Tollywood Exclusive: “గుంటూరు కారం” స్టోరీ లీక్..మరోసారి పొలిటీషియన్‌గా మహేశ్..?

Tollywood Exclusive: గుంటూరు కారం స్టోరీ లీక్..మరోసారి పొలిటీషియన్‌గా మహేశ్..? అవును ప్రస్తుతం ఈ లేటెస్ట్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దూకుడు తరహాలో మహేశ్ బాబు, ప్రకాశ్ రాజ్ గుంటూరు కారం సినిమాలో తండ్రీకొడుకులుగా కనిపించబోతున్నారు. దూకుడు, భరత్ అనే నేను సినిమాల మాదిరిగా ఈ సినిమా కూడా పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో కథ నడుస్తుందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం.

త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేశ్ బాబు కాంబినేషన్‌లో 17 ఏళ్ళ క్రితం అతడు, ఆ తర్వాత ఖలేజా చిత్రాలొచ్చాయి. ఇప్పుడు ఇదే కాంబినేషన్‌లో హ్యాట్రిక్ మూవీ రూపొందుతోంది. 2024 సంక్రాంతి పండుగ సందర్భంగా అత్యంత భారీ స్థాయిలో గుంటూరు కారం విడుదలవబోతుంది. అయితే, గుంటూరు కారం సినిమాలో పూర్తిగా రాజకీయాల నేపథ్యంలోనే ఉండబోతుందని సమాచారం.

tollywood-exclusive-guntur-karam-story-leak-mahesh-as-a-politician-again

Tollywood Exclusive: మహేశ్ బాబు చేస్తున్న క్యారెక్టర్ పేరు వెంకటరమణ రెడ్డి

గుంటూరు కారం కథ: ఈ సినిమాలో మహేశ్ బాబు చేస్తున్న క్యారెక్టర్ పేరు వెంకటరమణ రెడ్డి. మహేశ్ తండ్రి వైర వెంకట స్వామి క్యారెక్టర్‌లో (ప్రకాశ్ రాజ్) నటిస్తున్నారు. జనదళం అనే పార్టీలో ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శి. రాజకీయాలు అంటే ఇష్టం ఉండని వెంకట రమణ రెడ్డి (మహేశ్ బాబు) తన తండ్రి 80 పుట్టిన రోజు తర్వాత ఊహించని విధంగా రాజకీయాల్లోకి వస్తాడట. రాజకీయాలలోకి అడుగు పెట్టిన తర్వాత శత్రువులను, రాజకీయ శత్రువులను హీరో ఎలా ఎదుర్కున్నాడు అనేది మిగితా కథ అని తెలుస్తోంది.

ఇదే కథా నేపథ్యం అయితే, ఏపీ రాజకీయాల వాడి వేడి కారణంగా గుంటూరు కారం ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడం ఖాయం అని చెప్పవచ్చు. గతంలో త్రివిక్రమ్ మహేశ్ బాబుతో రెండు సినిమాలు తీసి ఫ్లాపులిచ్చారు. కానీ, ఈ సారి భారీ హిట్ ఇవ్వాలనే కసితో ఈ గుంటూరు కారం చిత్రాన్ని రూపొందిస్తున్నారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ సినిమాకి ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ!

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…

5 hours ago

Allu Arjun: ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సంక్రాంతి బాస్ బస్టర్..బన్నీ పోస్ట్ వైరల్!

Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…

7 hours ago

Tollywood: బాక్సాఫీస్ అసలైన లెక్కలు తేలేది ఈరోజు నుంచే

Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…

2 days ago

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు!

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…

3 days ago

Ashika Ranganath: టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా?

Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…

3 days ago

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఎవరో తెలుసా?

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…

4 days ago

This website uses cookies.