Ustaad Bhagat Singh: పాన్ ఇండియా సినిమా కాదా..?

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్‌సింగ్ పాన్ ఇండియా సినిమా కాదా..? ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌లో ఇదే చర్చ సాగుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పటికే, హరి హర వీరమల్లు, ఓజీ చిత్రాల షూటింగ్ పూర్తైంది. వీరమల్లు చిత్రానికి క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తుండగా అగ్ర నిర్మాత ఏ ఎం రత్నం మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా సోనాక్షి సిన్‌హా, బాబీ డియో, నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జూలై 24న పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ అవుతోంది.

ఇక సుజీత్ దర్శకత్వంలో ఓజీ రూపొందుతోంది. ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ కిస్సుల హీరో ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే, ఈ సినిమా షూటింగ్ పూర్తై శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ లో రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సినిమాను పాన్ ఇండియా వైడ్‌గానే రిలీజ్ చేస్తున్నారు. ఇలా వీరమల్లు, ఓజీ చిత్రాలు పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్‌కి రెడీ అవుతుంటే, ఉస్తాద్ భగత్‌సింగ్ మాత్రం కేవలం రీజనల్‌గానే ప్లాన్ చేస్తున్నారట.

Ustaad Bhagat Singh: పాన్ ఇండియా సినిమా కాదా..?

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్‌కి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన దర్శకుడు హరీశ్ శంకర్

గతంలో పవన్ కళ్యాణ్‌కి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన దర్శకుడు హరీశ్ శంకర్ రూపొందిస్తున్న క్రేజీ మూవీ ఉస్తాద్ భగత్‌సింగ్. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. పవన్ కళ్యాణ్‌కి నరేంద్ర మోదీ మాటలతో వచ్చిన పాపులారిటీ అటు రాజకీయంగా ఇటు సినిమాల పరంగా ఎవరూ ఊహించని రేంజ్. ఇలాంటి సమయంలో ఉస్తాద్ కూడా పాన్ ఇండియా రిలీజ్ అయితే వచ్చే లాభాలు లెక్కపెట్టలేము. మరి హరీష్ తాను రాసుకున్న కథను ఎందుకు పాన్ ఇండియా సినిమాగా తీయడం లేదో.. అని ఫ్యాన్సే మాట్లాడుకుంటున్నారు.

ఇప్పటివరకూ ఎక్కడా కూడా ఉస్తాద్ భగత్‌సింగ్ పాన్ ఇండియా సినిమా అని ప్రకటించలేదు. బహుషా వీరమల్లు, ఓజీల రిజల్ట్ చూసేమైనా ప్లాన్ చేస్తారేమో అని టాక్ వినిపిస్తోంది. ఒకవేళ అదే అయితే పవన్ సినిమాలకి అన్నీ భాషలలోనూ విపరీతమైన క్రేజ్ ఉంది. ఏ భాషలో డబ్ చేసినా మంచి హిట్ సాధిస్తుంది. మరి, ఎందుకు హరీష్ శంకర్ ఉస్తాద్ ని పాన్ ఇండియా సినిమాగా అనౌన్స్ చేయడం లేదు అన్నది తెలియాలంటే ఈ సినిమా నుంచి అప్‌డేట్స్ వచ్చే వరకూ ఆగాల్సిందే. కాగా, త్వరలో మూవీ టీమ్ అంతా సాంగ్స్ షూట్ కోసం ఫారిన్ వెళ్ళబోతోంది.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Tollywood: బాక్సాఫీస్ అసలైన లెక్కలు తేలేది ఈరోజు నుంచే

Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…

2 days ago

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు!

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…

2 days ago

Ashika Ranganath: టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా?

Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…

2 days ago

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఎవరో తెలుసా?

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…

3 days ago

Spirit Movie Release Date: స్పిరిట్ రిలీజ్ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగ..కానీ, ఆ విషయం మర్చిపోయాడా?

Spirit Movie Release Date: స్పిరిట్ రిలీజ్ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగ..కానీ, ఆ విషయం మర్చిపోయాడా? అవును..తాజాగా ఈ…

4 days ago

MSG: మన శంకరవరప్రసాద్ గారు 4 రోజుల్లో మెగా రికార్డ్

MSG: మన శంకరవరప్రసాద్ గారు 4 రోజుల్లో మెగా రికార్డ్ సాధించారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ సినిమా కేవలం…

4 days ago

This website uses cookies.