Today Horoscope : గురువారం 23-03-2023 రోజున 12 రాశులలో ఏ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది. ఎవరికి ఈ రోజు కలిసి వస్తుంది. ఎవరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ఎలాంటి కార్యక్రమాలు చేప్పటవచ్చు వంటి వివరాలను ఇప్పుడు చూద్దాం.
మేషం :
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కాస్త శ్రమ పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో చేసిన పొరపాట్ల కారణంగా ఆ ఇబ్బందులను ఇప్పుడు ఎదుర్కోవాల్సి వస్తుంది. మానసిక ఆందోళన కలుగుతుంది. కొన్ని కొన్ని పనుల్లో మీరు తీవ్రమైన నిరుత్సాహాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రాశి వారు గో సేవ చేయడం వల్ల పరిస్థితులు కాస్త మెరుగవుతాయి.
వృషభం :
ఈ రాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంది అనుకోని విధంగా మీ చేతిలో డబ్బు చూపడుతుంది. మీరు ఓ శుభవార్తను వింటారు. కుటుంబ సభ్యులు బంధుమిత్రులను కలుసుకుంటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. సొంతిల్లు కట్టుకోవాలి అని అనుకునే వారికి కాస్త సానుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోవడం వల్ల మరింత మెరుగైన ఫలితాలను పొందవచ్చు.
మిథునం :
ఈ రాశి వారు పట్టుదలతో ఏ పని చేసినా అందులో కచ్చితంగా విజయాన్ని సొంతం చేసుకుంటారు. ఒకవేళ మీరు స్థానాన్ని మారినట్లు అయితే మీరు స్వస్థానానికి చేరుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఓ శుభవార్త వింటారు ఆ శుభవార్త ద్వారా మీకు మనో ధైర్యం లభిస్తుంది. మీరు చేపట్టే పనుల్లో ఎవరి మాటలు వినవద్దు.స్థిరమైన నిర్ణయాలతోనే మీరు ముందడుగు వేయగలుగుతారు దుర్గా స్తుతి చేయడం వల్ల మీరు మరింత మెరుగైన ఫలితాలను పొందవచ్చు.
కర్కాటకం :
ఈ రాశి వారు మంచి ప్రతిభావంతులై ఉంటారు వీరి ప్రతిభను గుర్తించి పెద్దలు ప్రశంసిస్తారు. అపోహలతో అనవసరంగా కాలాన్ని వృధా చేయకండి. అభివృద్ధి వైపు మీ ఆలోచనలు కొనసాగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులు అయితే ఈరోజు మీకు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈశ్రుడిని దర్శించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.
సింహం :
ఈ రోజు మీరు కీలకమైన విషయంలో నిర్ణయం తీసుకుంటారు. అయితే ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది. అయితే చేపట్టే పనుల్లో కాస్త ఇబ్బందులు ఎదురవుతాయి. ఒత్తిడి పెరుగుతుంది కాబట్టి ఒత్తిడిని అధిగమించేందుకు ప్రయత్నించండి. బంధుమిత్రులతో కలిసి వస్తుంది. అనవసరమైన ఖర్చులు చేయకండి. సుబ్రమణ్య స్వామి అష్టోత్తరం చదువుకోవడం శుభనాయకం.
కన్య :
మీరు ఏ రంగంలో ఉన్న, మీకు అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. చేపట్టిన ప్రతి పనిలో కూడా మీరు నూటికి నూరు శాతం విజయాన్ని సాధిస్తారు. బంధుమిత్రుల సహకారం కూడా మీకు మెండుగా లభిస్తుంది. దైవారాధన చేయడం ఎట్టి పరిస్థితుల్లో కూడా మానవద్దు.
తుల :
బంధుమిత్రులతో మీరు ఆప్యాయంగా ఉండండి. అవసరమైతే అందరిదీ కలుపుకొని వెళ్లాలి. కీలకమైన పనుల్లో ముందడుగు పడుతుంది కొన్ని విషయాల్లో మీకు సంతృప్తి లభిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు దైవారాధన చేయడం వల్ల ఉత్తమమైన ఫలితాలు పొందుతారు.
వృశ్చికం :
మీ ఆలోచనలు ఉత్తమంగా ఉంటాయి. ఆ ఉత్తమమైన ఆలోచనలే మీకు విజయాలను తీసుకొస్తాయి. ఉద్యోగం వ్యాపారం చేసే వారికి సానుకూలంగా ఉంటుంది.కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు ఓ శుభవార్త వింటారు. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవడం వల్ల మెరుగైన ఫలితాలను పొందవచ్చు.
ధనుస్సు :
మీరు చేపట్టిన పనుల్లో కాస్త ఆటంకాలు ఏర్పడతాయి. అయినప్పటికీ మనో ధైర్యంతో మీరు ముందుకు సాగుతారు. ఎలాంటి అడ్డగులు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. మీ మనోధైర్యమే మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని వ్యవహారాల్లో అటు ఇటుగా వ్యవహరిస్తారు. అది మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టుతుంది. కాబట్టి జాగ్రత్తగా విహరించాల్సిన అవసరం ఉంది. విష్ణు నామ స్మరణ వల్ల ఉత్తమమైన ఫలితాలను పొందవచ్చు.
మకరం :
ఈ రాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంది. ఓ శుభవార్తను వింటారు. మీ ఇంటి వారితో సంతోషంగా గడుపుతారు. మీ కుటుంబ సభ్యులు బంధుమిత్రుల వి పై అభిమానాన్ని పెంచుకుంటారు. నీకు అంత ఈరోజు సానుకూలంగానే ఉంటుంది ధన లాభం కూడా సిద్ధిస్తుంది సుబ్రహ్మణ్యస్వామిని ధ్యానించుకోవడం వల్ల శుభ ఫలితాలను పొందవచ్చు
కుంభం :
ఈ రాశి వారికి ఈ రోజు శ్రమ అధికం. చేయని తప్పులకు మీరు నింద పడాల్సి ఉంటుంది. అయినప్పటికీ వీరు ఏమాత్రం నిరాశపడకండి. మనోధైర్యంతోనే మీరు ముందుకు కదలండి. బంధు మిత్రులతో ఆచి తూచి వ్యవహరించాలి. మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది. దుర్గాదేవి ధ్యానించడం వల్ల శుభం కలుగుతుంది.
మీనం :
మీరు స్థిరమైన బుద్ధితో ముందుకు సాగితే మీ ఉద్యోగంలో మీరు ఉన్నత స్థానాన్ని చేరుకోగలుగుతారు. ఒకవేళ మీరు వ్యాపారాన్ని చేసేవారైతే అనుభవజ్ఞులైన వారి దగ్గర నుంచి సలహాలను సూచనలు తీసుకోవడం ఉత్తమం. అవసరంలో ఆదుకునే వారు మీ చుట్టుపక్కనే ఉంటారు . శివుడిని ఆరాధించడం వల్ల ఉత్తమమైన ఫలితాలు పొందుతారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.