The Rana Daggubati Show Trailer: త్వరలో పాపులర్ ఓటీటీ అమెజాన్ ప్రైం లో టాలీవుడ్ టాల్ హీరో అయిన రానా దగ్గుబాటి సరికొత్త కాన్‌సెప్ట్ తో సెలబ్రిటీ షో ని మన ముందుకు తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించిన ట్రైలర్ ని రిలీజ్ చేసి సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఇప్పటికే రానా ‘నంబర్ వన్ యారి’ అనే సెలబ్రిటీ టాక్ షోని సిరీస్ గా రూపొందించి సౌత్ లో బాగా పాపులర్ అయ్యారు. కొన్ని గ్రాండ్ ఈవెంట్స్ కి రానా హోస్ట్ గా వ్యవహరిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే.
స్మాల్ స్క్రీన్ మీద మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, నాని, ఎన్.టి.ఆర్, తమన్నా భాటియా, సమంత, లక్ష్మీ మంచు లాంటి వారు హోస్ట్ గా ఆకట్టుకున్నారు. ఇక ఆహా ఓటీటీలో నటసింహం నందమూరి బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్’ అంటూ వరుస సీజన్స్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను, ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో రానా కూడా మరోసారి ‘ది రానా దగ్గుబాటి షో’ అంటూ రాబోతున్నారు. తాజా ట్రైలర్ చూస్తే కాన్‌సెప్ట్ చాలా కొత్తగా అనిపిస్తుంది. ఈ ట్రైలర్ చూస్తే ఇప్పటికే, మన తెలుగు సినిమాను ఆస్కార్ రేంజ్ కి తీసుకెళ్ళిన దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి, కన్నడ స్టార్ రిషబ్ శెట్టి, బ్యూటిఫుల్ హీరోయిన్స్ శ్రీలీల, ప్రియాంక అరుళ్ మోహన్, మీనాక్షి చౌదరి.. కుర్ర హీరోలు అక్కినేని నాగ చైతన్య, నాని, సిద్ధు జొన్నలగడ్డ, తేజ సజ్జా, దుల్కర్ సల్మాన్, సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మలకి సంబంధించిన ఎపిసోడ్స్ షూట్ కంప్లీట్ అయినట్టుగా తెలుస్తుంది. అంతే కాదు రానా భార్య మిహికా బజాజ్ కూడా ఈ షోలో భాగం అయ్యారు.
ఫన్ తో పాటు కొన్ని కాంట్రవర్సీ క్వశ్చన్స్ కూడా రానా ఈ షోలో అడగబోతున్నట్టు హింట్ ఇచ్చారు. హై టెక్నికల్ వ్యాల్యూస్ తో రూపొందిస్తున్నారు. ఇటీవల కాలంలో సరైన సినిమాలు రాక జనాలకి ఎంటర్‌టైన్మెంట్ బాగా తగ్గిపోయింది. కాబట్టి ఖచ్చితంగా ‘ది రానా దగ్గుబాటి షో’ అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్ ని ఇవ్వడం గ్యారెంటీ అని చెప్పవచ్చు. తాజా ట్రైలర్ పై మీరు ఓ లుక్కేయండి.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.