Mega 156: మెగాస్టార్ సరసన క్రేజీ హీరోయిన్ ఫిక్స్..ఇంకో ఇద్దరు కూడా..!

Mega 156: మెగాస్టార్ చిరంజీవి, ‘బింబిసార’ చిత్రంతో హాట్ టాపిక్‌గా మారిన మల్లిడి వశిష్ఠ్ కాంబినేషన్‌లో మెగా 156 ఇటీవల విజయదశమి పండుగనాడు ఘనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఎం ఎం కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఫ్యాంటసీ కథాంశంతో ఈ సినిమా రూపొందబోతోంది. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌తోనే అంచనాలు పెంచారు.

ఇక ఈ సినిమాకి ‘విశ్వంభర’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. ‘వీరుడు’ లాంటి పలు టైటిల్స్ అనుకున్న చిత్రబృందం చివరికి ‘విశ్వంభర’ టైటిల్ వైపే మొగ్గు చూపారట. ఈ టైటిల్ చిరంజీవికి బాగా నచ్చిందని చెప్పుకుంటున్నారు. దసరా పండుగ నాడు సాంగ్ రికార్డింగ్ తో మెగా 156 మొదలైంది. వాస్తవానికి మెగా 156 చిత్రాన్ని చిరంజీవి కూతురు సుస్మిత నిర్మించాల్సింది. అందుకే మెగా 157 గా పోస్టర్ వదిలారు.

mega-156-crazy-heroine-fix-opposite-megastar-and-two-more-too

Mega 156: చిరంజీవి సరసన హీరోయిన్‌గా అనుష్క శెట్టి..?

అయితే, ఇప్పుడు ఆర్డర్ మారి మెగా 156 గా ఈ మూవీ రాబోతుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా ఇప్పటికే అనుష్క శెట్టి ఫైనల్ అయిందని తాజా సమాచారం. గతంలో అనుష్క చిరు సరసన ఓ సాంగ్‌లో నటించింది. ఆ తర్వాత మరో సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించింది. కానీ, చిరంజీవి సరసన హీరోయిన్‌గా మాత్రం నటించలేదు. మెగా 156 లోనే మొదటిసారి. అలాగే మలయాళీ ముద్దుగుమ్మ సంయుక్త మేనన్ పేరు కూడా పరిశీలనలో ఉంది.

వీరు మాత్రమే కాకుండా బాలీవుడ్ హీరోయిన్స్ కూడా నటించే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వినిపిస్తోంది. ప్రముఖంగా దీపిక పడుకొన్, శ్రద్ధ కపూర్‌ల పేరు వినిపిస్తోంది. వాల్తేరు వీరయ్య సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశీ రౌతెలా ఐటెం సాంగ్ లో ఆడిపాడింది. ఇప్పుడు మరో బాలీవుడ్ బ్యూటీ చిరు సరసన సందడి చేయనుందని తెలుస్తోంది. వారెవరో త్వరలో అధికారికంగా వెల్లడించనున్నారట.

 

 

 

 

 

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

1 week ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

1 week ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

1 week ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

2 weeks ago

Lord Shiva: కోరిన కోరికలు తీరడం లేదా.. శివాలయంలో ఈ పరిహారం చేస్తే చాలు!

Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…

2 weeks ago

Climbing Stairs: మెట్లు ఎక్కుతూ అలసిపోతున్నారా? ఫిట్ నెస్ లోపం అనుకుంటే పొరపాటే?

Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…

2 weeks ago

This website uses cookies.