AP Politics: అధికార వైసీపీ పార్టీలో రోజురోజుకి అసమ్మతి నాయకులూ పెరిగిపోతున్నారు. సుమారు 50 మందికి పైగా బయటకి చెప్పకపోయిన అధిష్టానంపై గుర్రుగా ఉన్నారనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే అమలు చేస్తూ వాటిని కూడా బటన్ నొక్కి నేరుగా ప్రజల అకౌంట్స్ కి పడేలా చేస్తున్నారు. ఇక నియోజకవర్గాల అభివృద్ధికి ఎలాంటి నిధులు మంజూరు చేయడం లేదు. దీంతో హామీ ఇచ్చిన పనులని కూడా ఎమ్మెల్యేలు చేయలేకపోతున్నారు. దీంతో వారిలో తెలియని అసహనం నెలకొని ఉంది. అయితే అభివృద్ధి చేయకుండా ఇంటింటికి వెళ్లి జగనన్న అద్భుతమైన పాలన అందిస్తున్నారని చెప్పమని వైఎస్ జగన్ ఎమ్మెల్యేలకి ఫోర్స్ చేస్తున్నారు.
ఈ నేపధ్యంలో అంతర్గతంగా ఇప్పటికే వారిలో అసంతృప్తి పెరిగిపోయింది. ఈ అసంతృప్తి జ్వాలలు నెల్లూరు జిల్లాలో మొదటిగా బయటపడ్డాయి. మెల్లగా మిగిలిన జిల్లాలకి కూడా విస్తరిస్తుంది అని రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట. అయితే వచ్చే ఎన్నికలలో కనీసం 50 మంది సిట్టింగ్ లకి తిరిగి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే అవకాశం లేదని వైసీపీ వర్గాలలో కూడా వినిపిస్తుంది. అయితే వీరందరూ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వైపు దిక్కులు చూస్తున్నారు. వచ్చే ఎన్నికలలో జనసేన, తెలుగుదేశం పొత్తు పెట్టుకుంటే కచ్చితంగా అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఈ నేపధ్యంలో తెలుగుదేశం గూటికి వెళ్ళిపోయి ఎమ్మెల్యే టికెట్ లు తెచ్చుకోవాలని భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో వైసీపీలో అసంతృప్తుల కారణంగా ఇప్పుడు ఎక్కడ తమ స్థానాలు గల్లంతు అవుతాయో అని ఇన్ని రోజులు పార్టీకి ఇన్ చార్జ్ లు పనిచేస్తున్న వారు భయపడుతున్నారు. ఈ వైసీపీ వారికి చంద్రబాబు సీట్లు ఇచ్చి మమ్మల్ని పక్కన పెడితే పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తున్నారు. అయితే చంద్రబాబు ఈ చేరికలపై రియాక్ట్ కానంత వరకు సైలెంట్ గా ఉండాలని టీడీపీ నాయకులు భావిస్తున్నారు. ఇక టీడీపీలో సీట్లు రావు అనుకున్నవారు జనసేన వైపు చూసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.