Health: ఏజ్ పెరుగుతున్నా కొద్ది అనారోగ్య సమస్యలు తలుపు తడుతూనే ఉంటాయి. వయసు 30 దాటితే చాలు దీర్ఘకాలిక వ్యాధులు ఇప్పుడు చాలా మందిలో కామన్ గా కనిపిస్తున్నాయి.అందుకే వయసుకు తగ్గట్లుగా ఆహారంలో పోషకాలు తీసుకోవాలని నిపుణులు పేర్కొంటుంటారు. ఈ ఏజ్ లో శరీరం ఎక్కువగా ఆధారపడే ముఖ్యమైన పోషకాలలో కాల్షియం ఒకటి. కాల్షియం, ఎముకలు, కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడుతుంది. వయసు పెరిగే కొద్దీ మన ఎముకలు, కీళ్ల ఆరోగ్యం కూడా క్షీణించడం ప్రారంభమవుతుంది.
నేటి బిజీ లైఫ్ లో , మీ ఎముకల ఆరోగ్యాన్ని చూసుకోవడం వాటి క్షీణతను తగ్గించడం చాలా కష్టం. ముఖ్యంగా 30 ఏళ్లలోపు వారికి ఇది చాలా కష్టతరంగా ఉండవచ్చు. అందుకే 30 ఏళ్లలోపు వారు వారి ఆహారంలో చేర్చుకోవాల్సిన ఉత్తమ కాల్షియం-రిచ్ ఫుడ్‌ల జాబితాను ఇప్పుడు చూద్దాం.
పాలు :
కాల్షియం అధికంగా ఉండే ఉత్తమ ఆహారాలలో పాలు ఒకటి. కాబట్టి దానిని ఆహారంలో భాగం గా మార్చుకోవాలి. పాలు కాల్షియం మాత్రమే కాకుండా మరికొన్ని ముఖ్యమైన ఖనిజాలు, విటమిన్లను కూడా అందిస్తాయి. ఫ్యాట్ ఫ్రీ మిల్క్ అనేది బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే పాలలో కొవ్వు పదార్ధం ఎక్కువగా ఉన్నప్పుడు దాని నుండి తక్కువ కాల్షియం పొందుతారు. ఒక కప్పు పగిలిన పాలలో 306 మి.గ్రా కాల్షియం లభిస్తుంది.
బ్రోకలీ :
ఈ మధ్య చాలా మంది తమ ఆహారంలో తరచుగా బ్రోకలీ ని తీసుకుంటున్నారు. బ్రోకలీలో కాల్షియం, విటమిన్లు, మినరల్స్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. బ్రోకలీని అతిగా ఉడికించకుండా తినడం బెస్ట్ మెథడ్. అతిగా ఉడికిస్తే , ఇందులో విటమిన్ నష్టానికి దారి తీస్తుంది. జ్యూస్‌లు, సూప్‌లు, టాపింగ్స్, సలాడ్‌లు మొదలైనవాటిలో దీనిని తీసుకోవచ్చు.
పెరుగు :
పెరుగు అనేది 2,000 B.C నాటి సాంప్రదాయ ఆహారం. దీన్ని తయారు చేయడానికి ఉపయోగించే పద్ధతి కారణంగా, పెరుగు లో పాల కంటే ఎక్కువ కాల్షియం కంటెంట్ కలిగి ఉంటుంది. ప్రతి రోజు పెరుగు తీసుకోవడం వల్ల 42 శాతం కాల్షియంను శరీరానికి అందిస్తుంది.
నట్స్ & సీడ్స్ :
చియా గింజలు, నువ్వులు, అవిసె గింజలు, వాల్‌నట్స్ , వేరుశెనగలు నువ్వుల గింజలు వంటి కాల్షియం అధికంగా ఉండే విత్తనాలను ఆహారంలో చేర్చుకోవాలి.
చీజ్ :
జున్ను వంటి పాల ఉత్పత్తులలో కాల్షియం, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఎక్కువ శాతం చీజ్‌లలో కొవ్వు ఉంటుంది.జున్ను తినే ముందు, జాగ్రత్త అవసరం. తక్కువ కొవ్వు ఉన్న హార్డ్ చీజ్‌లకు ప్రాధాన్యత ఇవ్వాలి.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.