Today Horoscope : సోమవారం 14-03-2023 రోజున 12 రాశులలో ఏ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది. ఎవరికి ఈ రోజు కలిసి వస్తుంది. ఎవరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ఎలాంటి కార్యక్రమాలు చేప్పటవచ్చు వంటి వివరాలను ఇప్పుడు చూద్దాం.
మేషం :
ఈ రాశి వారికి ఈ రోజు శ్రమ అధికంగా ఉంటుంది. బంధుమిత్రుల సహకారం లేకపోయినా మీ మీ పనుల్లో మీరు విజయాలు సాధిస్తారు. సమయానికి నిద్రపోవడం సమయానికి ఆహారం తీసుకోవడం ఉత్తమం. దూర ప్రయాణాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వృధా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి కాస్త నియంత్రణలో ఉండాలి. గో సేవ చేయడం వల్ల ఉత్తమమైన ఫలితాలను పొందవచ్చు.
వృషభం :
ఈ రాశిలో ఉద్యోగం, వ్యాపారం చేసే వారికి సానుకూలంగా ఉంది. మీ మీ పనుల్లో మీరు టార్గెట్స్ ని రీచ్ అవుతారు. విందు, వినోదం,ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఓ శుభవార్త మీ ఇంట్లో వారికి సంతోషాన్ని కలుగజేస్తుంది దైవారాధనలో ఉండడం మంచిది. దైవారాధన చేయడం మర్చిపోకూడదు.
మిథునం :
మీరు ఏ రంగంలో ఉన్న సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇష్టమైన వారికి మీరు ఈరోజు సమయాన్ని కేటాయిస్తారు వారితో మధురానుభూతులను పొందుతారు.మీరు మానసిక ఆనందాన్ని పొంది సంతోషంగా గడుపుతారు. హనుమాన్ చాలీసా, అష్టోత్తరాలు చదువుకోవడం వల్ల ఉత్తమ ఫలితాలు పొందవచ్చు
కర్కాటకం :
ఈ రాశి వరు స్థిరమైన నిర్ణయంతో ముందుకు సాగాల్సి ఉంటుంది. కాస్త కష్టమైన పని అని తెలిసిన ఆ పనిని పూర్తి చేసేందుకే ప్రయత్నించాలి. ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది . శివారాధన చేయడం వల్ల ఉత్తమమైన ఫలితాలను పొందవచ్చు.
సింహం :
ఈ రాశి వారు అధికంగా శ్రమించాల్సి ఉంటుంది. అయినా మీలోని ఉత్సాహాన్ని తాగ్గకుండా చూసుకోవాలి. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి వారితో ఏది పడితే అది చర్చించకూడదు. పంచముఖి ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం వల్ల ఉత్తమమైన ఫలితాలను పొందవచ్చు.
కన్య :
మీలోని నైపుణ్యత మీకు ఎంతో ఉపకారం చేస్తుంది. మీరు చేసే పనులను చూసి మీ పై అధికారులు మిమ్మల్ని ప్రశంసిస్తారు. గౌరవ సత్కారాలు సన్మానాలు పొందే వీలుంది. బంధువులతో ఆచి చూచి వ్యవహరించాలి. బంధువులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. వారికి దూరంగా ఉండటం మంచిది. సమయానికి నిద్రాహారాలు పోవడం మంచిది.విష్ణు సహస్రనామాలు చదువుకోవడం వల్ల ఉత్తమమైన ఫలితాలు పొందవచ్చు.
తుల :
మీలో శ్రమించే తత్వం ఎక్కువ అదే మీకు విజయాలను తీసుకొచ్చి పెడుతుంది. నీ పై అధికారులు మీ శ్రమను గుర్తిస్తారు అందుకు తగిన మీకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని కీలకై నిర్ణయాలు తీసుకుంటారు అందులో కూడా సానుకూలంగానే ఫలితాలు ఉంటాయి. శివ స్తోత్రం పాటించడం మంచిది.
వృశ్చికం :
ఈ రాశి వారు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు వీరికి సానుకూలంగా లేదు. కుటుంబ వాతావరణం కూడా అంతా అనుకూలంగా లేదు. కొన్ని పనుల్లో శ్రమ అధికమైనప్పటికీ ఎలాగైనా పూర్తి చేయాలనుకుంటారు. శారీరక శ్రమ పెరగడంతో పాటు మానసిక ఆందోళనకు గురవుతారు. కొన్ని సంఘటనలు చికాకు తెప్పిస్తాయి దైవారాధనలో ఉండడం వల్ల ఉత్తమమైన ఫలితాలు లభిస్తాయి.
ధనుస్సు :
మీకు ఈరోజు సానుకూలంగా ఉన్నప్పటికీ గిట్టని వారు ఏదోరకంగా ఇబ్బంది గురి చేయాలని అనుకుంటారు. మీ ఆలోచనలను మళ్లించే ప్రయత్నం చేస్తారు. ముందు జాగ్రత్తతో వ్యవహరించడం వల్ల మీ పనులకు ఎలాంటి ఆటంకం కాకుండా చూసుకోగలుగుతారు. చిన్నచిన్న వాటికే పెద్దగా ఆలోచించి అనవసరంగా ఆందోళనకు గురికాకూడదు. దుర్గారాధనలో వఉండటం వల్ల మంచి ఫలితాలు ఉన్నాయి
మకరం :
ఇది మీకు మంచి సమయం. మీరు చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మీ అవసరానికి తగిన సాయం మీకు తప్పనిసరిగా అందుతుంది.ధన ధాన్య వృద్ధి పుష్కలంగా ఉంది. బంధుమిత్రులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు వారితో సంతోషంగా గడుపుతారు. దైవారాధన వీడకూడదు శివనామ స్మరణ చేయడం వల్ల ఉత్తమైన ఫలితాలు ఉన్నాయి.
కుంభం :
ఈ పని ప్రారంభించిన దాని విజయవంతంగా పూర్తి చేస్తారు. కొన్ని కీలకమైన పనులను మీరు నిర్వహించవలసి వస్తుంది. ఆ పనులను సమర్ధవంతంగా నిర్వహించి మీరు సత్ఫలితాలను సాధిస్తారు. మీ పనితీరుతో మీ పై అధికారులు సంతృప్తిని వ్యక్తం చేస్తారు. బంధుమిత్రులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు.దైవరాధన ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు శివరాధన శుభదాయకం.
మీనం :
ఈ రాశి వారికి దివ్యంగా ఉంది ఈరోజు నూతన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. బంధువులు మిత్రులతో మీకు మేలు జరుగుతుంది తప్ప ఎలాంటి కీడు లేదు. ఓ వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది కనకధార స్తోత్రం చదవడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు దైవారాధన చేయడం మానవద్దు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.