Vastu Tips: మన హిందూ సాంప్రదాయం ప్రకారం వాస్తు శాస్త్రాన్ని ఎంతగానో నమ్ముతుంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం మనం ఏ పని చేసినా కూడా శుభం కలుగుతుందని భావిస్తారు. అందుకే చేసే ప్రతి పని కూడా వాస్తును దృష్టిలో పెట్టుకొని ప్రతి పని చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఇంటి నిర్మాణ సమయంలో ప్రతి ఒక్కరు కూడా వాస్తు శాస్త్రాన్ని పరిగణలోకి తీసుకొని ఇంటి నిర్మాణ పనులు చేపడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇంటి నిర్మించే ముందు ఇంటి గుమ్మానికి ఎదురుగా పొరపాటున కూడా ఈ మూడు వస్తువులు ఉండకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
ఇంటికి ప్రధాన గుమ్మం ఎదురుగా ఎప్పుడూ కూడా నిలువు స్తంభం ఉండకూడదు. వాస్తు ప్రకారం ఇలా నిలువ స్తంభం ఉండడం వల్ల ఇంట్లోని స్త్రీ అనారోగ్య సమస్యలకు గురవుతారని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇంటి ముందు వాస్తు అభిప్రాయ ప్రకారం ఇంటి ముందు మెట్లు కట్టకూడదు. ఎందుకంటే ఇది ఇంట్లోని వ్యక్తులకు ఆర్థిక సమస్యలను కలిగిస్తుంది. ఇంటి ప్రధాన ద్వారం ముందు చెట్టు ఉండకూడదు. ఎందుకంటే వాస్తు శాస్త్ర ప్రకారం మీ ఇంటి ప్రధాన ద్వారం ఎదురుగా చెట్టు ఉంటే ఇంట్లోనే వ్యక్తుల ఆటంకాలు ఏర్పడతాయి. అందుకే ఇంటికి ఎదురుగా ఈ మూడింటిని అసలు ఉంచకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
ఇక చాలామంది ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉన్నటువంటి గుమ్మం మీద కూర్చుని మాట్లాడుతూ ఉంటారు. అలాగే గుమ్మం దగ్గర గోర్లు కత్తిరిస్తూ ఉంటారు. మరికొందరు అక్కడే కూర్చుని తల దువ్వుతూ ఉంటారు. ఇలా గుమ్మం దగ్గర ఈ పనులు చేయటం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు. అందుకే ఎప్పుడూ కూడా గుమ్మం దగ్గర ఈ విధమైనటువంటి పనులు చేయకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇక శుక్రవారం సమయంలో గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూజించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మన పైనే ఉంటుంది.
Mega 158: దుబాయ్లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.