Vastu Tips: సాధారణంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. ఇలా పూజలు చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం మనపై ఉంటుందని భావిస్తారు. ఈ క్రమంలోనే అమ్మవారి అనుగ్రహం మనపై కలిగి ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలంటే శుక్రవారం పటిక బెల్లంతో ఈ చిన్న పరిహారం చేయటం వల్ల అమ్మవారి కరుణ కటాక్షాలు ఎల్లవేళలా మనపై ఉంటాయి. వాస్తుశాస్త్రం ప్రకారం పటిక బెల్లంతో పరిహారం చేయటం వల్ల ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ వైబ్రేషన్స్ అన్ని తొలగిపోయి పాజిటివ్ వైబ్రేషన్స్ ఏర్పడతాయి.మరి పటిక బెల్లం తో ఎలాంటి పరిహారాలు చేయడం వల్ల శుభం కలుగుతుంది అనే విషయానికి వస్తే…
పటిక బెల్లం ఇంట్లో ఉంచటం వల్ల ఆ లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని ప్రజల విశ్వాసం. పటిక బెల్లం ఇంట్లో ఉంచడం వల్ల ఆనందం, శ్రేయస్సు, ఆరోగ్యం కలుగుతాయి. ఒక చిన్న గిన్నెలో నీరు పోసి అందులో కొంచెం పట్టిక బెల్లం వేసి ఇంట్లోనే ఒక మూలలో దీనిని ఉంచడం వల్ల తరచూ ఇంట్లో జరిగే గొడవలు తగ్గిపోయి మనశ్శాంతి లభిస్తుంది. అదేవిధంగా ఒక 50 గ్రాముల పట్టిక బెల్లాన్ని ఒక గిన్నెలో వేసి పూజ గదిలో ఉంచటం వల్ల సమస్యలు తొలగిపోవడమే కాకుండా కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత చేకూరుతుంది.
ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యేవారు ఈ ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలి అంటే శుక్రవారం పటిక బెల్లంతో ఈ పరిహారం చేయడం ఎంతో ముఖ్యం. శుక్రవారం రోజున పూజ గదిలో పటికబెల్లాన్ని ఉంచి ఆ లక్ష్మీదేవికి ఇష్టమైన తామర పువ్వులు సమర్పించి భక్తిశ్రద్ధలతో పూజించటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించి ఆర్థిక సమస్యలు తొలగిపోవడమే కాకుండా ధన ప్రాప్తి కలుగుతుంది. ఇలా ఐదు శుక్రవారం పాటు చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.