Tollywood : ముహూర్తం కుదిరిందిగా..!

Tollywood : అక్కినేని నాగ చైతన్య రెండో పెళ్లికి సిద్ధమవుతున్నాడంటూ తాజాగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చి బాగా వైరల్ అవుతున్నాయి. సమంతతో ప్రేమ, పెళ్లి, విడాకులు తర్వాత అటు సమంత గానీ, ఇటు నాగ చైతన్య గానీ ఇంకా రెండో పెళ్లి చేసుకుంది లేదు. సమంత విషయంలో ఇప్పటి వరకూ రెండో పెళ్లికి సంబంధించిన వార్తలు ఏవీ రాలేదు. కానీ, నాగ చైతన్య మాత్రం సెకెండ్ మ్యారేజ్ చేసుకోబోతున్నాడంటూ ఇప్పటికే చాలాసార్లు వార్తలు వచ్చాయి.

గతంలో సాయి పల్లవి, కృతీశెట్టిల పేర్లు బాగా వినిపించాయి. ఆ తర్వాత తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ్ళ గురించి ఎక్కువగా వార్తలు వచ్చాయి. ఆ మధ్య నాగ చైతన్య-శోభిత కలిసి ఓ స్టార్ హోటల్‌లో కనిపించారు. దీనికి సంబంధించిన పిక్స్ లీకై నెట్టింట తెగ హల్‌చల్ చేశాయి. ఇప్పుడు నిజంగానే చైతూ, శోభిత మూడుముళ్ళ బంధంతో ఒక్కటవబోతున్నారని తాజా సమాచారం. దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోయినప్పటికీ దాదాపు పెళ్లికి డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నట్టు చెప్పుకుంటున్నారు.

tollywood-naga-chaitanya-sobhita-dhulipalas-marriage-date-fix

Tollywood : అసలు ప్రేమికులు నాగ చైతన్య-శోభిత..!

శోభిత ఇప్పటివరకూ నాగ చైతన్యతో కలిసి నటించలేదు. టాలెంటెడ్ హీరో అడివి శేష్ సరసన మాత్రం సినిమాలు చేసింది. ఇద్దరి మధ్య ముద్దు సన్నివేశాలూ ఉన్నాయి. వాస్తవానికి శేష్, శోభిత రిలేషన్‌లో ఉన్నారని ప్రచారం జరిగింది. కానీ, అదంతా కేవలం గాసిప్స్ అని అసలు ప్రేమికులు నాగ చైతన్య-శోభిత అని ఫిల్మ్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. మరి చైతూ ఎవరిని పెళ్లి చేసుకుంటాడనేది గోప్యంగా ఉంది. ఇక ఈ విషయంలో సమంత స్పందన కాస్త ఘాటుగానే ఉంటోంది. తనకి నచ్చినట్టు ట్విట్టర్‌లో పోస్ట్ పెడుతోంది.

కాగా, నాగ చైతన్య ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. చైతూ కెరీర్‌లో ఇది 23వ చిత్రం. సాయి పల్లవి హీరోయిన్‌గా నటించనుంది. మత్స్యకారుల జీవిత కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతుండగా నాగ చైతన్య, సాయి పల్లవి చేపలు పట్టే జాలరీల పాత్రల్లో అలరించనున్నారు. ఇలాంటి పాత్రలు చేయడంలో సాయి పల్లవి ఆరితేరింది. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన లవ్‌స్టోరీ మంచి హిట్ సాధించింది.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Tollywood : వైరల్ ప్రపంచం మూవీ రివ్యూ

Tollywood : డిజిట‌ల్ యుగంలో మ‌న‌కు ఎన్ని సౌక‌ర్యాలు అందుతున్నాయో అన్నీ స‌వాళ్లు ఎదుర‌వుతున్నాయి. టెక్నాల‌జీని స‌రిగ్గా వాడుకోక‌పోతే ఒక్కోసారి…

1 week ago

Tollywood: ప్రభాస్ లైనప్ లో క్లారిటీ లేదే.?

Tollywood: పాన్ ఇండియన్ స్టార్ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా భారీ చిత్రాలకు సైన్ చేశారు. అంతేకాదు, ఏమాత్రం…

4 weeks ago

Akka: కీర్తి సురేశ్ ఇలాంటి రోల్ చేస్తుందా..?

Akka: సౌత్ బ్యూటీ కీర్తి సురేశ్ తెలుగులో సినిమా చేసి చాలా గ్యాప్ వచ్చింది. మహేశ్ బాబు సరసన నటించిన…

1 month ago

Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..?

Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..? గత కొంత కాలంగా మన తెలుగు…

2 months ago

Tollywood Cinema: ఈ సినిమాలు ఫ్లాపా కాదా..క్లారిటీ ఇదే..!

Tollywood Cinema: 2025 సంక్రాంతికి మూడు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మూడు…

2 months ago

సినీ లవర్స్ కోసం ‘అరి’ టీం కొత్త ఆఫర్.. వాట్సప్ చేసి సినిమాని చూడండి

జయ శంకర్ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా అరి. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే షూటింగ్…

2 months ago

This website uses cookies.