Categories: EntertainmentLatest

Vikram : హీరో తరుణ్ అందుకే సినిమాలు చేయడం లేదు

Vikram : స్టార్ కమెడియన్ ఎంఎస్ నారాయ‌ణ‌ గురించి ప్రత్యేక ఇంట్రడక్షన్ అవసరం లేదు. వెండితెరపైన తన కామిక్ సెన్స్ తో ప్రేక్షకులను క‌డుపుబ్బా న‌వ్వించారు ఈయన. కానీ, ఎంఎస్ నారాయణ వార‌సులు ఎవ్వ‌రూ ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో లేరు. హీరోగా కారు కదా కనీసం కమెడియన్ గా కూడా లేరు. దానిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఎంఎస్ నారాయణ కొడుకు విక్ర‌మ్ మాట్లాడాడు. ప్రతిభ లేక ఎవ్వ‌రూ ఇండస్ట్రీకి దూరం కారని, లక్కు లేకే సినిమాను వీడాల్సి వస్తుందని అన్నాడు. కొడుకు సినిమా త‌ర్వాత మళ్లీ మూవీస్ ఎందుకు చేయలేదో చెప్పడంతో పాటు టాలీవుడ్ హీరో తరుణ్ సినిమాలు చేయకపోవడం గురించి కొన్ని కాంట్రవర్సీ కామెంట్స్ చేశాడు. ఆ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

 

vikram-star-comedian-ms-narayana-son-controvercy-comments-on-actor-tarun

‘కొడుకు’ అనే మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు విక్రమ్. తన యాక్టింగ్ కు మంచి మార్కులే పడినా సినిమా హిట్ కాలేదు. అంతే కొడుకు సినిమా తర్వాత మరో మూవీ చేయలేదు. దీని గురించి ఓ ఇంటర్వ్యూలో యాంకర్ అడగ్గా ఆసక్తికరమైన స‌మాధానం చెప్పాడు. ” మా నాన్నది ఓ రైతు కుటుంబం. కష్టపడి చదివి లెక్చరర్ గా ఎదిగారు. మాకు ఆస్తులు కూడా పెద్దగా లేవు. క‌ళ మీద అభిమానంతోనే సినిమాలవైపు వచ్చారు. నిజంగా మా దగ్గర డ‌బ్బు ఉంటే సినిమాలు చేసేవాడినేమో. ఎవ‌రైనా ఒక సినిమా చేసారంటే హిట్ అయితే కంటిన్యూ చేస్తారు. ఫ్లాప్ అయినా సినిమాలు చేశారంటే వాళ్ల‌కు వెనుకాల పొట‌న్షియ‌ల్ ఉందని అర్థం చేసుకోవాలి. అది లేకుండా ఎంత‌మంచి యాక్టర్ అయినా ఇండస్ట్రీలో నిలబడటం కష్టమే. నటనతో పాటు ఆవ‌గింజంత లక్కు ఉంటేనే సినీ రంగంలో రాణించగలం ల‌క్ లేక‌పోతే.. కింద‌కి వెళ్లిపోతారు త‌ప్ప ఇంకేం చేయలేరు. అదే నా విష‌యంలో కూడా జరిగింది.

vikram-star-comedian-ms-narayana-son-controvercy-comments-on-actor-tarun

ఇక హీరో త‌రుణ్ మంచి టాలెంటెడ్ యాక్టర్. చైల్డ్ ఆర్టిస్ట్ గా వచ్చిన తరుణ్ కు ఇండస్ట్రీలో ఒకప్పుడు మంచి క్రేజ్ ఉండేది. మేము సినిమాకి వెళ్లి అత‌డిని చూసి చాలా సంతోషపడేవారం. అత‌నిలో స్పార్క్ ఉంది. నేష‌న‌ల్ అవార్డు విన్న‌ర్ అయిన తరుణ్ ఇప్పుడు సినిమాలు చేయడం లేదు. అంటే అతనికి టాలెంట్ లేక సినిమాలు తీయ‌డం లేదా? ఇక ‘హ్యాపీ డేస్’ మూవీలో చేసిన హీరోలందరూ ఇప్పుడు ఏమయ్యారు? ఎన్నో హిట్ సినిమాలు చేసిన అబ్బాస్ ఏం చేస్తున్నాడు? వాళ్లంద‌రికీ మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి. మ‌రి వాళ్ల‌ను మీరు ఎందుకు నిల‌బెట్ట‌లేదు? టాలెంట్‌కి, సెటిల్ అవ్వడానికి సంబంధం లేదు. టాలెంట్ వేరు అవకాశాలు రావడం వేరు .ఇకవేళ రేపు నాకు అవకాశం వస్తే నటించి మళ్లీ నన్ను ప్రూవ్ చేసుకుంటానేమో. అందుకే ఇండస్ట్రీలో అవ‌కాశాలు రావడం ముఖ్యం. క‌లిసి రావ‌డం కూడా అంతే ఇంపార్టెంట్. అందుకే టాలెంట్ లేదు, వాడు ఇలా చేయ‌లేదు. అలా చేశాడు అనేది అంతా ట్రాష్.”అని విక్రమ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.

Sri Aruna Sri

Recent Posts

Tollywood : వైరల్ ప్రపంచం మూవీ రివ్యూ

Tollywood : డిజిట‌ల్ యుగంలో మ‌న‌కు ఎన్ని సౌక‌ర్యాలు అందుతున్నాయో అన్నీ స‌వాళ్లు ఎదుర‌వుతున్నాయి. టెక్నాల‌జీని స‌రిగ్గా వాడుకోక‌పోతే ఒక్కోసారి…

1 week ago

Tollywood: ప్రభాస్ లైనప్ లో క్లారిటీ లేదే.?

Tollywood: పాన్ ఇండియన్ స్టార్ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా భారీ చిత్రాలకు సైన్ చేశారు. అంతేకాదు, ఏమాత్రం…

4 weeks ago

Akka: కీర్తి సురేశ్ ఇలాంటి రోల్ చేస్తుందా..?

Akka: సౌత్ బ్యూటీ కీర్తి సురేశ్ తెలుగులో సినిమా చేసి చాలా గ్యాప్ వచ్చింది. మహేశ్ బాబు సరసన నటించిన…

1 month ago

Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..?

Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..? గత కొంత కాలంగా మన తెలుగు…

2 months ago

Tollywood Cinema: ఈ సినిమాలు ఫ్లాపా కాదా..క్లారిటీ ఇదే..!

Tollywood Cinema: 2025 సంక్రాంతికి మూడు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మూడు…

2 months ago

సినీ లవర్స్ కోసం ‘అరి’ టీం కొత్త ఆఫర్.. వాట్సప్ చేసి సినిమాని చూడండి

జయ శంకర్ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా అరి. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే షూటింగ్…

2 months ago

This website uses cookies.