Corona Virus: గత రెండేళ్ళ కాలంలో కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని ఏ స్థాయిలో భయపెట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కోట్లాది మంది ప్రజలు కరోనా బారిన పడ్డారు. లక్షలాది ప్రజలు కరోనాతో మృత్యువాత పడ్డారు. ఇండియాలో కరోనా మరణాల సంఖ్య తక్కువగా ఉన్న, ఇతర దేశాలలో మాత్రం లక్షల్లో ప్రజలు కరోనా బారిన పడి మృత్యువాత పడ్డారు. కొన్ని దేశాలలో అయితే కరోనాతో చనిపోయిన వారిని మూకుమ్మడిగా గుంతలు తీసి పాతిపెట్టారు అంటే పరిస్థితి ఏ స్థాయిలోకి వెళ్ళిపోయిందో అర్ధం చేసుకోవచ్చు.చైనా, అమెరికా, రష్యా, కెనడా లాంటి దేశాలలో కరోనా విలయతాండవం చేసింది. ఇక భారత్ లో కూడా కరోనా సృష్టించిన విధ్వంసంతో ప్రజలు ఆర్ధికంగా, మానసికంగా, శారీరకంగా చాలా నష్టపోయారు. కనీసం మూడు పూటల తినలేని దైన్యస్థితిలోకి చాలా మంది వెళ్ళిపోయారు.
ఇక ఇప్పుడిప్పుడే ప్రపంచం ఆ కరోనా భయానక జ్ఞాపకాల నుంచి బయటకి వస్తుంది. మళ్ళీ ప్రజలు మామూలు జీవితంలోకి వచ్చి, భయాన్ని వదిలేసి జీవన ప్రయాణం కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పటికి కరోనా మనతో పాటు సహవాసం చేస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు. చాలా కాలం తర్వాత మరోసారి చైనాతో కరోనా ప్రభావం కొన్ని ప్రాంతాలలో తీవ్రంగా కనిపిస్తుంది. ఇదిలా ఉంటే ఈ కరోనా వైరస్ చైనాలోని వూహాన్ లోని వైరాలజీ ల్యాబ్ నుంచి బయటకి వచ్చిందని, ఇది మానవ సృష్టి అని ప్రపంచంలో చాలా దేశాలు నమ్ముతున్నాయి. వూహాన్ లో వైరాలజీ డిపార్ట్ మెంట్ లో పనిచేసే ఒక చైనా శాస్త్రవేత్త ఈ విషయాన్ని వీడియో రూపంలో బయటపెట్టిన రెండో రోజే కనిపించకుండా పోయాడు. అయితే చాలా కాలం తర్వాత అతను అనుమానాస్పద స్థితిలో మరణించడం విశేషం.
కరోనా వైరస్ వూహాన్ వైరాలజీ ల్యాబ్ లో ప్రయోగాల ద్వారా ఊపిరి పోసుకున్నదేనని నిర్ధారించారు. ఈ విషయాన్ని న్యూయార్క్ టైమ్స్ పత్రిక ప్రముఖంగా ప్రచురించింది. అమెరికా అందించిన నిధులతోనే ఈ వైరస్ ని వూహన్ వైరాలజీ ల్యాబ్ లో జన్యుపరంగా సృష్టించారని పేర్కొన్నారు. ఆ ల్యాబ్ నుంచి ఇది వూహాన్ లో ముందుగా బయటకి వచ్చిందని ఆ పుస్తకంలో పేర్కొన్నారు. ఇప్పుడు అండ్రూ హాఫ్ రాసిన పుస్తకం వైరల్ గా మారింది. అయితే దీనిపై చైనా ఎలాంటి సమాధానం చెబుతుంది అనేది ప్రపంచం అంతా ఎదురుచూస్తుంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.