Family: ఉమ్మడి కుటుంబంలో ఆప్యాయతల్ని గుర్తించండి… కొత్త బంధాన్ని దాయకండి

Family: ఉమ్మడి కుటుంబాల నుంచి వచ్చే అమ్మాయిలు యుక్త వయస్సు వచ్చాక కొన్ని తప్పటడుగులు వేస్తూ ఉంటారు. దీనికి కారణం వారు పెరిగిన వాతావరణం తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు చెప్పే మాటలు, సూచనలు అన్ని కూడా తమ స్వేచ్చని హరించేస్తున్నాయి అని అమ్మాయిలు భావిస్తూ ఉంటారు. అందుకే తమ జీవితంలో చిన్న చిన్న చిన్న విషయాలని కూడా కుటుంబ సభ్యులతో చెప్పుకోవడానికి ఇష్టపడరు. ఒకవేళ చెబితే వారి నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో అని ముందే భయపడిపోతూ ఉంటారు. ఆ భయంతోనే కుటుంబాన్ని కాదనుకొని కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. ఎవరినో ప్రేమించి, కుటుంబాన్ని కాదనుకొని ఇళ్ళు వదిలి వెళ్ళిపోతారు. అయితే అలా వెళ్ళిపోయిన అమ్మాయిలలో 100కి 90 శాతం మంది అమ్మాయిల వివాహ జీవితం అస్తవ్యస్తంగా మారుతుంది.

తెలియని వయస్సులో అబ్బాయిలు చూపించే అతి ప్రేమని అద్బుతం అనుకుంటారు. అమ్మాయిలని మెప్పించడానికి అబ్బాయిలు ఇచ్చే చిన్న చిన్న కానుకలకి మురిసిపోతారు.అలాగే అమ్మాయిల ప్రతి మాటకి ఆ ప్రేమించే వ్యక్తి, లేదంటే ప్రేమ పేరుతో వంచించే వ్యక్తికి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. నీ ఇష్టం… నువ్వు ఎలా అంటే అలా అనే మాటలతో వారికి చాలా స్వేచ్చని ఇచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. అందుకే ఏం చేస్తానన్న వద్దని చెప్పి వారించే తల్లిదండ్రుల కంటే, అన్నింటికీ ఓకే అనే అబ్బాయి బెటర్ గా కనిపిస్తాడు. దీంతో కనిపెంచిన తల్లిదండ్రులని కాదనుకొని వారితో వెళ్ళిపోతారు. అయితే వివాహం అయిన తర్వాత వారికి వాస్తవాలు అర్ధమవుతాయి. పురుషాధిక్యత సమాజంలో కేవలం మెప్పించడానికి మాత్రమే మగాళ్ళు చెప్పే మాట నీ ఇష్టం అనేది అని అర్ధం చేసుకుంటారు.

అయితే పెళ్లి తర్వాత వారి ఆలోచనలని కళ్ళెం పడినట్లు అనిపిస్తుంది. అభిప్రాయాల కి గౌరవం లభించలేదనే ఫీలింగ్ కలుగుతుంది. అలా కలిగింది అంటే ఆ బంధంలో ఇక ఎక్కువ కాలం అమ్మాయి ఇమడలేదు. అప్పుడు మళ్ళీ ఆ అమ్మాయికి తల్లిదండ్రులు, కుటుంబం గుర్తుకొస్తుంది. తెలిసీతెలియని వయస్సులో నేను తీసుకునే నిర్ణయాలతో ప్రమాదంలో పడతానని వారు అడ్డు చెప్పేవారు తప్ప నా మనసుకి నచ్చింది ఎప్పుడు ఇవ్వకుండా ఉండలేదు. నన్ను మహారాణిలా చూసుకున్నారు. ఇప్పుడు భర్త తనని పనిమనిషిగా ట్రీట్ చేస్తున్నాడు అని అనుకుంటుంది. దీంతో మళ్ళీ తల్లిదండ్రుల దగ్గరకి వెళ్తుంది. ప్రేమించి, పెళ్లి చేసుకున్న భర్తని వద్దనుకొని విడాకుల వరకు వెళ్తుంది. ఇలా చంచలమైన అమ్మాయిల ఆలోచనలు స్వేచ్చ అనే దానిని పూర్తిగా అర్ధం చేసుకోలేక పదే పదే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు.

