BRS Party: తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు ఎన్నడూ లేని స్థాయిలో వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ మధ్య రాజకీయ వైరం తారాస్థాయికి చేరుకున్నాయి. ఎలా అయినా తెలంగాణలో అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్న బీజేపీ పార్టీ అధికార బీఆర్ఎస్ పై తన అస్త్రాలని సంధిస్తూనే ఉంది. అందులో భాగంగా ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పేరుని కూడా చేర్చిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈడీ ఇప్పటికే కవిత మాజీ పీఎని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా కవిత బినామీగా చెప్పబడుతున్నపిళ్ళైని కూడా అదుపులోకి తీసుకొని ఈడీ విచారిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా కవితని ఈడీ విచారణకి పిలిచిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే కవితని అరెస్ట్ చేస్తారనే ప్రచారం తెరపైకి రావడంతో కేసీఆర్ పార్టీ నాయకులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. అనంతరం పార్టీ కార్యాచరణ వ్యూహాలపై చర్చించారు. ఇక కవితని అరెస్ట్ చేసిన నేపధ్యంలో పంచ వ్యూహాలతో బీజేపీని ఇరుకున పెట్టడానికి కేసీఆర్ మాస్టర్ ప్లాన్ వేశారు. ఓ వైపు కవితకి సపోర్ట్ గా ఆందోళనలు చేయడంతో పాటు, గవర్నర్ ని కలిసి కవితపై బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలపై ఫిర్యాదు చేసేందుకు సిధం అయ్యారు.
అదే సమయంలో విస్తృతంగా ప్రజలలోకి బీజేపీ నియంతృత్వ ధోరణిని తీసుకెళ్ళడానికి వ్యూహం సిద్ధం చేశారు. అయితే విచారణలో ఈడీ కవితని అరెస్ట్ చేయలేదు. ఇదిలా ఉంటే తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా వేసిన ఫ్లెక్సీలు సంచలనంగా మారాయి. బీజేపీలోకి వెళ్ళిపోతే బ్లాక్ మార్క్ ఉన్నవాళ్ళు అందరూ కూడా వైట్ గా మారిపోతారు అంటూ పోస్టర్స్ లో పెట్టారు. ఇప్పుడు ఇవి వైరల్ గా మారాయి.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.