TTD: కలియుగ దైవమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా ఉంటాయి. స్వామివారి బ్రహ్మోత్సవాలను ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే జూన్ 6 నుంచి 14వ తేదీ వరకు కార్వేటి నగరం వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి. ఇందుకు సంబంధించిన పోస్టర్లను అలాగే బుక్లెట్లను టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవి చంద్ర విడుదల చేశారు. ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన పోస్టర్లను బుక్లెట్లను విడుదల చేసిన అనంతరం టీటీడీ ఈవో మాట్లాడుతూ..జూన్ 6 నుండి 14వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ ఉత్సవాలు జూన్ 6వ తేదీ నుంచి ప్రారంభం కాగా జూన్ 2వ తేదీ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, జూన్ 5న అంకురార్పణం నిర్వహించిన అనంతరం బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నట్లు తెలియజేశారు. జూన్ 6న ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని, జూన్ 9న సాయంత్రం స్వామివారి కల్యాణోత్సవం, జూన్ 10న గరుడసేవ, జూన్ 13న వైభవంగా రథోత్సవం నిర్వహించబోతున్నట్లు టీటీడీ ఈవో తెలియచేశారు.
కార్వేటినగరంలోని శ్రీ రుక్మిణీ, సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తులకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లను చేయాలని ఈవో ఆదేశాలను జారీ చేశారు. ఈ బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భాగంగా భక్తులందరూ వేణుగోపాలస్వామి అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఈవో పిలుపు నిచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ చెంగల్రాయులు తదితర అధికారులు పాల్గొన్నారు.
Panipuri: ఇటీవల కాలంలో పానీపూరి తినే వారి సంఖ్య ఎక్కువ అయ్యింది. సాయంత్రమైతే చాలు వీధి చివర బండ్లపై పానీ…
Varalakshmi Vratam 2026: శ్రావణమాసం వచ్చిందంటే చాలు పెద్ద ఎత్తున పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు. ఇక శ్రావణమాసంలో మహిళలు…
Papaya In Mansoon: పండ్లు ఎన్నో రకాల పోషకాలను కలిగి ఉంటాయి అనే సంగతి మనకు తెలిసిందే. ఇలా అనేక…
TTD: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ఎంతోమంది భక్తులు తరలివస్తున్నారు. వేసవి సెలవులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు…
Ginger Tea: చాలామందికి ఉదయం నిద్ర లేవగానే ఒక కప్పు టీ తాగనిదే రోజు గడవదు. ఒక కప్పు టీ…
Shiva Pooja: శివుడిని అభిషేక ప్రియుడు అని పిలుస్తుంటారు ఆయనకు అభిషేకం చేసి కోరికలు కోరితే తప్పకుండా నెరవేరుస్తారని భక్తులు…
This website uses cookies.