ప్రేమ పేరుతో ఈ సమాజంలో పదే పదే మోసపోతూ ఉంటారు.అయితే కన్నవారింట ఉన్నప్పుడు యువరాణిగా బ్రతకొచ్చు. కాని అత్తింటికి వెళ్ళిన తర్వాత మహారాణిగా అమ్మాయిలు మారుతారు. అక్కడ అధికారం ఉంటుంది. అలాగే బాద్యతలు ఉంటాయి. సంసారం అనే బండిని ముందుకి నడిపించడంలో భర్తతో పాటు భార్య కూడా ఉంటుంది. కాని అక్కడ కూడా యువరాణిలాగే ఉండాలని అనుకున్న, బాద్యత లేకుండా స్వేచ్చగా జీవితాన్ని అనుభవించాలని ఆలోచించిన కచ్చితంగా బంధాలు విచ్చిన్నం అవుతాయి. ఈ ప్రపంచంలో అమ్మాయిలు ఎంత తెలివైనవారో అంతే తెలివి లేని పనులు కూడా చేస్తూ ఉంటారు. ఎన్ని పనులైన ఏకకాలంలో చేసే నైపుణ్యం ఉన్నవాళ్ళే.

ఏమీ తెలియని అమాయకులు మారిపోయి చాలా సులభంగా మోసపోతూ ఉంటారు. ముఖ్యంగా ఉమ్మడి కుటుంబం నుంచి వచ్చే అమ్మాయిలు ఒక వ్యక్తిని తల్లిదండ్రులకి తెలియకుండా మీ జీవితాలలోకి ఆహ్వానించే ముందు ఒక్కసారి వెనక్కి వెళ్లి పుట్టుక నుంచి వయస్సు వచ్చే వరకు తల్లిదండ్రులతో గడిపిన మంచి క్షణాలు గుర్తుచేసుకోండి. మీ నిర్ణయాలకి వారు ఎంత విలువ ఇస్తారనేది అర్ధమవుతుంది. మీరు కోరుకునే బంధాన్ని తల్లిదండ్రులకి పరిచయం చేయండి. వారికంటే మీ సంతోషం గురించి గొప్పగా ఆలోచించే వారు ఇంకెవరు ఉండరు.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Actor Prakash : మరీ అంతలా దిగజారిపోకండి

Actor Prakash : మ్యూజిక్ డైరెక్టర్, కోలీవుడ్ హీరో జివి ప్రకాష్ కుమార్ ఈ మధ్యనే తన భార్య సింగర్…

5 hours ago

Lavanya tripathi : మెగా కోడలిని ఏకిపారేస్తున్న జనం

Lavanya tripathi : అందాల రాక్షసి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది లావణ్య త్రిపాఠి. ఈ సినిమాలో క్యూట్ యాక్టింగ్…

7 hours ago

Anushka : ఆ నిర్మాతతో అనుష్క పెళ్లి?

Anushka : టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన నటి అనుష్క శెట్టి. నాగార్జున హీరోగా…

23 hours ago

Ice cream: ఐస్ క్రీమ్ తిన్న వెంటనే ఈ పదార్థాలను తింటున్నారా.. ఈ సమస్యలు తప్పవు?

Ice cream: వేసవి కాలం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరు కూడా చల్ల చల్లని పానీయాలు ఐస్ క్రీములు తినాలని…

1 day ago

Vastu Tips: లేచిన వెంటనే అద్దంలో మీ మొహం చూసుకుంటున్నారా…జర జాగ్రత్త!

Vastu Tips: సాధారణంగా మనం వాస్తు శాస్త్రం ప్రకారం ఎన్నో వాస్తు నియమాలను పాటిస్తూ ఉంటాము అయితే చాలా మంది…

1 day ago

Tuesday: మంగళవారం పొరపాటున కూడా చేయకూడని, చేయవలసిన పనులు ఇవే?

Tuesday: మన హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రతి రోజు ఏదో ఒక దేవుడికి అంకితం చేసే ఆ దేవుడిని ఆరోజు…

1 day ago

This website uses cookies.