Categories: HealthLatestNewsTips

Health Tips: సరిగా నిద్రపట్టడం లేదా…? అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి

Health Tips: మన రోజువారి దైనందిన జీవితంలో నిద్ర కూడా ఒక భాగం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతి మనిషి రోజుకి 8 గంటలు నిద్రపోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వయస్సు బట్టి నిద్రపోయే సమయం కూడా ఉంటుంది. చిన్నారులు అయితే రోజుకి 12 గంటలకి పైగ నిద్రపోవాలి. అలాగే యుక్త వయస్సు దాటిన తర్వాత మన రోజువారి జీవితంలో కచ్చితంగా 8 గంటలు నిద్రకోసం కేటాయించాలి. గ్రామీణ ప్రాంతాలలో ఒకప్పుడు రాత్రి 8 గంటలకి నిద్రపోయి ఉదయం 5 గంటలకి మేల్కొనే వారు. అయితే పట్టణ సంస్కృతి పెరిగిన తర్వాత నిద్రపోయే సమయం క్రమంగా తగ్గిపోయింది. రాత్రి 11, 12 గంటల వరకు మెలుకువగా ఉంటున్నారు.

అలాగే ఉదయం 8 నుంచి 10 గంటల వరకు నిద్రపోతున్నారు. అయితే ఉద్యోగాలు చేసేవారు మాత్రం కాస్తా వేగంగా నిద్ర లేస్తున్నారు. అయితే ప్రస్తుతం సగటున ప్రతి మనిషి నిద్రపోయే సమయం 4 నుంచి 6 గంటల మధ్యనే ఉంటుంది అనేది పరిశోధనల ద్వారా తేలిన నిజం. ఇదిలా ఉంటే దేశం లో 30 నుంచి 40 శాతం మంది ప్రజలు నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. నిద్రలేమి సమస్యని ఎన్ సోమేనియా అని అంటారు. ఈ వ్యాధి బారిన పడే వారికి ఒక పట్టాన నిద్ర పట్టదు. పడుకోవాలని ప్రయత్నం చేసినా కూడా గంటల తరబడి మనసు నిద్ర మీద లగ్నం కాదు. రకరకాల ఆలోచనలు మనసులో తిరుగుతూ ఉంటాయి. మానసిక సంఘర్షణల కారణంగా నిద్రలేమి సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి.

యుక్త వయస్సు నుంచి ఈ సమస్యలు ప్రతి వ్యక్తిలో ప్రారంభం అవుతాయి. అయితే ఈ మానసిక సమస్యలు కొంత మంది అధికమిస్తారు. అయితే మెజారిటీ ప్రజలు ఈ మానసిక సమస్యలతో సతమతం అవుతూ నిద్రపోలేకపోతారు. నిద్రపోకుంటే మానసిక ఒత్తిడి అధికం అవుతుంది. అలాగే బీపీ పెరుగుతుంది. తీవ్రమైన అలసటకి గురవుతారు. శారీరక సామర్ధ్యం క్రమంగా తగ్గిపోతుంది. జీర్ణక్రియ వ్యవస్థ దెబ్బతింటుంది. అంతర్గత రక్తప్రసరణ వ్యవస్థలో లోపాలు వస్తాయి. పెరాలసిస్ బారిన పడే ప్రమాదం ఉంది. ఆత్మన్యూనతా భావం పెరిగిపోయి ఆత్మహత్యలు చేసుకునే స్థాయికి వెళ్ళిపోతారు. ఇవన్ని కూడా నిద్రలేమి సమస్యలతో వస్తాయి. అయితే నిద్రలేమి నుంచి బయటపడాలంటే ముందుగా మనస్సులో ఉన్న ఒత్తిడి మొత్తం దూరం చేసుకోవాలి.

 

అలాగే అనవసరమైన విషయాల గురించి అతిగా ఆలోచించకూడదు.  ఏ విషయాన్ని సీరియస్ గా తీసుకొని అదే పనిగా టెన్షన్ కి గురి కాకూడదు. ఒత్తిడికి గురి చేసే దృశ్యాలు చూడకూడదు. నిద్రపోయే సమయంలో లైట్స్ అన్ని ఆర్పేసే ప్రయత్నం చేయాలి. అలాగే చీకటిని మనస్సుకి అలవాటు చేసుకోవాలి. చీకటి పడితే నిద్రసమయం అయ్యిందనే విషయాన్ని మనస్సుకి అలవాటు చేయాలి. అలాగే నిద్ర సమయం వచ్చినపుడు కళ్ళు మూసుకొని ఆలోచనలకి విశ్రాంతి ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఏవైనా అనవసరమైన ఆలోచనలు మనస్సులోకి వస్తున్నట్లు అనిపిస్తే వెంటనే ఇష్టమైన వ్యక్తులని, లేదా దైవాన్ని చూడటం చేయాలి. అలాగే పాజిటివ్ ఆలోచనలు పెంపొందించుకోవాలి. వీలైనంత ప్రశాంత స్థితిలో ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఇలా చేయడం ద్వారా నిద్రలేమి సమస్య నుంచి బయట పడవచ్చు అని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు.

Varalakshmi

Recent Posts

Kollywood: ఓం రివ్యూ- ధనుష్, సాయిపల్లవి మూవీ మెప్పించిందా?

మూవీ: ఓం (OM: ఆపరేషన్ మోల్) నటీనటులు: ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల, శివాజీ రాజా, నసీరుద్దీన్ షా,…

3 days ago

Tollywood: “ఆకాశంలో ఒక తార”: రివ్యూ & రేటింగ్‌

టైటిల్: ఆకాశంలో ఒక తార నటీనటులు: దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి, శ్రుతి హాసన్, మురళీ శర్మ, స్వాసిక, రుహానీ…

3 days ago

Tollywood: పవన్‌తో విడిపోయిన వెంటనే అన్నా కీలక నిర్ణయం..!

Tollywood: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం మరోసారి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, సోషల్ మీడియా వేదికగానూ హాట్…

2 weeks ago

AP POLITICS: ఏపీ లోకల్ ఎలక్షన్స్.. వైసీపీకి ప్లస్సా? మైనసా?

AP POLITICS: గత సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా కోలుకోలేదా? అంటే..…

2 weeks ago

TS POLITICS: రేవంత్ బర్త్‌డే: పట్టించుకోని కాంగ్రెస్ పెద్దలు

TS POLITICS: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఒక…

2 weeks ago

NATS: షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. మిషిగన్‌లో నాట్స్

NATS: అమెరికాలోని షార్లెట్‌ లో నిర్వహించిన ‘షార్లెట్ తెలుగు సంబరాలు 2026’ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు, యువత, పెద్దలు…

1 month ago

This website uses cookies.