Tollywood: అప్పట్లో ఎన్.టి.ఆర్ ఇప్పుడు చిరంజీవి..దెబ్బకే ఆస్తులమ్ముకున్న నిర్మాతలు..?

Tollywood: అప్పట్లో ఎన్.టి.ఆర్ ఇప్పుడు చిరంజీవి..దెబ్బకే ఆస్తులమ్ముకున్న నిర్మాతలు..? అంటూ తాజాగా ఫిల్మ్ సర్కిల్స్ లో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. చిత్ర పరిశ్రమలో హిట్స్, ఫ్లాప్స్ అనేవి సహజం. ఒక సినిమా ఫ్లాపవడానికి ఎన్ని కారణాలుంటాయో హిట్ అవడానికీ అన్నే కారణాలుంటాయి. నిర్మాత గనక అన్నీ దగ్గరుండి చూసుకుంటే నష్టాలనేవి జరగవు. వేరే వ్యాపకాల మీద దృష్ఠి పెట్టి అసలు విషయం మర్చిపోతే మాత్రం నష్టాలు తప్పవు.

కథ అనుకున్నప్పుడే ఎంత బడ్జెట్ లో తీయాలి, ఏ హీరోని పెట్టుకోవాలి..కథలోని పాత్రకి స్టార్ హీరోయిన్ అవసరమా లేదా లాంటి ప్రతీ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక్కడ హీరోయిన్ విషయంలో కక్కుర్తి పడ్డా, బంధుత్వాన్ని వెనకేసుకొచ్చినా సినిమా ఫ్లాప్ కి కారణాలవుతాయి. గతంలో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా బి.గోపాల్ దర్శకత్వంలో ‘నరసింహుడు’ అనే సినిమా వచ్చింది. ఈ చిత్రాన్ని చెంగల వెంకట్రావు భారీ బడ్జెట్‌తో నిర్మించారు.

tollywood-At that time, NTR is now Chiranjeevi.

Tollywood: చిరు హీరోగా కంటే ఏజ్ కి తగ్గ పాత్రలు ఎంచుకోవడం బెటర్

అంతకముందు నందమూరి బాలకృష్ణతో ‘సమరసింహారెడ్డి’ చిత్రాన్ని నిర్మించి ఊహించని లాభాలను మూటగట్టుకున్నారు. అయితే, ‘నరసింహుడు ‘మాత్రం డిజాస్టర్ అయింది. దాంతో నిర్మాత వెళ్ళి హుస్సేన్ సాగర్‌లో దూకేశాడు. వెంటనే ఎన్.టి.ఆర్ స్పందించి తన రెమ్యునరేషన్ తిరిగిచ్చేశారు. ఆ సమయంలో తారక్ అనవసరంగా మాటలు పడ్డారు. ఇప్పుడు కూడా మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘భోళా శంకర్’ నిర్మాత అనిల్ సుంకర కి భారీ నష్టాలను మిగిల్చింది.

tollywood-At that time, NTR is now Chiranjeevi.

ఈ సినిమాను ప్రకటించినప్పటించే అందరిలో ఎన్నో సందేహాలు మొదలయ్యాయి. ఫేడవుట్ అయిపోయిన దర్శకుడు మెహర్ రమేశ్ కి చిరు ఛాన్స్ ఇవ్వడం ఏంటీ అని..? బంధువు కాబట్టి, సినిమా అంటే ప్రాణం కాబట్టి మెహర్ కి మెగాస్టార్ ఛాన్స్ ఇచ్చారు. కానీ, నిర్మాత ఏకంగా ఆస్తులు అమ్ముకునేంతగా నష్టాలు వస్తాయని మాత్రం ఊహించలేదు. చిరంజీవి, తమన్నా, కీర్తి సురేశ్ లాంటి అగ్ర తారలున్నా ‘భోళా శంకర్’ డిజాస్టర్ అవడం పట్ల ఇండస్ట్రీలో చాలా మంది నెగిటివ్ కామెంట్స్ చేశారు. కొందరైతే చిరు హీరోగా కంటే ఏజ్ కి తగ్గ పాత్రలు ఎంచుకోవడం బెటర్ అని సలహాలిస్తున్నారు.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Virinchi Varma: ‘జితేందర్ రెడ్డి’ సినిమా అందుకే చేశాను..

Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…

4 days ago

Raashii Khanna: అది నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..?

Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…

2 weeks ago

Tollywood: కాంబో ఫిక్స్..కానీ కథే కుదరలా..?

Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…

2 weeks ago

SSMB29: జనవరి నుంచి వచేస్తున్నాం..

SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…

2 weeks ago

The Raja Saab: ప్రభాస్ లుక్ చూస్తే రజినీకాంత్ గుర్తొస్తున్నారా..?

The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…

2 weeks ago

Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ..

Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…

2 weeks ago

This website uses cookies.