TTD: తిరుమల శ్రీవారి దర్శనం కోసం స్లాటెడ్ సర్వదర్శనం (SSD) టోకెన్లు పొందిన భక్తులకు ఇకపై సిఫారసు లేఖలతో గదులు ఇవ్వకూడదని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు తిరుపతిలో టోకెన్లు తీసుకున్న వారు ముందుగానే తిరుమలకు వచ్చి సిఫారసు లేఖల ఆధారంగా గదులు పొందడం, దీని వల్ల ఇతర భక్తులకు ఇబ్బందులు ఏర్పడుతున్న నేపథ్యంలో ఈ విధానాన్ని పూర్తిగా రద్దు చేశారు.
ఇకపై SSD టోకెన్లు తీసుకున్న భక్తులు విష్ణునివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్‌లలో టోకెన్లు పొందిన అనంతరం నేరుగా తిరుమలలో దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. తిరుమలలో గదులు కావాలంటే సాధారణంగా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు పొందిన దూర ప్రాంతాల భక్తులకు మాత్రమే సిఫారసు లేఖల ఆధారంగా గదులు కేటాయిస్తారు. అదే విధంగా శ్రీవాణి టికెట్లు పొందిన భక్తులు ఎక్కువ గదులు తీసుకుంటున్నారని గుర్తించిన టీటీడీ, ఇకపై కుటుంబ సభ్యుల సంఖ్యను బట్టి గదుల కేటాయింపు చేస్తారు.
భక్తుల సౌకర్యార్థం వైకుంఠం క్యూ కాంప్లెక్స్-3 నిర్మాణం, విశ్రాంతి కేంద్రాల ఏర్పాటుకు కూడా టీటీడీ నడుం బిగించింది. అదేవిధంగా ఆలయాల నిర్మాణానికి నిధుల మంజూరు, వేద పారాయణదారులకు భృతి, కాంట్రాక్ట్ డ్రైవర్ల క్రమబద్ధీకరణ వంటి అనేక కీలక అంశాలను ఇటీవల నిర్వహించిన టీటీడీ పాలక మండలి సమావేశంలో ఆమోదించారు. ఈ చర్యల వల్ల భక్తుల సంఖ్యను బట్టి మరింత సమర్థవంతంగా వసతి, దర్శన ఏర్పాట్లు చేయగలమని టీటీడీ భావిస్తోంది.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.