Tollywood: ‘నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ’? ‘ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో ఆడే పండుగాడు’, ‘రూపాయి సంపాదించలేని ఏ ఎదవకీ ప్రేమించే హక్కులేదు’, ‘ఒక్కసారి కమిటైతే నామాట నేనే వినను’, ‘సిటీకి ఎంతో మంది ఎస్సైలు వస్తుంటారు పోతుంటారు..చంటిగాడు లోకల్’, ‘ఇక్కడ అన్నీ సెకండ్ హ్యాండే షో రూం బండ్లేవీ ఉండవు’..ఇలాంటి డైలాగులన్నీ పూరీ జగన్నాథ్ పెన్నులోనుంచి వచ్చినవే.
ఇండస్ట్రీలో ప్రతీ హీరోకి విపరీతమైన మాస్ ఇమేజ్ తీసుకొచ్చిన ఒకే ఒక్క దర్శకుడు పూరి. సినిమాను ఎప్పుడు తీస్తారో ఎప్పుడు రిలీజ్ చేస్తారో కూడా ఊహించని దర్శకుడు. వారంలో కథ, ఇంకో వారంలో డైలాగ్స్, మూడు నెలల్లో సినిమా రిలీజ్..బాక్సాఫీస్ వద్ద ఊహించని కలెక్షన్స్ ..సౌత్ మాత్రమే కాకుండా బాలీవుడ్ లోనూ ఆయనకున్న క్రేజ్ ఇంకెవరికీ లేదు.
అయితే, ఇదంతా గతంలో. ఇప్పుడు పూరి సినిమా వస్తుందంటే ముందుకు వచ్చి కొనే వాళ్ళు కరువైయ్యారు. అతిమంచితనం కూడా దీనికి కారణం అనుకోవచ్చు. ‘బ్రతికితే పూరిలా బ్రతకాలి’.. అనుకునే వాళ్ళు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. ఆయన భారీ హిట్ కొడితే పార్టీలు చేసుకునేవారు కూడా చాలామంది ఉన్నారు. కానీ, డేట్స్ ఇచ్చే హీరో మాత్రం ఇప్పుడు పూరికి కాస్త కష్టంగా మారిందంటున్నారు కొందరు సినీ ప్రముఖులు.
చాలాకాలం తర్వాత ‘ఇస్మార్ట్ శంకర్’తో రికార్డులు తిరగరాస్తే, ఆ తర్వాత నుంచి మళ్ళీ ఫ్లాపులే వెంటాడుతున్నాయి. పూరి గత చిత్రాలు ‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ ఘోర పరాజయాన్ని చూశాయి. దాంతో ఆయన మళ్ళీ ఫాంలోకి రావాలంటే మంచి కథ, దానికి తగ్గ హీరో కావాలి. ఇటీవల ఒక కథ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డకి చెప్పారని సమాచారం. సిద్ధు సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళు రాబడుతున్నాయి. ఆ యాటిట్యూడ్ పూరి కథకి బాగా సెట్ అవుతుంది.
ఈ కాంబోలో సినిమా అంటే అందరిలో ఒక జోష్ వస్తుంది. కానీ, పూరి చెప్పిన కథ వంటిదే సిద్ధు ఒకటి ఎంచుకొని సినిమా చేస్తున్నాడట. అందుకే, ఇంకో కథ కోసం కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి పూరి-సిద్ధు కాంబో సెట్ అయినా కథ కుదరలేదనేది ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట. చూడాలి హీరో ఒకే అనాలే గానీ, పూరి కథ రాయడం ఎంతసేపు. కొడితే బాక్సులు బద్దలే ఈసారి.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.