Vijay Sethupathi : తమిళ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి మహారాజ సినిమాతో మరోసారి వెండితెరపై అలరించేందుకు రెడీ అయ్యాడు. క్రైం, సస్పెన్స్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ మూవీని నిథిలన్ స్వామినాథన్ రూపొందించారు. ఈ చిత్రాన్ని ప్యాషన్ స్టూడియోస్, ది రూట్‌పై సుధన్ సుందరం, జగదీష్ పళనిస్వామి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో విజయ్ తో పాటు అనురాగ్ కశ్యప్, భారతీరాజా, అభిరామి, మమత మోహన్ దాస్ వంటి స్టార్లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మహారాజ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో సినిమా ప్రచారంలో మేకర్స్, స్టార్స్ జోరు పెంచారు. వరుగా ఇంటర్వ్యూలు ఇస్తూ విజయ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇదే క్రమంలో తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఉప్పెన మూవీలో తనతో కలిసి నటించిన హీరోయిన్ కృతి శెట్టి గురించి విజయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
ఉప్పెన్ మూవీలో కృతి శెట్టి విజయ్ సేతుపతికి కూతురిగా నటించింది. కూతురుగా చేసిన అమ్మాయితో హీరోయిన్ గా జోడీ కట్టడం తన వల్ల కాదని విజయ్ సేతుపతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..”నేను ఈ మధ్యనే డీఎస్పీ అనే మూవీ చేశారు. ఆ సినిమాలో కృతి శెట్టిని హీరోయిన్‌గా తీసుకుంటానంటే నేను చేయలేనని డైరెక్టర్ , ప్రొడ్యూజర్లకు చెప్పా. అందుకు ఓ కారణం ఉంది. ఉప్పెన చిత్రంలో కృతి నా కూతురు క్యారెక్టర్ ప్లే చేసింది. అలా కుమార్తెగా నటించిన అమ్మాయితో రొమాంటిక్ సీన్స్ చేయమంటే నా వల్ల కాదని చెప్పేశాను. అందుకే ఆ సినిమాలో కృతి వద్దు అని మేకర్స్ కు చెప్పాను. ఉప్పెన మూవీలో క్లైమాక్స్ స్సీన్స్ లో కృతి కొన్ని సార్లు కంగారు పడింది. అప్పుడు నేను ఆమెకు ధైర్యం చెప్పేందుకు నాకు నీ వయసున్న కొడుకున్నాడు నన్ను నీ తండ్రి అని అనుకో అని ధైర్యం చెప్పా. కూతురిగా భావించిన అమ్మాయితో హీరోయిన్ గా నటించను. అందుకే అది నా వల్ల కాదు” అని విజయ్ చెప్పాడు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.