Banana Peel: మామూలుగా మనం అరటిపండును తిన్న తర్వాత అరటి తొక్కను విసిరేస్తూ ఉంటాం. అయితే మీకు తెలుసా, కేవలం అరటిపండు వల్ల మాత్రమే కాకుండా అరటి తొక్క వల్ల కూడా ఎన్నో రకాల అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. మరి అరటి పండు తొక్క వల్ల కలిగే ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అరటి పండు తొక్కలో ఉండే ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. అరటి తొక్క లోపలి భాగంతో ముఖాన్ని రుద్ది ఒక అరగంట సేపు ఆగి చల్లటి నీళ్లతో కడుగాలి. ఇలా ఒక వారం పాటు చేస్తే మీ ముఖం పై ఉన్న ముడతలను ఈజీగా తగ్గించుకోవచ్చు. మనం మామూలుగా బయట ఎక్కడెక్కడో తిరగాల్సి వస్తూ ఉంటుంది. ఎండలో తిరగడం వల్ల చర్మం అంతా జిడ్డు జిడ్డు అయిపోతుంది.
అలాంటప్పుడు అరటి పండు తొక్క లోపలి భాగాన్ని ముఖంపై రుద్ది అరగంట సేపు ఆగాక గోరు వెచ్చని నీటితో ముఖాన్ని కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ముఖ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు.కొందరికి పళ్లు కొద్దిగా లేత పసుపు రంగులోకి మారుతూ ఉంటాయి. ఎంత తోమినా తెల్లగా కాకపోగా పళ్లను పెదవుల కిందే దాచుకోవాల్సి వస్తుంది. అలాంటి సమయంలో అరటి తొక్క లోపలి భాగంతో పళ్ళని రుద్దడం వల్ల మీ పళ్ళు నిగ నిగలాడుతూ తెల్లగా మెరిసిపోతాయి. అలాగే ఏదైనా దోమ వంటి పురుగుల కాటుకు గురై చర్మంపై దురదలు, మంటలు కనుక వస్తే వాటిని తగ్గించడానికి అరటి పండు తొక్క ఉపయోగపడుతుంది.
చర్మంపై ఎక్కడైతే సమస్యగా ఉందో అక్కడ అరటి పండు తొక్కను రాసి 10 నిమిషాలు ఆగి ఆ తర్వాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల దురద, మంట తగ్గిపోతుంది. అలాగే కాలిన గాయాలు, దెబ్బలకు అరటి పండు తొక్క ఒక మంచి ఔషధంగా పనిచేస్తుంది. సమస్య ఉన్న శరీర భాగంపై అరటి పండు తొక్కను ఉంచి కట్టు కట్టాలి. రాత్రంతా దాన్ని అలాగే ఉంచాలి. రోజూ రాత్రి ఇలా చేస్తే ఒకటి, రెండు రోజుల్లోనే దెబ్బలు మానిపోతాయి.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.