Tollywood : దగ్గుబాటి హీరోలు రేస్‌లో వెనకబడ్డారా..?

Tollywood : ప్రస్తుతం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కాస్త వెనకబడుతున్న హీరోలు అంటే దగ్గుబాటి ఫ్యామిలీ హీరోలే అని టాక్ వినిపిస్తోంది. మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్ సినిమాలు కాస్త గ్యాప్‌తో వచ్చినా ఆ క్రేజ్ అసాధారణం. మెగాస్టార్ చిరంజీవి సినిమాకీ ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా లెవల్‌లో క్రేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సీక్వెల్ చేస్తున్నాడు. మొదటి భాగం సక్సెస్ ప్రభావం వల్ల రెండవ భాగంపై భారీగా అంచనాలు పెరిగాయి.

అలాగే, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఎన్.టి.ఆర్, ప్రభాస్ పాన్ ఇండియన్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద గట్టిగానే పోటీ పడుతున్నారు. నాని కూడా ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్ అనిపించుకునేందుకు ఆరాటపడుతున్నాడు. ఇప్పటికే, నిఖిల్ కార్తికేయ సినిమాతో 100 కోట్ల మార్క్‌ను చేరుకున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్‌లో సక్సెస్ సాధించి నిఖిల్ మార్కెట్‌ను పెంచింది. ఇలా మన టాలీవుడ్ హీరోలందరూ దాదాపు పాన్ ఇండియన్ క్రేజ్ కోసం పోటీపడుతున్నారు. కన్నడ హీరోలతో పాటు మిగతా సౌత్ భాషలలోని హీరోలు కూడా పాన్ ఇండియన్ స్టార్స్ అనిపించుకునేందుకే తాపత్రయపడుతున్నారు.

Tollywood: Daggubati heroes are behind in the race..?

Tollywood : రానా సినిమాలు బాగా తగ్గిపోయాయి.

కానీ, దగ్గుబాటి హీరోలు విక్టరీ వెంకటేష్, రానా కాస్త వెనకబడ్డారు. రానా సినిమాలు పాన్ ఇండియన్ లెవల్ ఉండాల్సింది. కానీ, ఆయన నుంచి సినిమాలు రావడం లేదు. బాహుబలి సిరీర్ లాంటి సినిమాలలో రానా ప్రధాన పాత్ర పోషించినా ఆయనకి పెద్దగా ఒరిగిందేమీ లేదు. విరాటపర్వం, అరణ్యం లాంటి సినిమాలు ఆయన కెరీర్‌కి ఏమాత్రం ఉపయోగపడలేదు. ఎందుకో రానా సినిమాలు బాగా తగ్గిపోయాయి. ఇటీవల బాబాయ్ వెంకటేష్‌తో కలిసి చేసిన రానా నాయుడు వెబ్ సిరీస్ డిజాస్టర్ అని తేలిపోయింది.

దీంతో దగ్గుబాటి హీరోలకి వెబ్ సిరీస్ సూటవ్వవేమో అని మాట్లాడుకుంటున్నారు. వెంకీ ఇప్పుడు తన 75వ సినిమాను పట్టాలెక్కించబోతున్నారు. ఆ తర్వాత మరో ప్రాజెక్ట్ కూడా లైన్‌లో పెట్టారు. ఈ సినిమాలతో ఆయన పాన్ ఇండియన్ రేంజ్ సక్సెస్ అందుకోవాల్సిందే. మరి రానా పరిస్థితేంటో తెలియదు. ఆయన కొత్త ప్రాజెక్ట్స్‌కి సంబంధించిన అప్‌డేట్స్ కూడా రావడం లేదు. మరి ఇంత స్లోగా ఉంటే రేస్‌లో ఎప్పుడు ముందుకు దూసుకొస్తారో.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ!

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…

20 hours ago

Allu Arjun: ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సంక్రాంతి బాస్ బస్టర్..బన్నీ పోస్ట్ వైరల్!

Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…

22 hours ago

Tollywood: బాక్సాఫీస్ అసలైన లెక్కలు తేలేది ఈరోజు నుంచే

Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…

2 days ago

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు!

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…

3 days ago

Ashika Ranganath: టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా?

Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…

3 days ago

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఎవరో తెలుసా?

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…

4 days ago

This website uses cookies.