Varun-Lavanya : గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వరుణ్ తేజ్ లావణ్యల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. వీరిద్దరు ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటున్న విషయం తెలిసిందే. దీంతో వీరి పెళ్లి డేట్స్ గురించి వెళ్లి గురించి సోషల్ మీడియాలో రోజుకో వార్త వస్తుంది. చాలా రోజులు ఇదో సస్పెన్స్ గా మారింది. తాజాగా వరుణ్ తేజ్ లావణ్యల పెళ్లి శుభలేఖ నెట్టింట ప్రత్యక్షమైంది. దీనితో ఈ వెడ్డింగ్ కార్డు వైరల్ అవుతుంది.
టాలీవుడ్ యంగ్ స్టార్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలు పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. మెగావారింట ఇప్పటికే ఈ పెళ్లి సంబరం షురూ అయ్యింది . ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ధూమ్ ధామ్ గా సాగుతున్నాయి. ఇక పెళ్లి భాజలు మోగడమే తరువాయి. ఈ క్రమంలో ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరి పెళ్లి వెడ్డింగ్ కార్డు ప్రత్యక్షమైంది. వరుణ్ తేజ్ నాయనమ్మ-తాతయ్యల పేరులతో పాటు పెదనాన్న చిరంజీవి, బాబాయి పవన్ కళ్యాణ్, అన్నయ్య రామ్ చరణ్ పేరులను శుభలేఖలో ప్రింట్ చేశారు.
అక్టోబర్ 30 నుంచి మెగా వారి పెళ్లి వేడుక ప్రారంభం కాబోతుంది. ఇటలీలోని టుస్కానీ సిటీలో నవంబర్ 1న వరుణ్, లావణ్య కుటుంబసభ్యుల మధ్య ఈ పెళ్లి వేడుక ఘనంగా జరగనుంది. నవంబర్ 5న హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ హాల్ లో ఈ కపుల్ రిసెప్షన్ వేడుక నిర్వహించనున్నారు. ఈ రిసెప్షన్ లో సినీ సెలబ్రిటీస్ తో పాటు పలువురు ప్రముఖులు రానున్నారు.ఇదిలా ఉండగా వారున్ వివాహం కోసం మెగా ఫ్యామిలీ మొత్తం అక్టోబర్ 27న ఇటలీ వెళ్లానున్నారు.
ఇక తమ్ముడి పెళ్లి పనులు అన్ని కూడా అన్నయ్య రామ్ చరణ్, ఉపాసనలు తన భుజాన వేసుకున్నారు. దగ్గరుండి మరి పెళ్లి పనులు చూసుకుంటున్నట్లు ఇన్ఫర్మేషన్ . రీసెంట్ గా చరణ్, ఉపాసనలు పెళ్లి పనుల కోసం ఇటలీ కూడా వెళ్లారట . అయితే అబ్బాయి పెళ్ళికి బాబాయ్ పవన్ కళ్యాణ్ వెళ్తాడా లేదా అనేది ప్రస్తుతం డౌట్ గా ఉంది.ప్రస్తుతం జనసేన పవన్ ఏపీ పాలిటిక్స్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పవన్ ఇటలీ వెళ్తాడా అనేది వెయిట్ చేసి చూడాల్సిందే.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.