Vijay – Rashmika : ఒకే కారులో విజయ్-రష్మిక.. ఇప్పుడు లవ్ కన్ఫర్మ్ ..?

Vijay – Rashmika : రష్మిక పేరు వినగానే భారీ బడ్జెట్ సినిమాలతో పాటూ హీరో విజయ్ దేవరకొండ కూడా గుర్తొస్తాడు. ఎందుకంటే వీరిద్దరి మధ్య ప్రేమ ఉందని ఎప్పటి నుంచో గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ జంట తమ రిలేషన్‌ను చాలా ప్రైవేట్‌గా ఉంచేసింది. సెల్ఫీలు, ట్రిప్స్ షేర్ చేస్తున్నా – పబ్లిక్‌గా కలిసి కనిపించడం చాలా అరుదు. అప్పుడప్పుడూ మీడియా కంటపడిన వీడియోలు మాత్రం వైరల్ అవుతుంటాయి.

ఇటీవల రష్మిక కొంచెం ఓపెన్ అవుతూ కనిపిస్తోంది. తన అభిప్రాయాల్లో విజయ్‌పై ఉన్న సానుభూతిని వెలిబుచ్చుతోంది. ఒక ఫంక్షన్‌లో మాట్లాడుతూ “తాను ఇండస్ట్రీలోని వ్యక్తినే పెళ్లి చేసుకుంటాను” అని చెప్పింది. అప్పటి నుంచి అందరి దృష్టి విజయ్ దేవరకొండవైపే వెళ్లింది.

ఇక ఇటీవల జరిగిన ‘కుబేర’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రష్మిక, “విజయ్ దగ్గర నుంచి అన్నీ తీసేసుకుంటా” అని సరదాగా కామెంట్ చేసింది. ఇప్పుడు ముంబై ఎయిర్‌పోర్ట్‌లో వీరిద్దరూ ఒకే కారులో కనిపించడంతో ఫ్యాన్స్ మళ్లీ ఊహాగానాలు చేయడం మొదలుపెట్టారు “ఇప్పుడు లవ్ కన్ఫర్మేనా?” అని చర్చించుకుంటున్నారు.

vijay-rashmika-vijay-rashmika-in-the-same-car-now-love-confirmed

Vijay – Rashmika :

కెరీర్ విషయానికొస్తే…

రష్మిక ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో స్టార్‌గా ఎదిగింది. ‘యానిమల్’, ‘పుష్ప 2’, ‘ఛావా’ సినిమాలతో విపరీతమైన క్రేజ్‌ను సంపాదించింది. ఇక ‘కుబేర’ రిలీజ్‌కు రెడీ అవుతోంది. మరోవైపు ఆమె నటించిన ‘గర్ల్‌ఫ్రెండ్’, ‘థామా’ వంటి సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి.

విజయ్ దేవరకొండ విషయానికొస్తే, పెద్ద హిట్ కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్నాడు. ఇప్పుడు ఆయన దృష్టంతా ‘కింగ్డమ్’ సినిమాపైనే ఉంది. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా చివరికి జూలై 25న రిలీజ్ కావడానికి సిద్ధమవుతోందని టాక్.

చూడాలి మరి… కెరీర్‌లోనూ, లవ్ లైఫ్‌లోనూ ఈ జంటకి ఏం జరగబోతోందో!

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Panipuri: రోడ్డు సైడ్ పానీపూరి ఇష్టంగా తింటున్నారా.. వీళ్లు మాత్రం పొరపాటున తినొద్దు?

Panipuri: ఇటీవల కాలంలో పానీపూరి తినే వారి సంఖ్య ఎక్కువ అయ్యింది. సాయంత్రమైతే చాలు వీధి చివర బండ్లపై పానీ…

1 week ago

Varalakshmi Vratam 2026: రేపే వరలక్ష్మి వ్రతం.. వితంతువులు కూడా వ్రతం చేయవచ్చా?

Varalakshmi Vratam 2026: శ్రావణమాసం వచ్చిందంటే చాలు పెద్ద ఎత్తున పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు. ఇక శ్రావణమాసంలో మహిళలు…

1 week ago

Papaya In Mansoon: వర్షాకాలంలో బొప్పాయి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?

Papaya In Mansoon: పండ్లు ఎన్నో రకాల పోషకాలను కలిగి ఉంటాయి అనే సంగతి మనకు తెలిసిందే. ఇలా అనేక…

1 week ago

TTD: వడ్డీ కాసుల వాడికి కాసుల వర్షం.. రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం!

TTD: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ఎంతోమంది భక్తులు తరలివస్తున్నారు. వేసవి సెలవులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు…

1 week ago

Ginger Tea: ఉదయాన్నే అల్లం టీ తాగితే ఆరోగ్యానికి మంచిదేనా? ఇది తెలుసుకోవాల్సిందే!

Ginger Tea: చాలామందికి ఉదయం నిద్ర లేవగానే ఒక కప్పు టీ తాగనిదే రోజు గడవదు. ఒక కప్పు టీ…

1 week ago

Shiva Pooja: శివ పూజలో ఈ వస్తువులు వాడుతున్నారా..ఈ తప్పు అస్సలు చేయొద్దు?

Shiva Pooja: శివుడిని అభిషేక ప్రియుడు అని పిలుస్తుంటారు ఆయనకు అభిషేకం చేసి కోరికలు కోరితే తప్పకుండా నెరవేరుస్తారని భక్తులు…

1 week ago

This website uses cookies.