Tollywood : చేపలు పడుతున్న సాయి పల్లవి..! సినిమాలు లేకేనా..?

Tollywood : సాయి పల్లవి త్వరలో ఓ కొత్త సినిమా ద్వారా మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నాగ చైతన్యతో లవ్‌స్టోరీ, రానా దగ్గుబాటితో విరాట పర్వం సినిమాలు చేసింది. ఈ సినిమాలలో ఒకటి మంచి కమర్షియల్ హిట్ సాధించగా, మరో సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద చతికిల పడింది. దాంతో మళ్ళీ ఇప్పటివరకూ కొత్త సినిమాను ప్రకటించలేదు. సాధారణంగానే కథ నచ్చితే సైన్ చేసే సాయి పల్లవి..హంగు ఆర్భాటాలకి చాలా దూరంగా ఉంటుంది.

అయితే, కృతీశెట్టి, శ్రీలీల గ్లామర్ దెబ్బకి ఈ ఫిదా బ్యూటీ వెనకపడిందని ఈ మధ్య సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపించాయి. దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన ఫిదా, లవ్‌స్టోరీ చిత్రాలలో నటించిన సాయి పల్లవి ముచ్చటగా మూడోసారి ధనుష్ హీరోగా తెరకెక్కించబోతున్న పాన్ ఇండియా సినిమాతో మళ్ళీ సందడి చేయనుందని చెప్పుకున్నారు. కానీ, ఇప్పటి వరకూ ఈ ప్రాజెక్ట్‌లో సాయి పల్లవి నటించనుందనే అధికారిక ప్రకటన రాలేదు.

tollywood-sai-pallavi-new-movie-with-naga-chaithanya

Tollywood : సాయి పల్లవి పాత్ర కూడా ఇలాగే ఉండబోతుందట.

కాగా, తాజా సమాచారం మేరకు అక్కినేని నాగ చైతన్య, టాలెంటెడ్ డైరెక్టర్ చందు మొండేటి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఓ కొత్త సినిమా (NC 23)లో నటించబోతుందట. ఇదే నిజమైతే నాగ చైతన్యతో అమ్మడు రెండవసారి రొమాన్స్ చేయడానికి సిద్ధమవుతున్నట్టు అనుకోవాలి. ఇప్పటికే చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాలో నాగ చైతన్య జాలరి పాత్రలో కనిపించబోతున్నాడు. సాయి పల్లవి పాత్ర కూడా ఇలాగే ఉండబోతుందట. మత్స్యకారుల జీవిత కథ ఆధారంగా చందు మొండేటి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఇలాంటి నేచురల్ క్యారెక్టర్ అయితే సాయి పల్లవి తప్ప ఇంకెవరూ చేయలేరు. ఫిదా సినిమాలో కూడా ఇలాంటి నేచురల్ క్యారెక్టరే చేసి ఫిదా బ్యూటీగా మారింది. ఇక ఈ సినిమా నాగ చైతన్య కెరీర్‌లో 23 వది. చందు మొండేటి గత చిత్రం కార్తికేయ 2 పాన్ ఇండియా లెవల్‌లో భారీ సక్సెస్ సాధించింది. ఇప్పుడు నాగ చైతన్య-చందు మొండేటి-సాయి పల్లవిల కాంబో అనగానే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి సంచలన విజయం సాధిస్తుందో.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Big Breaking: చంచల్‌గూడా జైలు నుంచి ఈరోజు 6 గంటలకు అల్లు అర్జున్ విడుదల

Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…

1 week ago

Big Breaking: అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్ట్

Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…

1 week ago

YS Jagan Mohan Reddy: అల్లు అర్జున్ అరెస్ట్‌పై వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోస్ట్ వైరల్

YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…

1 week ago

Breaking News: అల్లు అర్జున్ కి 14 రోజుల రిమాండ్..!

Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…

1 week ago

Allu Arjun Arrest: సంధ్య థియేటర్ తొక్కిసలాటలో అల్లు అర్జున్ అరెస్ట్..!

Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…

1 week ago

Pushpa 2: The Rule Review; ‘వెయ్యి కోట్లు తగ్గేలే’..’తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే’..!

Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…

3 weeks ago

This website uses cookies.