Categories: EntertainmentLatest

Today Horoscope : ఈ రాశుల వారు తస్మాత్ జాగ్రత్త.. కీలకమైన విషయాల్లో నిర్లక్ష్యం వద్దు

Today Horoscope : బుధవారం 29-03-2023 రోజున 12 రాశులలో ఏ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది. ఎవరికి ఈ రోజు కలిసి వస్తుంది. ఎవరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ఎలాంటి కార్యక్రమాలు చేప్పటవచ్చు వంటి వివరాలను ఇప్పుడు చూద్దాం.

today-horoscope-wednesday-29-03-2023

మేషం :

ఈ రాశి వారికి మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుటుంబ సభ్యుల సహకారంతో కొన్ని కీలకమైన విషయాలను పూర్తి చేస్తారు. ఈరోజు మీ కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరంగా ఉంటారు. మరి ముఖ్యంగా కీలకమైన విషయాల్లో నిర్లక్ష్యం చేయకండి. రాశి వారు గో సేవ చేయడం వల్ల ఉత్తమమైన ఫలితాలను పొందవచ్చు.

 

వృషభం :

ఉద్యోగస్తులైన, వ్యాపారస్తులైన మీ రంగాల్లో మీకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. ముఖ్యంగా మీ తోటి వారి సహాయ సహకారాలు మీకు ఎల్లప్పుడూ లభిస్తాయి.ఈ తెలివితేటలను ఉపయోగించి కొన్ని కీలకమైన సమస్యలను పరిష్కరించి అందరి మన్ననలను అందుకుంటారు. మీరు చేపట్టే ప్రయాణాలు మీకు ఫలితాలను అందిస్తాయి గణపతి ఆరాధించడం వల్ల శుభం కలుగుతుంది.

 

మిథునం :

ఈ రాశి వారిలో ఈరోజు ఆర్థికపరమైన అభివృద్ధికి కనిపిస్తోంది. ఓ శుభవార్త వింటారు. బంధుమిత్రులతో మీరు ఈరోజు ఆహ్లాదకరంగా గడుపుతారు. అనవసర ఖర్చులు పెరిగే సూచనలు కనబడుతున్నాయి. శివుడిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.

 

కర్కాటకం :

ఈ రాశి వారు కాస్త ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి. చేపట్టే పనుల్లో ఆటంకాలు ఏర్పడే అవకాశాలున్నాయి. కాబట్టి ముందు చూపుతో వ్యవహరించి ఆటంకాలు లేకుండా చూసుకోండి. కుటుంబంలో అభిప్రాయ భేదాలురనీయకండి. ఎలాంటి సమస్యలైన సానుకూలంగా పరిష్కరించండి. ఈరోజు బంధుమిత్రుల వల్ల మీకు ఖర్చులు పెరిగే ఛాన్స్ ఉంది. సుబ్రహ్మణ్యం భుజంగ స్తవం చదవడం వల్ల ఉత్తమమైన ఫలితాలను పొందవచ్చు

 

సింహం :

ఈ రాశి వారు ఈ రోజు శుభకార్యాలలో పాల్గొంటారు ఆహ్లాదకరమైన సమయాన్ని గడుపుతారు. కొన్ని కీలకమైన విషయాల్లో మీ సన్నిహితుల సలహాలు ఫలిస్తాయి. పెద్దల సహకార పుష్కలంగా లభిస్తుంది ప్రయాణాలు చేపడతారు అవి మీకు ఫలితాలను అందిస్తాయి. ఇష్టమైన దైవాన్ని ఆరాధించడం వల్ల శుభం కలుగుతుంది.

