TDP: ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ మరోసారి 2024 లో అధికారంలోకి రావాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తుంది. ఈ దిశగానే చంద్రబాబు నాయుడు వ్యూహాత్మక నిర్ణయాలతో ప్రజల్లోకి బలంగా వెళ్తున్నారు. ఓవైపు జనసేనతో పొత్తుల సమీకరణాలు నడుపుతూనే మరోవైపు ఒంటరిగా పోటీ చేసిన కూడా అధికారంలోకి వచ్చేలా నిర్ణయాలు తీసుకుంటూ పార్టీ క్యాడర్ ను బలంగా జనంలోకి పంపిస్తున్నారు. ఓ విధంగా ప్రస్తుతం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల రిజల్ట్ చూసుకుంటే ప్రతిపక్ష తెలుగుదేశానికి ప్రజల నుంచి మద్దతు పెరుగుతున్నట్లుగానే అనిపిస్తుంది. తాజాగా జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. భారీ మెజారిటీతో తెలుగుదేశం అభ్యర్థులు గెలుపొందారు.
దీంతో తమ పార్టీకి ప్రజల్లో బలం పెరిగిందని టిడిపి శ్రేణులు భావిస్తున్నాయి. వైసీపీకి ప్రత్యామ్నాయంగా తమనే మరల ప్రజలు కోరుకుంటున్నారని సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెడుతూ ఉన్నారు. అదే సమయంలో జనసేన పార్టీ ప్రభుత్వ భాగస్వామ్యం కోరుకోవడంతో పవన్ కళ్యాణ్ పైన విమర్శలు చేస్తున్నారు. ప్రజాక్షేత్రంలో సంస్థాగత నిర్మాణం లేని పవన్ కళ్యాణ్ కి అధికార భాగస్వామి ఇచ్చేది లేదని తెలుగుదేశం పార్టీ శ్రేణులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉండడం సంచలనంగా మారింది.
అలాగే తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా కూడా పవన్ కళ్యాణ్ స్థాయిని తగ్గించే ప్రయత్నం చేస్తుంది. పొత్తు పెట్టుకోవాలంటే తెలుగుదేశం పార్టీ ఇచ్చిన సీట్లు తీసుకొని పోటీ చేయాలని లేదంటే ఒంటరిగా వెళ్లి అధికారంలోకి వస్తామని ఆ పార్టీ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రసారం చేస్తున్నారు. దీనిపై జనసేన పార్టీ నాయకులు గాని కార్యకర్తలు గాని సీరియస్ గా రియాక్ట్ కావడం లేదు. జనసేన పార్టీ లేకుండా ఒంటరిగా పోటీ చేసే దమ్ము తెలుగుదేశంకి లేదని వారందరూ భావిస్తున్నారు. అయితే చంద్రబాబు అండ్ కొ జనసేనకు శాసించే ఛాన్స్ ఇవ్వకూడదని ఆలోచిస్తున్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.