Teja Sajja : టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా ప్యాన్ వరల్డ్ మూవీ హనుమాన్ తో బాక్సాఫీస్ ను బద్దలు కొట్టేందుకు రెడీ అయ్యాడు. ఈ కుర్ర హీరో కెరీర్ స్టార్టింగ్ లోనే భారీ మూవీతో తెర ముందు కనిపించబోతున్నాడు. చైల్డ్ ఆర్టిస్టుగా సినీ కెరీర్ స్టార్ట్ చేసిన తేజ ఇప్పుడు సక్సెస్ ఫుల్ యాక్టర్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. చిరంజీవి నటించిన చూడాలని ఉందిలో మాటలు రాని అబ్బాయిగా కనిపించి తన నటనతో ప్రేక్షకులను అలరించాడు. ఆ తర్వాత చాలా సినిమాల్లో స్టార్ హీరోల పక్కన చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించాడు అలా సినీ ప్రయాణం స్టార్ట్ చేసిన తేజ సజ్జా.. ఇప్పుడు హనుమాన్ తో ప్యాన్ ఇండియన్ స్టార్ అయ్యాడు. ఇక ఈ మూవీ కి తేజ సజ్జా షాకింగ్ రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
అప్పటివరకు చాలా ఆర్టిస్ట్ గా ఉన్న తేజ జాంబిరెడ్డి చిత్రంతో హీరోగా మారాడు. ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో తేజకు ఇండస్ట్రీలో గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత వరుస ప్రాజెక్ట్స్ తో దూసుకెళ్తున్నాడు.. ప్రస్తుతం హను-మాన్ అనే మూవీ తో మరోసారి ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అయ్యాడు. తేజ తన ఫస్ట్ మూవీకి రూ.5వేలు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. అలా 5వేలతో కెరియర్ మొదలుపెట్టిన తేజ సజ్జా, ఇప్పుడు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక ఈ మూవీ తర్వాత తేజ సజ్జా రేంజ్ ఓ రేంజ్ లో ఉంటుందని టాలీవుడ్ లో టాక్. అప్పట్లో ప్రిన్స్ మహేశ్ బాబు నటించిన రాజకుమారుడు, యువరాజు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించిన తేజ ఇప్పుడు మహేశ్ కు పోటీగా సంక్రాంతి బరిలోకి దిగడం ఇండస్ట్రీ లో పెద్ద హాట్ టాపిక్ గా మారింది.
హనుమాన్ మూవీ కోసం తేజ సజ్జ తీసుకున్న రెమ్యునరేషన్ కోటి పైనే ఉంటుందని టాక్ వినిపిస్తోంది. హను-మాన్ సినిమా కోసం ఏకంగా కోటి రూపాయలకు పైగానే డిమాండ్ చేశాడట తేజ. 5వేల రూపాయలతో కెరియర్ ప్రారంభించిన తేజ ఇప్పుడు కోటిక రూపాయల రెమ్యూనరేషన్ వసూలు చేసే హీరోగా మారిపోయాడు. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్యాన్ వరల్డ్ మూవీ గా హనుమాన్ రిలీజ్ కాబోతోంది. సౌత్ ఇండియన్,నార్త్ ఇండియన్ భాషలతో పాటు ఫారిన్ లాంగ్వేజెస్ లోను ఈ మూవీ ని రిలీజ్ చేయబోతున్నారు. ఈ సంక్రాంతికి హనుమాన్ వసూళ్ళ వర్షం కురిపించడం ఖాయంగా తెలుస్తోంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.