Tollywood : ఉప్పెన సినిమాతో ఉప్పెనెలా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోకి దూసుకొచ్చింది కుర్రభామ కృతీశెట్టి. మొదటి సినిమాతో మంచి హిట్ దక్కించుకోవడంతో సెంటిమెంట్ ప్రకారం టాలీవుడ్‌లో లక్కీ హీరోయిన్‌గా మారింది. దాంతో వరుసగా సినిమాలకి సైన్ చేసింది. క్రేజీ హీరోయిన్ అంటే ఓ సంవత్సరం పాటు కృతీనే. అయితే, అమ్మడి ఖాతాలో వరుసగా ఫ్లాప్స్ వచ్చి చేరడంతో చేతిలో ఉన్న సినిమాలలో కొన్ని జారిపోయాయి. తన స్థానంలో కేతిక శర్మ, శ్రీలీల వచ్చి చేరారు.
మరీ ముఖ్యంగా కృతికి గండి కొట్టిందీ అంటే శ్రీలీల అని చెప్పక తప్పదు. ఒక్క కృతీ శెట్టికి మాత్రమే కాదు స్టార్ హీరోయిన్స్ అయిన పూజా హెగ్డే, రష్మిక మందన్న, కీర్తి సురేశ్, యంగ్ బ్యూటీస్ కృతి శెట్టి, మీనాక్షి చౌదరీ, డింపుల్ హయాతి లాంటి వారికి గట్టిగానే చెక్ పెట్టింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా కనిపిస్తుంది ఒక్క శ్రీలీల మాత్రమే. డేట్స్ ఖాళీ లేక పెద్ద ప్రాజెక్ట్స్ వదులుకుంటుంది కూడా. ఇంత క్రేజీ బ్యూటీ మీద వస్తున్న సెన్షేషనల్ న్యూస్ కూడా అలాగే ఉన్నాయి.
Tollywood : కృతిశెట్టి మెగా హీరో వైష్ణవ్ తేజ్ ని పెళ్లి చేసుకోబోతుందా..?
ముఖ్యంగా పెళ్ళిపై చాలా రకాలుగా వార్తలు వస్తున్నాయి. శ్రీలీల ఓ పెద్దింటి కోడలు కాబోతుందంటూ ఈ మధ్య పలు వార్తలు వచ్చి వైరల్ అవుతున్నాయి. అయితే, పెళ్ళి విషయంలో శ్రీలీల కంటే ఎక్కువగా వార్తలు వస్తుంది కృతీశెట్టి గురించే. ఈ బ్యూటీ అక్కినేని నాగ చైతన్యతో కలిసి బంగార్రాజు సినిమాలో నటించింది. అప్పటికే, నాగ చైతన్య-సమంతలకి విడాకులైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నాగ చైతన్య ఈ కుర్రభామ కృతీని పెళ్లి చేసుకోబోతున్నాడని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే, దానిపై అంత క్లారిటీ లేదు.
ఇదే క్రమంలో ఇప్పుడేమో కృతిశెట్టి మొదటి మెగా హీరో వైష్ణవ్ తేజ్ ని పెళ్లి చేసుకోబోతుందని ఫిల్మ్ సర్కిల్స్‌లో చెప్పుకుంటున్నారు. ఇప్పటికే మెగా బ్రదర్ నాగబాబు కొడుకు యంగ్ హీరో వరుణ్ తేజ్..సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకుంటున్నారు. నిశ్చితార్థం కూడా జరిగింది. ఈ ఏడాదే ఘనంగా పెళ్ళి జరగబోతుంది. అలాగే, వైష్ణవ్ కి కృతికి కూడా పెళ్ళి జగరబోతుందని చెప్పుకుంటున్నారు. కానీ, ఇవనీ ఫేక్ న్యూస్ అని మెగా అభిమానులు కొట్టిపారేస్తున్నారు. చూడాలి మరి ఇది ఎంతవరకూ నిజమో.
Krithi Shetty, Naga Chaithanya, Samantha, Vaishnav Tej, Akkineni Family, Mega Family, Tollywood, Cinema News
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.