Salaar Movie : ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు ఫ్యాన్స్ లో ఓ కొత్త ఉత్సాహం వస్తుంది. అసలే ఫ్లాపులతో అప్సెట్ లో ఉన్న ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని కోటి కళ్ళతో సలార్ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేజీఎఫ్ ఫేమ్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో రూపొందిన సలార్ మూవీ డిసెంబర్ 22న థియేటర్స్ లోకి గ్రాండ్ గారిలీజ్ కాబోతోంది. ప్రభాస్ కి జోడీగా ఈ మూవీలో శృతి హాసన్ కనిపించునుంది. స్టార్ హీరో పృథ్వీరాజ్ ఈ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నారు. సలార్ మొదటి భాగం ఇద్దరు స్నేహితుల మధ్య నడిచే కథ అని ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ లో ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇచ్చేశారు. రీసెంట్ గా రిలీజైన సూరిడే సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇక ప్రభాస్ సినిమా అంటే ఎట్లుంటది టికెట్స్ కోసం అభిమానులు దగ్గర నుంచి సాధారణ ప్రేక్షకుల వరకు తెగ ప్రయత్నిస్తుంటారు. ఇక ప్రభాస్ లాంటి మాస్ కటౌట్ మూవీ అంటే చాలు ఎగబడిపోతారు. తమ అభిమాన స్టార్ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో చూసి తీరాల్సిందేనని వీరాభిమానులు ఎగబడుతుంటారు. ఒక్క టికెట్ దొరికినా పండగ చేసుకుంటుంటారు. అందుకే ఇప్పుడు ప్రభాస్ అభిమానుల కోసమే టాలీవుడ్ యంగ్ హీరో బంపరాఫర్ అనౌన్స్ చేశాడు.
బాహుబలితో పాన్ ఇండియా స్టారైన ప్రభాస్ చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత చేసిన మాస్ మూవీ ‘సలార్’. ఈ సినిమాలో తన మాస్ యాక్షన్ తో ఇరగదీసేందుకు రెడీ అయ్యాడు ప్రభాస్. డిసెంబరు 22న వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి మూవీ రిలీజ్ కానుంది. దీనితో పలుచోట్ల బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఈ క్రమంలో యంగ్ హీరో నిఖిల్ ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్ కోసం 100 టికెట్లను ఫ్రీ గా ఇస్తానని బంపర్ ఆఫర్ అనౌన్స్ చేశాడు.
డిసెంబరు 22న మిడ్ నైట్ ఒకటి గంటకు శ్రీరాములు థియేటర్‌లో ‘సలార్’ మూవీకి ఫ్రీ టికెట్స్ ఇవ్వనున్నాడు నిఖిల్ . ఇప్పుడు ఇక్కడే 100 మంది ప్రభాస్ డై హార్ట్ ఫ్యాన్స్‌తో కలిసి మూవీ కూడా చూస్తానని నిఖిల్ చసోషల్ మీడియా వేదికగా తెలిపాడు. ఈ టికెట్స్ అన్నీ కూడా తనవైపు నుంచి ఫ్రీగానే ఇస్తానని ప్రామిస్ కూడా చేశాడు. మరి ఆ లక్కీ పర్సన్స్ మీరు కూడా కావొచ్చేమో. ఆలస్యం ఎందుకు ట్రై చేయండి.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.