Tholi Ekadashi: హిందువులు ఎన్నో పండుగలను జరుపుకుంటారు ఇలా హిందువులు జరుపుకునే పండుగలలో తొలి ఏకాదశి ఒకటి. ఈ ఏకాదశిని కొన్ని ప్రాంతాలలో విత్తనాల ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ ఏకాదశికి రైతులందరూ కూడా పొలాలలో విత్తనాలు విత్తుకుంటారు కనుక దీనిని విత్తనాల ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజున పెద్ద ఎత్తున రైతులు తమ ఎద్దులను అలాగే వ్యవసాయ సామాగ్రికి అలంకరించి చాలా చురుగ్గా వ్యవసాయ పనులను ప్రారంభిస్తారు. అందుకే రైతులకు ఈ ఏకాదశి ఎంతో ప్రత్యేకమైనదిగా భావిస్తారు..
ఆషాడ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అని పిలుస్తారు. అయితే సంవత్సరంలో మనకు నెలకు రెండు ఏకాదశలు చొప్పున 24 ఏకాదశలు వస్తాయి. ఇలా కృష్ణపక్షంలో ఒక ఏకాదశి శుక్లపక్షంలో ఒక ఏకాదశి వస్తుంది. 24 ఏకాదశిలలో ఆశాడ శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. పురాణాల ప్రకారం ఈ ఏకాదశి రోజు విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్తారని భావిస్తారు. ఇలా స్వామివారి యోగ నిద్రలోకి వెళ్లడం వల్ల ఈ ఏకాదశిని శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు.
ఈ ఏకాదశి రోజు ఉపవాసంతో శ్రీమహావిష్ణువును పూజించడం వల్ల ఎన్నో శుభ ఫలితాలను పొందడమే కాకుండా విష్ణుమూర్తి అనుగ్రహానికి కూడా పాత్రులవుతారు.ఇలా ఏకాదశి రోజు మొత్తం ఉపవాసంతో ఉండి మహావిష్ణువును పూజిస్తూ ద్వాదశి రోజు విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం తీర్థప్రసాదాలను తీసుకోవడం వల్ల జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని భావిస్తారు.ఈ విధంగా తొలి ఏకాదశి రోజు యోగ నిద్రలోకి వెళ్లినటువంటి మహావిష్ణువు నాలుగు నెలల తర్వాత అంటే కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటారని పురాణాలు చెబుతున్నాయి. ఇక ఏకాదశి రోజు పెద్ద ఎత్తున విష్ణు ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.