Uday Kiran: ప్రముఖ సీనియర్ నటి సుధ ఇటీవల దివంగత నటుడు ఉదయ్ కిరణ్ గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘చిత్రం’ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు ఉదయ్ కిరణ్. రీమా సేన్ హీరోయిన్‌గా నటించింది. తేజ దర్శకత్వంలో వచ్చిన మొదటి చిత్రమిది. అగ్ర నిర్మాత రామోజీ రావు నిర్మించారు. 40 లక్షల లోపే నిర్మించిన చిత్రం 10 కోట్ల వరకూ వసూళ్ళు రాబట్టి అప్పట్లో ఓ ట్రెండ్ సెట్టర్ అయింది.
ఆ తర్వాత ఈ తరహా కథలెన్నో రూపొందాయి. తేజ దర్శకత్వంలోనే ఉదయ్ కిరణ్ ‘నువ్వు నేను నేను’, ‘ఔనన్నా కాదన్నా’ లాంటి ప్రేమ కథా చిత్రాలు చేశాడు. ‘మనసంతా నువ్వే’, ‘శ్రీరాం’, ‘కలుసుకోవాలని’, ‘హోళి’, ‘నీ స్నేహం’.. లాంటి ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి స్టార్‌గా ఎదిగాడు. ఉదయ్ కిరణ్ సినిమా రిలీజ్ అంటే పెద్ద దర్శకుల చిత్రాలకి కూడా థియేటర్స్ దొరకని పరిస్థితి ఏర్పడింది. అయితే, కెరీర్ మంచి పీక్స్ లో ఉన్నప్పుడే మెగాస్టార్ చిరంజీవి కూతురుతో పెళ్ళి అంటూ వార్తలు వచ్చాయి.
అంతా కూడా ఉదయ్ కిరణ్ మెగా ఫ్యామిలీకి అల్లుడు కాబోతున్నాడని చెప్పుకున్నారు. ‘ఇంద్ర’ సక్సెస్ సెలబ్రేషన్స్ లో కూడా ఉదయ్ గురించి పొగడ్తలతో ముంచేశారు. అంతగా ఉబలాటపెట్టిన మెగా ఫ్యామిలీ, ఉన్నపలంగా పెళ్ళి క్యాన్సిల్ చేసింది. ఏం జరిగిందో ఇప్పటికీ ఎవరికీ పూర్తిగా తెలీదు. కెరీర్ మీదే కోలుకోలేని దెబ్బ పడింది. అవకాశాలు తగ్గిపోయాయి. మనోవేదని గురయ్యాడు. ఎవరూ అవకాశాలివ్వడం లేదని మానసికంగా కృంగిపోయాడు.
దీనంతటికీ కారణం మెగా ఫ్యామిలీ అనే మాట ఇప్పటికీ వినిపిస్తుంది. ఈ విషయంలో కొందరు వారినీ ధ్వేశిస్తున్నారు కూడా. అలాంటి వారిలో సీనియర్ నటి సుధ కూడా ఉన్నారు. నేరుగా కాకపోయినా ఉదయ కిరణ్ ని ఇండస్ట్రీ వారే చంపేశారనే అభిప్రాయాన్ని వెలుబుచ్చుతుంటారు. సందర్భం వచ్చినప్పుడల్లా ఉదయ్ కిరణ్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని కన్నీళ్ళు పెట్టుకుంటారు సుధ. నా పెద్ద కొడుకు లాంటి వాడు ఉదయ్ అని..నువ్వు ఎప్పుడూ నాతోనే ఉంటావని ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఉదయ్ గురించి ఇంతగా ఎమోషనల్ అయ్యే వారిలో సుధ పేరు ప్రముఖంగా వినిపిస్తుంటుంది.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.