Srivari Arjitha Seva : కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ప్రతిరోజు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు. అదే విధంగా స్వామివారి సేవలో భాగంగా ఎంతోమంది సేవా కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ ఉంటారు. అయితే స్వామివారి స్పెషల్ దర్శనం కోసం, సేవ కోసం ముందస్తుగానే మనం బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. స్వామివారి ఉచిత దర్శనం కోసం వెళ్లేవారు ఉంటారు అలాగే ప్రత్యేక దర్శనాలు, సర్వదర్శనానికి వివిధ రకాల టికెట్లను కొనుగోలు చేస్తూ స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉంటారు.
ఈ నేపథ్యంలోనే స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవాలి అంటే రూ.10,500 టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఇప్పుడు ఇంత ధరలో కాకుండా కేవలం 120 రూపాయలకు మాత్రమే మొదటి గడప దర్శనం చేసుకుని అవకాశాన్ని టిటిడి కల్పించారు. ఇలా స్వామివారి మొదటి గడప దర్శనం కోసం ఎలక్ట్రానిక్ ఈ-డిప్ ద్వారా అవకాశం కల్పిస్తున్నారు. ప్రతీ నెల 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు లక్కీ డిప్ ద్వారా వివరాలు నమోదు చేసుకున్న కొంతమందికి మాత్రమే ఈ అవకాశం లభిస్తుంది.
ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా మొత్తం 4 రకాల దర్శనాలు అందుబాటులో ఉంటాయి.సుప్రభాత సేవ, అర్చన, తోమాల సేవ, అష్టాదళ పాద పద్మారాధన అని వేర్వేరు సేవలు ఉంటాయి. ఇందులో అతి తక్కువ టికెట్ ధర సుప్రభాత సేవకు రూ.120గా ఉంటుంది. ఈ టికెట్ పొందడం కోసం టీటీడీ యాప్, వెబ్‌సైట్‌లో లాగిన్ అయిన తర్వాత శ్రీవారి ఆర్జిత సేవ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.ప్రతీ నెల 18వ తేదీన ఉదయం 8 గంటలకు ఈ ఈ-డిప్ ప్రారంభం అవుతుంది. 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు రిజిస్ట్రేషన్లు అందుబాటులో ఉంటాయి. ఇక అదే 20వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు.. ఈ ఈ-డిప్‌లో సెలెక్ట్ అయిన వారికి మెసేజ్‌లు వస్తాయి. దానికి సంబంధించిన పేమెంట్‌ను చేస్తే.. టికెట్ బుక్ అవుతుంది. ఏ తేదీ టికెట్ బుక్ అవుతుందో ఆ సమయానికి తిరుమలకు వెళ్లి స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చు. మూడు నెలలకు ముందుగానే ఈ టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది జూన్ నెలలో బుక్ చేసుకుంటే సెప్టెంబర్ లో స్వామివారి దర్శనం కలుగుతుంది.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.