KGF Chapter 2: కేజీఎఫ్ చాప్టర్ 2లో రాఖీభాయ్ పాత్ర చిత్రణ కరెక్ట్ గా లేదని, ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశంలో బంగారం మొత్తం సముద్రంలో కలిపేయడం పరమ చెత్తగా ఉండి అంటూ యువ దర్శకుడు వెంకటేష్ మహా ఘాటు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అయితే అలాంటి సినిమాని ప్రేక్షకులు సూపర్ హిట్ చేశారని చెప్పాడు. అదే ఇంటర్వ్యూలో మేము ఎథిక్స్ కి లోబడి అలాంటి కథలు చెప్పే ప్రయత్నం చేయడం లేదని తనని తాను సమర్ధించుకుంటూ మేము కూడా కత్తిపడితే వాడి బాబు లాంటి సినిమాలు చేస్తామని వెంకటేష్ మహా గొప్పలు చెప్పుకున్నాడు. అతని మాటతీరు. చెప్పే విధానం అంతా కూడా ఈర్ష్యతో చేసినవి అంటూ సోషల్ మీడియాలో కేజీఎఫ్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు.
రెండు చిన్న సినిమాలు చేసి అందులో ఒకటి రీమేక్, మరొకటి హాలీవుడ్ సినిమాలని ఇన్స్పైర్ అయ్యి చేసిన సినిమా వాటి తర్వాత ఇప్పటి వరకు వెంకటేష్ మహాకి ఒక్క సినిమా కూడా లేదు. కాని తనని తాను ఏదో క్రియేటివ్ డైరెక్టర్ అనే ఫీలింగ్ తోనే ఆ వ్యాఖ్యలు చేసారు అని విమర్శలు చేస్తున్నారు. కేజీఎఫ్ చాప్టర్ 2లో రాఖీభాయ్ క్యారెక్టర్ ని ఆ సినిమా చూసి 1200 కోట్ల కలెక్షన్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరు దగ్గర చేసుకున్నారు. చేతనైతే అలాంటి సినిమాని చేయాలి అనుకోవాలి కాని ఆ సినిమాలో ఏమీ లేదని చెప్పడం ద్వారా ప్రేక్షకులకి అభిరుచి లేదని ఆడియన్స్ మీద విమర్శలు చేసినట్లు అయ్యింది. అలాగే ప్రశాంత్ నీల్ పైన కూడా పరోక్షంగా ఆయన విమర్శలు చేసినట్లు అయ్యింది. ప్రేక్షకులు సినిమా చూసినపుడు కేవలం అందులో ఉండే ఎమోషన్ కి కనెక్ట్ అయ్యి మాత్రమే చూస్తారు.
కాని దర్శకులు, రచయితలు అదే సినిమాని చూసినపుడు వారి దృక్కోణం నుంచి చూస్తారు. ఆ క్యారెక్టర్ ని నేను అయితే ఎలా ప్రెజెంట్ చేస్తాను అని ఆలోచించుకుంటారు. అప్పుడు ఒరిజినల్ తెరకెక్కించిన దర్శకుడి ఐడియాకి కనెక్ట్ కాకపోవచ్చు. కాని కామన్ మెన్ పాయింట్ నుంచి సినిమా చూసినపుడు కచ్చితంగా రాఖీభాయ్ ఎమోషన్ లో తల్లి మీద విపరీతమైన ప్రేమ కనిపిస్తుంది. ఇక దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని చెప్పారు. ఆ క్యారెక్టర్ తో తాను ఎలాంటి మెసేజ్ ఇవ్వాలని అనుకోలేదని చెప్పాడు.
ఓక క్యారెక్టర్ మ్యాడ్ నెస్ ని మాత్రమే చూపించా అని క్లారిటీ ఇచ్చాడు. తల్లిప్రేమలో మునిగిపోయిన రాఖీభాయ్ లాంటి మ్యాడ్ నెస్ ఉన్న వ్యక్తి అలాగే చేస్తాడని సమాజం గురించి ఆలోచించడు అని చెప్పాడు. దీనిని బట్టి ప్రేక్షకుల అభిరుచి కరెక్ట్ గానే ఉన్న వెంకటేష్ మహా ఒపీనియన్, చూసే దృక్కోణం కరెక్ట్ గా లేదని చెప్పాలి. అలాగే దానిని వ్యక్తం చేసిన విధానం కూడా కరెక్ట్ గా లేదనే మాట వినిపిస్తుంది. అందుకే భాషలతో సంబంధం లేకుండా అందరూ వెంకటేష్ మహాని ట్రోల్ చేస్తున్నారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.