్దాంతాలని అనుసరిస్తేనే నిజమైన ఆ దైవాన్ని తెలుసుకోగలం, మరణం తర్వాత చేరుకోగలం అనే ఒక నమ్మకాన్ని ప్రజలలో పెరిగేలా చేశారు.

అలా ప్రజలని మాటలతో మాయచేసే నైపుణ్యం ఉన్నవారు ఒక్కొక్కరు ఒక్కో మతాన్ని, మార్గాన్ని సృష్టించారు. ఇలా ఈ ప్రపంచంలో భిన్న మతాలు మానవ సమాజంలో ఆవిర్భవించాయి. కొన్ని మతాలలో కనిపించే ప్రతి అణువులో దైవం ఉందని నమ్మితే మరికొందరు నమ్మే మతంలో దైవం అనేది అన్నిచోట్ల ఉండదని దేవుడు ఒక్కడే అనే భావనని కలిగి ఉంటారు. ఇంకొందరు మతంలో ఒకేచోట ఉంటుందని నమ్ముతారు. ఇంకో మతంలో దైవం మన అంతరాత్మలోనే ఉంటుందని విశ్వసిస్తారు. ఎవరు ఎలా నమ్మినా అందరూ దైవం అనే భావనని బలంగా విశ్వసిస్తారు.

అయితే ఈ దైవం గురించి, దైవం ఉనికి గురించి చెప్పడానికి ఆయా మతాలలో కొన్ని కల్పిత కథలని గురువులుగా ఉన్నవారు రచించి సులభమైన పద్ధతిలో దైవం గురించి మనవ సమాజానికి అర్ధం అయ్యేలా చేశారు. అయితే అప్పటి కాలమాన పరిస్థితులు, మానవ సమాజంలో ఉన్న సంబంధాలు, అలాగే మనుషుల మధ్య ఉన్న బంధాలని తమ కథలలో కథా వస్తువుగా మార్చుకొని కల్పిత కథలని రాసారు. మరికొంతమంది జరిగిన కథలనే ఆద్యాత్మిక కోణంలో చెప్పే ప్రయత్నం చేశారు. ఎవరు ఎలా రచనలు చేసి వాటిని గ్రంధస్తం చేసి మతంలో భాగం చేసిన అన్నింటి సారం దైవాన్ని అర్ధం చేసుకోవడం, దైవత్వాన్ని విశ్వసించేలా చేయడమే.

అయితే ఆధునిక యుగంలో మతాల మధ్య ఆధిపత్య పోరు వచ్చింది. అలాగే మతాన్ని, దైవత్వాన్ని నమ్మని వారు ఒక వర్గంగా ఏర్పడ్డారు. వారు నాస్తికవాదం భావనతో ఉంటారు. వారి ఉద్దేశ్యంలో మతాలు, మత గ్రంధాలు అన్ని కూడా మానవ సమాజాన్ని అజ్ఞానులుగా మార్చేసి వారి ఆలోచన విస్తరించి సమాజంలో గురువులుగా నాయకులుగా చలామణి అవుతున్న వారిని ప్రశ్నించకుండా నియంత్రించేవి అని భావిస్తున్నారు. అందుకే మతాన్ని, దైవాన్ని, మత గ్రంధాలని గుడ్డిగా వ్యతిరేకిస్తూ ఉంటారు. అలాగే మతాల ఆధిపత్య పోరులో ఇంకో మతంలో ఉన్నవారిని తమ మతంలోకి వచ్చేలా చేయడానికి కథల సారాంశాన్ని తప్పుగా, అలాగే దైవం ఉనికిని బూతుగా చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు.

నాస్తికులు కూడా మతాన్ని, దైవాన్ని నమ్మేవారిని మార్చి నాస్తికవాదంలోకి తీసుకురావడానికి ఇదే విధానం వాడుతారు. అయితే ఇక్కడ మనిషి తన జీవితాన్ని సంతోషంగా గడపడానికి, తాను నాస్తికవాదం, ఆస్థికవాదం ఏది ఎంచుకుంటాడా అనేది తన ఇష్టం. సమాజ విచ్చిన్న శక్తులుగా మారకుండా పంచభూతాలని అర్ధంచేసుకొని వాటి ఉపయోగం తెలుసుకొని గౌరవించడానికి తనకి నచ్చిన మతాన్ని అనుసరించవచ్చు. కాని మతంపై పెత్తనం చేస్తూ తరతరాలుగా ఆద్యాత్మిక మార్గంలో వారు అర్ధం చేసుకున్న కథలని బూతుగా చూపించి మనుషుల మధ్య అంతరాలు పెంచే ప్రయత్నం చేస్తే మాత్రం కచ్చితంగా శిక్షార్హం అవుతుంది.

ఆ శిక్ష ప్రకృతి చేతిలో ఉంటుందా, ప్రకృతిలో భాగం బలమైన భావజాలంతో ఉన్న మనుషుల చేతిలో ఉంటుందా అనేది కాలమే నిర్ణయిస్తుంది. ఆధునిక సమాజం నిలబడింది అంటే సనాతన ధర్మ మార్గంలో ఉన్న భిన్న మతాల సమ్మేళనం. మానవ సమాజం కలిసికట్టుగా ఒకరి మీద ఒకరు ఆధారపడి బ్రతుకుతున్నారు అంటే ఆ మతం నేర్పిన సమానత్వం. అయితే అందులో సమానత్వాన్ని కరెక్ట్ గా అర్ధం చేసుకుంటే మతం గొప్పతనం అర్ధం అవుతుంది లేదంటే ఆ మతం అత్యంత ప్రమాదకరమైన భూతంగా కనిపిస్తుంది.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Game Changer: రామ్ చరణ్ తప్పించుకోగలడా..?

Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ జీనియస్ శంకర్ షణ్ముగ్ కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ‘గేమ్ ఛేంజర్’.…

10 hours ago

Tollywood Exclusive: ప్రభాస్ ‘రాజు’ ని టచ్ చేసేదెవరు..?

Tollywood Exclusive: 2000 సంవత్సరం తర్వాత నటుడు, నిర్మాత అశోక్ కుమార్ తన బ్యానర్ లో ఒక సినిమాకు శ్రీకారం…

2 days ago

The Rana Daggubati Show Trailer: రానా కొత్త టాక్ షో..సెలబ్రిటీలెవరంటే..

The Rana Daggubati Show Trailer: త్వరలో పాపులర్ ఓటీటీ అమెజాన్ ప్రైం లో టాలీవుడ్ టాల్ హీరో అయిన…

5 days ago

Bhagyashri Borse: కాస్త అటు ఇటుగా ఆ హీరోయిన్‌లాగే ఉంది..ఎవరూ గుర్తు పట్టలేదు..!

Bhagyashri Borse: తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త బాగా వైరల్ అవుతోంది. మాస్ మహారాజా రవితేజ-డైరెక్టర్ హరీశ్ శంకర్…

1 week ago

Virinchi Varma: ‘జితేందర్ రెడ్డి’ సినిమా అందుకే చేశాను..

Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…

3 weeks ago

Raashii Khanna: అది నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..?

Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…

4 weeks ago

This website uses cookies.