Tollywood: ఇండియాలో ఇప్పటి వరకు నాలుగు సినిమాలు మాత్రమే వెయ్యి కోట్లకి పైగా కలెక్షన్స్ రాబట్టాయి. అందులో దంగల్ హైయెస్ట్ కలెక్షన్స్ తో మొదటి స్థానంలో ఉంటే బాహుబలి 2 రెండో స్థానంలో ఉంది. ఇక మూడో స్థానంలో కేజీఎఫ్ చాప్టర్ 3, నాలుగో స్థానంలో పఠాన్ సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు వంద కోట్లు కలెక్షన్స్ అందుకోవడమే సంచలనంగా భావించే ఇండియన్ సినిమా మార్కెట్ ఇప్పుడు వెయ్యి కోట్లకి చేరుకోవడం నిజంగా గొప్ప విషయం అని చెప్పాలి. అలాగే సినిమాల బడ్జెట్ కూడా 500 కోట్లకి చేరుకున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమా బడ్జెట్ 500 కోట్లు దాటింది. ఇప్పుడు ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కె మూవీ కూడా 5 వందల కోట్లకి పైగా బడ్జెట్ తో తెరకెక్కుతుంది.
నెక్స్ట్ సూపర్ స్టార్ మహేష్, రాజమౌళి సినిమా బడ్జెట్ కూడా ఐదు వందల కోట్లకి పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. టైర్ 2 హీరోలు చేస్తున్న సినిమాల బడ్జెట్ కూడా వంద కోట్లకి చేరిపోయింది. అయితే ఈ బడ్జెట్ లని బాలీవుడ్ నిర్మాతలు అయితే ఇంకా అందుకోలేదు అని చెప్పాలి. ఇదిలా ఉంటే నెక్స్ట్ టాలీవుడ్ నుంచి వెయ్యి కోట్లని దాటి కలెక్షన్స్ చేయగల సత్తా ఉన్న సినిమాలు ఏవి ఉన్నాయి అని చూసుకుంటే ముందు స్థానంలో సలార్ మూవీ ఉంటుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ హైప్ ఉంటుంది.
తరువాత ప్రాజెక్ట్ కె సినిమాకి కూడా ఆ సత్తా ఉంది. ఈ సినిమా పాన్ వరల్డ్ మూవీ కాబట్టి రెండు వేల కోట్లుని అందుకున్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాకి కూడా వెయ్యి కోట్లని దాటే ఛాన్స్ ఉంది. ఇక అల్లు అర్జున్ పుష్ప 2తో వెయ్యి కోట్ల ఫీట్ అందుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అలాగే రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ మూవీ, తారక్, కొరటాల మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయితే కచ్చితంగా వెయ్యి కోట్ల కలెక్షన్స్ ని రాబట్టే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తుంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.