Tollywood: సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన బాలయ్య కూతురు బ్రాహ్మణి నటించబోతుందా..? అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అయితే, వాస్తవానికి ఇది ఇప్పటి విషయం కాదు. 15 ఏళ్ళ క్రితం నాటి మాట అట. 2005 లో మహేశ్ బాబు హీరోగా అతడు సినిమా వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. నటుడు నిర్మాత మురళీ మోహన్ నిర్మించారు.
మహేశ్ కెరీర్‌లోనే మంచి సినిమాగా నిలిచిన ఈ చిత్రం ఆశించిన వసూళ్ళను మాత్రం రాబట్టలేకపోయింది. కారణం ఓవర్ బడ్జెట్. దీనికి కారణం కూడా దర్శకుడే అని ఇప్పటికీ చెప్పుకుంటుంటారు. ఆ విషయం అలా పక్కన పెడితే, మహేశ్ సరసన అతడు సినిమాలో నటించాల్సిన హీరోయిన్ బాలయ్య కూతురు బ్రాహ్మణి అట. బాలయ్యను చాలామంది మీ అమ్మాయిని హీరోయిన్‌గా పరిచయం చేయవచ్చు కదా..అని అడిగారట.
బ్రాహ్మణి హీరోయిన్స్ కంటే ఏమాత్రం తీసిపోదు. అందానికి అందం టాలెంట్ అన్నీ ఉన్నాయి. అయితే, సినిమాలంటే మాత్రం ఆసక్తి లేదట. సరదాగా ఎంటర్‌టైన్మెంట్ కోసం సినిమా చూస్తుంది గానీ, సినిమాలో హీరోయిన్‌గా మాత్రం నటించే ఇంట్రెస్ట్ లేదని ముందు నుంచి చెప్పిందట. అందుకే బాలయ్య ఏనాడు బ్రాహ్మణి ని సినిమాలలో నటిస్తావా..? అని అడగలేదట. అతడు కోసం మహేశ్ బాబు సరసన బ్రాహ్మణి ని అనుకొని ఆమె నో అనగానే నెక్స్ట్ ఛాయిస్ గా త్రిష ని ఫిక్స్ చేసుకున్నారట.
ఇక బ్రాహ్మణి గురించి అందరికీ తెలిసిందే. చిన్నప్పటి నుంచి చదువులో ఫస్ట్. గోల్డ్ మెడల్ సాధించింది. బాలయ్య మాట ఏనాడు దాటలేదు. మిగతా వారిలాగా ప్రేమ వ్యవహారం నడపలేదు. నారా వారి ఇంటికి కోడలైంది. లోకేశ్ భార్యగా ఆ ఇంట్లో అన్నీ బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తుంది. పొలిటికల్ పరంగా కూడా బ్రాహ్మణి ఎంతో చురుగ్గా ఉంటుంది. భవిష్యత్తులో వస్తే గనక రాజకీయాలలోకి వచ్చే అవకాశం ఉంది.
Mega 158: దుబాయ్లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.