 

కన్య :

ఈ రాశి వారికి ఈ రోజు సానుకూలంగా ఉంది. ఏ పని చేపట్టిన అందులో సత్వలితాలను సాధిస్తారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఎప్పుడూ.అందుతాయి. ముఖ్యమైన సందర్భాల్లో పెద్దల యొక్క ఆశీర్వచనాలు ఫలిసస్తాయి. ఇష్టమైన దైవాన్ని ఆరాధించడం వల్ల శుభ కలుగుతుంది

 

తుల :

ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. చేపట్టిన కార్యక్రమంలో ఆటకాలు అధికంగా ఉంటాయి. కొంతమంది ప్రవర్తన మీకు తీవ్ర నీ ఉత్సాహాన్ని కలిగిస్తుంది మీకు రావాల్సిన అవకాశాలు రాకపోవడం అవకాశాలు పక్క వాళ్లకు రావడం వల్ల తీవ్ర నిరాశకు లోనవుతారు. కుటుంబ సభ్యుల విషయంలోనూ కొన్ని గొడవలు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి మీరు ఎంత మీ కోపాన్ని తగ్గించుకుంటే అంత మంచి ఫలితం లభిస్తుంది. గో సేవ చేయడం వల్ల శుభ ఫలితాలను పొందవచ్చు.

 

వృశ్చికం :

చేపట్టిన ప్రతి పనిని కూడా ప్లాన్ ప్రకారం పూర్తి చేస్తారు. మీకు అవసరమైనప్పుడు సహాయ సహకారాలు అందించేవారు మీకు అందుబాటులోనే ఉంటారు. కొన్ని విషయాల్లో అనుకున్న దానికంటే కాస్త శ్రమ పెరిగి సూచనలు కనిపిస్తున్నాయి. ఎవరితోనూ వ్యతిరేకంగా వ్యవహరించండి ఇష్ట దైవారాధన చేయడం వల్ల.. ఉత్తమ మైన ఫలితాలు పొందవచ్చు l.

 

 

ధనుస్సు :

ఈ రాశి వారికి ఈరోజు సానుకూలంగా ఉంది. మనోబలంతో మీరు ముందుకు సాగుతారు. మీరు చేపట్టే పనుల వల్ల మీపై అధికారుల నుంచి మీరు ప్రశంసలు అందుకుంటారు. కొత్త వస్తువులు కొంటారు బంధువులతో ఆనందంగా గడుపుతారు. హనుమాన్ చాలీసా చదవడం వల్ల శుభం కలుగుతుంది.

 

మకరం :

శత్రువులను ఓడించే లక్షణాలు ఈ రాశి వారిలో పుష్కలంగా ఉన్నాయి. కొని కీలకమైన మిషయాల్లో మీ పనితీరును మెచ్చి మీ పై అధికారులు మిమ్మల్ని ప్రశంసిస్తారు. మీరు చేపట్టే ప్రయాణాలు ఫలిస్తాయి.హనుమంతుడిని దర్శించుకోవడం వల్ల మేలు కలుగుతుంది.

 

కుంభం :

ఈ రాశి వారికి ఈ రోజు సానుకూలంగా ఉంది. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రమోషన్స్ వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. బంధువులతో కలహాలు జరిగే అవకాశం ఉంది.గణపతిని ఆరాధించడం వల్ల మేలైన ఫలితాలను పొందవచ్చు.

 

మీనం :

ఏ పని చేపట్టినా మనోబలంతో ముందుకు సాగాలి. కొన్ని విషయాల్లో ఆటంకాలు ఏర్పడతాయి ఇక మీరు తీసుకునే కీలకమైన నిర్ణయాల్లో పరికం లేకుండా క్లియర్ గా ఉంటేనే మేలు జరుగుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వల్ల శుభం కలుగుతుంది.

Sri Aruna Sri

Recent Posts

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ!

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…

1 day ago

Allu Arjun: ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సంక్రాంతి బాస్ బస్టర్..బన్నీ పోస్ట్ వైరల్!

Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…

1 day ago

Tollywood: బాక్సాఫీస్ అసలైన లెక్కలు తేలేది ఈరోజు నుంచే

Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…

3 days ago

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు!

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…

4 days ago

Ashika Ranganath: టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా?

Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…

4 days ago

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఎవరో తెలుసా?

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…

5 days ago

This website uses cookies.