Today Horoscope : మంగళవారం 28-03-2023 రోజున 12 రాశులలో ఏ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది. ఎవరికి ఈ రోజు కలిసి వస్తుంది. ఎవరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ఎలాంటి కార్యక్రమాలు చేప్పటవచ్చు వంటి వివరాలను ఇప్పుడు చూద్దాం.
మేషం :
ఈ రాశి వారికి అనుకూలమైన రోజు. చేపట్టిన అన్ని పనుల్లో విజయాలను సొంతం చేసుకుంటారు. ఆర్థికపరంగా కూడా ఈ రాశి వారు అభివృద్ధి చెందుతారు. వృత్తి ఉద్యోగాల్లో కూడా వీరికి సానుకూలంగా ఉంటుంది. మీ బాధ్యతలను మీరు సంపూర్ణంగా నిర్వహిస్తారు. ఈశ్వరుడుని ధ్యానించడం వల్ల శుభ ఫలితాలను పొందవచ్చు.
వృషభం :
ఏ పనిలో అయినా సమయాను కూలంగా మీరు వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ పని విషయంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూసుకోవాలి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి. ఈ రాశి వారు ముఖ్యంగా ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ఆనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. లక్ష్మీదేవిని ఆరాదించడం వల్ల ఉత్తమమైన ఫలితాలను పొందవచ్చు.
మిథునం :
ఈ రాశి వారికి దైవబలం అధికంగా ఉంటుంది. ఆ బలంతోనే చేపట్టిన కార్యక్రమాల్లో విజయాలను సొంతం చేసుకుంటారు. పెద్దల సహకారంతో మీరు కీలకమైన నిర్ణయాలను తీసుకుంటారు. మిత్రుల సహకారం కూడా మీకు అధికంగా ఉంటుంది ఈ రాశి వారికి ఈ రోజు దివ్యంగా ఉందనే చెప్పాలి.శనీశ్వరుడిని ధ్యానించడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.
కర్కాటకం :
ఈ రాశి వారు మానసికంగా చాలా దృఢంగా ఉంటారు. ఎలాంటి పనినైనా చాకచక్యంగా చేయగలుగుతారు. శత్రువులను తక్కువగా అంచనా వేయకండి. హనుమాన్ చాలీసా చదవడం వల్ల ఉత్తమమైన ఫలితాలను పొందవచ్చు.
సింహం :
ఈ రాశి వారికి ఈ రోజు చాలా సానుకూలంగా ఉంది. ఎప్పటినుంచో కొనుగోలు చేయాలని అనుకుంటున్న స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. మొదలు పెట్టిన పనులు అన్నిటిని కూడా నూరు శాతం పూర్తి చేస్తారు. దైవబలం అధికంగా ఉంది. మీ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. సూర్యాష్టకం చదవడం వల్ల మెరుగైన ఫలితాలను పొందవచ్చు.
కన్య :
ఈ రాశి వారికి ఈ రోజు సానుకూలంగా ఉంది. ఉద్యోగస్తులు అయితే మీ పనితీరు పట్ల మీ పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకుంటారు. కొన్ని కీలకమైన విషయాల్లో మీ పెద్దల సలహాలను తీసుకుంటారు అందులోనూ విజయం సాధిస్తారు. ఎప్పటి నుంచో చేపట్టాలనుకుంటున్న పనులను కూడా మీరు పూర్తి చేస్తారు. మహాలక్ష్మిని ధ్యానించి అష్టోత్తరం చదవడం వల్ల మంచి ఫలితాలు ఉన్నాయి.
తుల :
ముఖ్యం అని అనుకున్న పనుల్లో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏ మాత్రం ఏం మరి పాటుతనం పనికిరాదు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అనవసరమైన విషయాల్లో తలదూర్చకూడదు నవగ్రహాలను ధ్యానించడం వల్ల మేలైన ఫలితాలు పొందవచ్చు.
వృశ్చికం :
ఈరోజు ఈ రాశి వారికి సానుకూలంగా ఉంది. మీ పై అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. కీలకమైన విషయాల్లో మీ పెద్దవారి సహకారాన్ని సలహాలు పొందుతారు. మీరు ఆహ్లాదకరమైన సమయాన్ని గడుపుతారు.విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రాశి వారు చంద్ర ధ్యానం చదవడం వల్ల వచ్చే ఫలితాలు ఉన్నాయి.
ధనుస్సు :
ఈ రోజు ఈ రాశి వారికి చాలా అద్భుతంగా ఉంది. సానుకూలమైన వాతావరణం కనిపిస్తోంది. మీ సొంతింటి కల నెరవేరే సూచనలు కనిపిస్తున్నాయి.ఓ శుభ వార్తలు వింటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.
మకరం :
ఈ రాశి వారికి ఈ రోజు ఉద్యోగంలో కాస్త ఒత్తిడి పెరుగుతుంది. అయినప్పటికీ మీరు ఉత్సాహంగానే పనులు పూర్తి చేస్తారు. అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. దుర్గాదేవిని ఆరాధించడం వల్ల మెరుగైన ఫలితాలు ఉన్నాయి.
కుంభం :
ఈ రాశి వారికి చాలా దివ్యంగా ఉంది. ఏ పని పూర్తి చేయాలనుకున్న ఎంతో సులువుగా అయిపోతుంది. పెద్దల సహకారం ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని గడుపుతారు. ఉద్యోగస్తుల సహకారంతో కీలకమైన పనులను పూర్తి చేయగలుగుతారు. సూర్యుడిని ఆరాధించడం వల్ల పెరిగిన ఫలితాలను పొందవచ్చు.
మీనం :
ఈ రాశి వారికి ఈ రోజు శ్రమ అధికంగా ఉంటుంది అయినప్పటికీ పరులను సులువుగా పూర్తి చేయగలుగుతారు. మీకు ఇప్పటివరకు శత్రువులుగా ఉన్నవారు మీ మిత్రులు అవుతారు. కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరమైన వాతావరణంలో గడుపుతారు ఆత్మీయుల సహాయ సహకార ఉంటుంది. కొన్ని కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం వల్ల ఉత్తమమైన ఫలితాలు పొందవచ్చు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.