Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం మనం ఎన్నో రకాల పువ్వులను మొక్కలను అలాగే జంతువులను శుభప్రదమైనవిగా భావిస్తూ ఉంటాము. అయితే వాస్తు ప్రకారం ఈ మొక్కలు నాటేటప్పుడు సరైన దిశలో నాటడం వల్ల ఎన్నో శుభ ఫలితాలను పొందవచ్చు. ఇలా మనం ఎన్నో ఆధ్యాత్మిక మొక్కలను ఇంటి ఆవరణంలో పెంచుతూ ఉంటాము అయితే లక్ష్మీదేవి విఘ్నేశ్వరుడు కుబేరులకు ప్రతీకగా ఉన్నటువంటి మొక్కలలో అపరాజిత పుష్పం ఒకటి. దీనినే శంకు పుష్పాలు అని కూడా పిలుస్తారు.
ఈ మొక్క మన ఇంటి ఆవరణంలో గనక ఉంటే సాక్షాత్తు ఆ లక్ష్మీ కుబేరుల అనుగ్రహం మనపై ఉన్నట్లేనని భావిస్తారు. అంతేకాకుండా శనీశ్వరుడికి ఈ పుష్పాలతో పూజ చేస్తే శని దోషాలు కూడా తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ఇలాంటి ఎంతో శుభప్రదమైనటువంటి ఈ మొక్కను మన ఇంటి ఆవరణంలో పెంచేటప్పుడు కాస్త జాగ్రత్తలు తీసుకొని పెంచడం మంచిదని పండితులు చెబుతున్నారు.
ముఖ్యంగా ఈ మొక్కను మనం ఇంట్లో నాటేటప్పుడు సరైన దిశలో నాటడం ఎంతో ముఖ్యం. ఈ అపరాజిత మొక్కను లక్ష్మి గణేష్ కుబేరుల స్థానమైనటువంటి తూర్పు ఉత్తరం లేదా ఈశాన్య దిశలలో నాటడం వల్ల అనుకూల ఫలితాలను పొందవచ్చు. గురువారం లేదా శుక్రవారం ఈ మొక్కను ఇంటి ఆవరణంలో నాటడం ఎంతో మంచిది. ఇక ఇంటి ఆవరణంలో స్థలం లేనటువంటి వారు ప్రధాన ద్వారం కుడివైపు ఈ మొక్కను ఒక కుంపటిలో పెట్టుకోవడం కూడా శుభప్రదం అని పండితులు చెబుతున్నారు. ఈ పుష్పాలతో శనీశ్వరునికి పూజ చేస్తే కనుక మనపై ఉన్నటువంటి శని దోషాలు తొలగిపోతాయి అలాగే లక్ష్మీదేవిని పూజించడంతో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.