The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘రాజా సాబ్’. మిగతా భాషల్లో ‘ది రాజాసాబ్’ పేరుతో రిలీజ్ కానుంది. డార్లింగ్ సినిమా అంటే ‘బాహుబలి’ తర్వాత నుంచి ప్రపంచ దేశాలలో ఉన్న క్రేజ్ వేరే లెవల్. ‘సలార్’, ‘కల్కి’ వంటి వరుస హిట్స్‌తో మాంచి జోష్ మీదున్న ప్రభాస్ ఇప్పుడు టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి రూపొందిస్తున్న ‘రాజాసాబ్’ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.
డార్లింగ్ బర్త్‌డే సందర్భంగా ఈ మూవీ నుంచి ప్రభాస్ న్యూ లుక్ ని మేకర్స్ విడుదల చేసి విషెస్ తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి నుంచి ఇండస్ట్రీలో ఉన్న సినీ ప్రముఖులు, డార్లింగ్ ఫ్రెండ్స్ అందరూ సోషల్ మీడియా ద్వారా బర్త్‌డే విషెస్ చెప్పారు. అయితే, తాజాగా విడుదల చేసిన ‘రాజాసాబ్’ లుక్ మీదే అందరూ చాలా ఇంట్రెస్టింగ్‌గా కామెంట్స్ చేస్తున్నారు. ఈ లుక్ ని చూస్తే రజినీకాంత్ గుర్తొస్తున్నారా..? అంటూ చర్చించుకుంటున్నారు.
గతంలో సూపర్ స్టార్ రజినీకాంత్, జ్యోతిక, ప్రభు, నయనతార నటించిన ‘చంద్రముఖి’ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలోని రజినీ లుక్ బాగా పాపులర్ అయింది. ఇప్పుడు ‘రాజాసాబ్’ సినిమాలో కూడా ప్రభాస్ లుక్ ఇంచు మించు అలాగే ఉందంటున్నారు. ఇంతకముందు టీజర్ లో ఎంతో స్టైలిష్‌గా కనిపించి షాకిచ్చారు ప్రభాస్.
ఇప్పుడు మేకర్స్ వదిలిన సరికొత్త లుక్ లో అదరగొట్టారు. కానీ, హర్రర్ నేపథ్యంలో వస్తున్న ‘రాజాసాబ్’ పోస్టర్ మాత్రం ‘చంద్రముఖి’ సినిమాలోని రజినీ పాత్రను గుర్తు చేస్తుందంటున్నారు. ఇందులో ఆయన సైకియాట్రిస్ట్‌గా, వేంకటపతి మహారాజుగా రెండు విభిన్న పాత్రల్లో అలరించారు. మరి ‘రాజాసాబ్’ సినిమాలో ప్రభాస్ ఎన్ని గెటప్స్ లో కనిపించి సందడి చేస్తారో చూడాలి. ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తుండగా..నిధి అగర్వాల్, మాళవిక మోహన్, రిద్దికుమార్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీతమందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.