Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్నాయి. తాజా సమాచారం ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’, ‘ఓజీ’ చిత్రాలకి డేట్స్ ఇచ్చారట. ‘వకీల్ సాబ్’ సినిమా తర్వాత వరుసగా భారీ ప్రాజెక్ట్స్ కి కమిటయిన పవన్, రాజకీయాలలో బిజీ కావడంతో సినిమాలన్నీ ఆగిపోయాయి.
ప్రస్తుతం ఆయన ఏపీలో డిప్యూటీ సీఎం గా బాధ్యత నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కమిటైన సినిమాలను ఇప్పట్లో పూర్తి చేయరనే టాక్ ఇండస్ట్రీ వర్గాలలో వినిపించింది. కానీ, అవన్నీ అవాస్తవాలని తాజా పరిణామాలు చూస్తే అర్థమవుతోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్.. వీరమల్లు, ఓజీ చిత్రాలకి డేట్స్ ఇచ్చారట. ముందు వీరమల్లు సినిమాకి సంబంధించి, ఆయన పాల్గొనే సన్నివేశాలన్నీ పూర్తి చేయనున్నారు.
ఈలోపు ‘ఓజీ’ సినిమాకి సంబంధించి మిగతా నటీనటులు పాల్గొనే సన్నివేశాలను టీం పూర్తి చేసే పనిలో ఉంది. వీరమల్లు చిత్రీకరణ పూర్తవగానే పవన్, ఓజీ షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. ఈ చిత్రాల షూటింగ్ డిసెంబర్ నాటికి పూర్తికానుంది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్స్, ప్రమోషన్స్ పూర్తి చేసి వచ్చే ఏడాది (2025) లో ఒకదాని తర్వాత ఒక చిత్రాన్ని విడుదల చేస్తారు.
అదే ఏడాది హరీశ్ శంకర్ రూపొందించనున్న ‘ఉస్దాత్ భగత్‌సింగ్’ సినిమా కోసం డేట్స్ కేటాయించనున్నారు పవన్. కాగా, వీరమల్లు చిత్రానికి క్రిష్, జ్యోతికృష్ణ దర్శకులు. ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఏ ఎం రత్నం మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాని రెండు భాగాలుగా తెరకెక్కించనున్నారని సమాచారం. ఇక సుజీత్ దర్శకత్వంలో ఓజీ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్. ఎస్ ఎస్ థమన్ సంగీత దర్శకుడు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.